
సాక్షి, విశాఖపట్నం: సంచలనం సృష్టించిన చిన్నారి సింధుశ్రీ హత్య కేసు మిస్టరీ వీడింది. సింధుశ్రీని జగదీష్ హత్య చేసినట్లు పోలీసుల నిర్థారించారు. చిన్నారిని కర్రతో కొట్టి చంపి అనారోగ్యంతో చనిపోయినట్లు నిందితులు చిత్రీకరించే యత్నం చేసినట్లు తెలిసింది. జగదీష్‌పై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతి నుంచి హత్య కేసుగా పోలీసులు మార్చారు. 24గంటల్లో పోస్టుమార్టం నివేదిక రానుంది. సింధుశ్రీ తల్లి వరలక్ష్మి పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. సింధుశ్రీ తల్లి వరలక్ష్మిపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
చిన్నారి సింధూశ్రీ మృతికి సంబంధించిన కేసులో పోలీసులు వేగవంతంగా దర్యాప్తు జరిపారు. కన్నతల్లి వరలక్ష్మి, ఆమె ప్రియుడు జగదీష్‌రెడ్డి రెండో కంటికి తెలియకుండా చిన్నారి మృతదేహాన్ని రాత్రికి రాత్రే మారికవలస శ్మశానంలో కప్పిపెట్టడాన్ని బట్టి చిన్నారిది సహజ మరణం కాక పోవచ్చునని, ఆ దిశగా నిందితులు వరలక్ష్మి, జగదీశ్వరరెడ్డిలను సీఐ రవికుమార్ విచారించారు. అలాగే వారి కుటుంబ సభ్యులు, స్థానికులను విచారిస్తున్నారు. కాగా తన కుమార్తెను భార్య వరలక్ష్మి, ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న జగదీష్ రెడ్డి హత్యచేశారని బోరవానిపాలేనికి చెందిన చిన్నారి తండ్రి బొద్దాన రమేష్ ఫిర్యాదు చేసిన విషయం విధితమే.
చదవండి: ఎంత ముద్దుగా ఉన్నావు తల్లి.. అమ్మే అంతపని చేసిందా?!
విషాదం: నాన్నా... ఇది తగునా !..
Comments
Please login to add a commentAdd a comment