
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ నుంచి కోహెడ వెళ్లే దారిలో ముందు వెళుతున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఆగి ఉన్న కారును వెనక నుంచి మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మొత్తం అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
క్షతగాత్రులను ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించారు. అయితే మంచు ఎక్కువ ఉండటం కారణంగా వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: చత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్
చదవండి: కేపీహెచ్‌బీ కాలనీ: హాస్టల్‌లో యువతి ఆత్మహత్య