
రాజేంద్రనగర్ : మరో పావుగంటలో విధుల్లో చేరాల్సిన పైలట్.. మార్గమధ్యలోనే దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ ప్రాంతానికి చెందిన మహేందర్ సింగ్ (40) ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పైలట్. సోమవారం తెల్లవారు జామున విధులకు హాజరయ్యేందుకు కంపెనీ కారులో ఇంటి నుంచి బయల్దేరారు. హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్‌రోడ్డు వద్దకు రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని వీరి కారు ఢీకొంది. దీంతో మహేందర్‌సింగ్ తల, ఛాతీకి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా ముందు భాగంలో ఎయిర్ బెలూన్లు తెరుచు కోవడంతో డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు.