దారికాచి కాటేశారు : చిన్నారినీ చిదిమేశారు | Woman Gangraped Tossed Into River In Bihar | Sakshi
Sakshi News home page

మహిళపై సామూహిక లైంగిక దాడి

Oct 11 2020 7:45 PM | Updated on Oct 11 2020 7:49 PM

Woman Gangraped Tossed Into River In Bihar - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లో దారుణం చోటుచేసుకుంది. మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఐదేళ్ల చిన్నారితో సహా ఆమెను నదిలోకి తోసిన ఘటన బుక్సర్‌ జిల్లాలో జరిగింది. మహిళ తన ఐదేళ్ల కుమారుడితో కలిసి ఒజా బరోన్‌ గ్రామంలోని బ్యాంకుకు వెళుతుండగా వారిని దుండగులు అపహరించారు. మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన అనంతరం బాధితురాలిని ఆమె కుమారుడిని తాళ్లతో కట్టేసి నదిలో విసిరివేశారు. చదవండి : అమెరికన్‌ మ‌హిళ‌పై లైంగిక దాడి

మహిళ అరుపులు విన్న స్ధానికులు ఆమెను కాపాడగా బాలుడిని మాత్రం రక్షించలేకపోయారు. నీటి ప్రవాహానికి బాలుడు మరణించడం విషాదం నింపింది. కాగా తాము బ్యాంకుకు వెళుతుండగా కొందరు తమను చుట్టుముట్టి దారుణానికి ఒడిగట్టారని బాధితురాలు పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్ధానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement