Police Arrested Nithya Pellikoduku In Hyderabad - Sakshi
Sakshi News home page

HYD: మొదటి భార్యను ఒప్పించి, యువతితో యూట్యూబర్‌ రెండో పెళ్లి.. చివరికి!

Published Thu, Aug 17 2023 8:17 AM | Last Updated on Thu, Aug 17 2023 9:07 AM

 Police Arrested Nithya Pellikoduku In Hyderabad - Sakshi

హైదరాబాద్: మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా రెండో భార్యను వేధింపులకు గురి చేస్తుండటంతో బాధితురాలు ఇచ్చిన పిర్యాదు మేరకు నిత్య పెళ్లి కొడుకును బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే... బంజారాల్స్‌ రోడ్‌ నెం. 10లోని సింగాడికుంటలో నివసించే కరజాడ గాందీ(23) యూట్యూబర్‌ గా కొనసాగుతున్నాడు.

డ్యాన్సర్‌గా యూట్యూబ్‌లో పోస్టింగ్‌లు చేసే గాంధీ వద్దకు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి(20) క్లాసికల్‌ డ్యాన్స్‌ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. అయితే పెళ్లి చేసుకోవడానికి గాంధీ నిరాకరించడంతో ఇటీవల బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు అరెస్ట్‌ చేస్తారని తెలుసుకున్న నిందితుడు మొదటి భార్యను ఒప్పించి సదరు యువతిని గత మే 14న  రెండో వివాహం చేసుకున్నాడు.

 ఈ వివాహానికి మొదటి భార్య కూడా హాజరైంది. తనకు అంతకుముందే పెళ్లి జరిగిన విషయాన్ని రెండో భార్య వద్ద దాచిపెట్టి పెళ్లి చేసుకోగా ఇటీవలనే ఈ విషయం బాధితురాలికి తెలిసింది. దీంత పలుమార్లు నిలదీసింది. ఫలితంగా వేధింపులు ఎక్కువయ్యాయి. కొంత కాలంగా ఇంటికి సరిగ్గా రాకపోవడమే కాకుండా ప్రశి్నస్తే కొట్టడం ప్రారంభించాడు. మంగళవారం బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని ఓ పెట్రోల్‌బంక్‌ వద్ద తీవ్ర ఘర్షణ జరిగింది.  తాను మోసపోయానని తెలుసుకొని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాందీని అరెస్ట్‌చేసిన పోలీసులు గాందీతో పాటు మొదటి భార్యపై ఐపీసీ సెక్షన్‌ 417, 420, 494, 495, 498(ఏ), 109 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement