
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హుబ్లీ(కర్ణాటక): మామను కిడ్నాప్ చేయించిన అల్లుడి ఉదంతం నగరంలో చోటు చేసుకుంది. నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ తన అల్లుడు పవన్‌తో కలిసి శుక్రవారం ఒక స్థలాన్ని చూసేందుకు వెళ్లారు. ఈక్రమంలో దుండగులు దాడి చేసి శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేశారు. తన మామ కిడ్నాప్ అయినట్లు అల్లుడు పవన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పవన్ వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఆసీఫ్, సమీర్, మంజునాథ, ఖలీల్ అనే నిందితులతో తన మామను కిడ్నాప్ చేయించినట్లు పవన్ అంగీకరించాడు. దీంతో అతనితోపాటు మిగతా నిందితులను అరెస్ట్ చేసి శ్రీనివాస్‌ను సురక్షితంగా ఇంటికి చేర్చినట్లు విద్యాగిరి పోలీసులు తెలిపారు. అయితే కిడ్నాప్‌ను ఎందుకు చేయించారనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.