
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా సచేంది ప్రాంతంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది చనిపోగా ఆరుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. హైవేపై వేగంగా వెళ్తున్న బస్సు రోడ్డుపై ఉన్న జేసీబీని ఢీకొంది. ఆ తీవ్రతకు ఆ జేసీబీ రోడ్డు పక్కన పడిపోగా, బస్సు పల్టీలు కొట్టుకుంటూ రోడ్డు పక్క గుంతలో పడిపోయింది. బస్సులోనే ప్రయాణికులంతా ఇరుక్కుపోయి, తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనలో 17 మంది చనిపోగా ఐదుగురు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు యూపీ సీఎం ఆదిత్యనాథ్ రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం అందజేస్తామన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment