
ప్రతీకాత్మక చిత్రం
బిచ్కుంద/నిజామాబాద్: వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్న వ్యక్తిని ఓ మహిళ తన సోదరుడితో కలిసి హతమార్చింది. బిచ్కుందకు చెందిన మైత్రి హనుమండ్లు మృతదేహం ఈ నెల 18న బిచ్కుంద సౌదర్ చెరువులో లభ్యమైంది. విచారణ చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. గురువారం బాన్సువాడ సీఐ రామకృష్ణారెడ్డి బిచ్కుంద పోలీస్ స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. హనుమండ్ల తన ఇంటి పక్కన ఉన్న నాగమణి అనే మహిళను వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధించేవాడు.
దీంతో ఆమె తక్కడ్‌పల్లికి చెందిన తన అన్న బాలయ్య సాయంతో హనుమండ్లును హతమార్చాలని నిర్ణయించింది. ఈ నెల 16న బాలయ్య, నాగమణి హనుమండ్లును చెరువు గట్టుకు రప్పించారు. అక్కడ ఇద్దరు కలిసి హనుమండ్లు గొంతు నులిమి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment