![Sexual Assault On A Girl In Kurnool District - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/14/Untitled-2.jpg.webp?itok=RKQVX8QM)
కర్నూలు(హాస్పిటల్): వలస వచ్చి కూలీ పనిచేసుకుంటున్న ఓ బాలికపై ఓ అగంతకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గంజిహల్లి గ్రామానికి చెందిన షేక్షావలి కల్లూరు ప్రాంతంలో క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ మహిళ సైతం తన 14 ఏళ్ల కుమార్తెతో కలిసి పనిచేస్తోంది. శుక్రవారం ఆ బాలికకు కడుపునొప్పి అని చెప్పడంతో చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భిణిగా నిర్ధారించారు. షేక్షావలి తనపై పలుమార్లు లైంగికదాడి చేశాడని బాలిక తల్లికి వివరించింది. దీంతో తల్లి స్థానిక దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment