
సాక్షి, చెన్నై: భర్త లేడన్న బాధను జీర్ణించుకోలేక భార్య మృతి చెందిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లాలో చోటుచేసుకుంది. కన్నమంగళం తాలుకా రామనాథపురం గ్రామానికి చెందిన శేఖర్(60) ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. మృతదేహాన్ని వేలూరు ప్రభుత్వాస్పత్రి నుంచి అదే రోజు రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసిన భార్య కన్నగి అమ్మాల్ (55) గుండెలవిసేలా రోదించింది. సోమవారం ఉదయం స్పృహ తప్పి పడిపోయింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇద్దరూ ఒకేసారి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
చదవండి: అర్ధనగ్న స్థితిలో మహిళా డాన్సర్ మృతి.. వీడిన మిస్టరీ
Comments
Please login to add a commentAdd a comment