Viral: Police Arrested Dharavath Srinu For Hatreed Comments Against CM KCR - Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌పై షాకింగ్‌ వ్యాఖ్యలు.. యువకుడి అరెస్ట్‌

Published Wed, May 5 2021 2:19 PM | Last Updated on Wed, May 5 2021 3:53 PM

Stundent Dharavath Srinu Shocking Comment On CM KCR - Sakshi

సాక్షి, సూర్యాపేట: మంత్రి వర్గం నుంచి ఈటల తొలగింపును నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా అసభ్య, అనుచిత వ్యాఖ్యలతో వీడియో చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ యువకుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ కావడంతో స్థానిక పోలీసులు ఇతడి గురించి ఆరా తీయగా సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం జల్మాలకుంటకు చెందిన ధరావత్‌ శ్రీను నాయక్‌గా తేలింది. ఇతడు నగరంలోని ఓ బేకరీలో పనిచేస్తున్నట్లు తెలుసుకున్న పెన్‌పహాడ్‌ పోలీసులు సోమవారం రాత్రి యువకుడిని హైదరాబాద్‌లో అరెస్టు చేసి పెన్‌పహాడ్‌ ఠాణాకు తీసుకొచ్చారు. కాగా, అదేమండలానికి చెందిన ధర్మాపురం గ్రామ సర్పంచ్‌ నెమ్మాది నగేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్‌ తెలిపారు. 

రూరల్‌ సీఐకి వినతి.. ధర్నా 
ధరావత్‌ శ్రీను అరెస్టును నిరసిస్తూ లంబాడీ విద్యార్థి సేన ఆధ్వర్యంలో కొంతమంది రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం శ్రీనును విడుదల చేయాలని కోరుతూ సూర్యాపేట రూరల్‌ సీఐకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్‌ నాగునాయక్, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రవినాయక్, నాయకులు హరీశ్‌ నాయక్, నర్సింగ్‌నాయక్, నర్సింహ్మనాయక్, సతీశ్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement