జీఆర్టీ జ్యూయలర్స్ షోరూం ప్రారంభం
రాజమహేంద్రవరం సిటీ: జీఆర్టీ జ్యూయలర్స్ 61వ షోరూమ్‌ను బుధవారం రాజమహేంద్రవరం డీలక్స్ సెంటర్‌లో ప్రారంభించారు. జీఆర్టీ 60 ఏళ్లుగా నాణ్యత, విశ్వాసం, బలమైన ఉనికితో వ్యాపారాన్ని సాగిస్తుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ ప్రాంతాల ప్రజల అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన బంగారం, డైమండ్, ప్లాటినం, వెండి, జాతి రత్నాల ఆభరణాలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు వివరించారు. బంగారు ఆభరణాలపై గ్రాముకు రూ.50 తగ్గింపు, బంగారు ఆభరణాల వేస్టేజీపై 20 శాతం తగ్గింపు, డైమండ్ విలువపై క్యారెట్‌కు రూ.10 వేల తగ్గింపుతో అందిస్తున్నామన్నారు. కస్టమర్లు వెండి వస్తువులు పట్టీల మేకింగ్ చార్జీలపై 25 శాతం తగ్గింపు, అన్కట్ డైమండ్ విలువపై 10 శాతం తగ్గింపు అందిస్తున్నామని జీఆర్టీ జ్యూయలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ అనంత పద్మనాభన్ తెలిపారు. కార్యక్రమంలో జ్యూయలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.
గాయపరిచిన వ్యక్తిపై కేసు
కొత్తపల్లి: యువకుడిని గాయపరిచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు బుధవారం స్థానిక పోలీసులు తెలిపారు. ఆ వివరాల్లోకి వెళితే.. అమీనాబాద్ గ్రామానికి చెందిన యువకుడు గంట శ్రీను ఆదివారం రాత్రి టిఫిన్ తెచ్చేందుకు సెంటర్‌లోకి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి శ్రీనును ఆపి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వైఎస్సార్ సీపీ టీషర్స్ వేసుకుంటున్నావని, గతంలోనే హెచ్చరించినా బుద్ధి రాలేదా అంటూ అన్నా డు. దీంతో ఇద్దరూ ఘర్షణ పడ్డారు. శ్రీనును రాజు తలపై గాయపరచగా, పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై బాధితుడు శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.
హెచ్‌ఎం వీర్రాజు సస్పెన్షన్
చాగల్లు: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ.వీర్రాజును సస్పెండ్ చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి వాసుదేవరావు బుధవారం తెలిపారు. హెచ్‌ఎం వీర్రాజు విధుల్లో అలసత్వం వహించడంతో పాటు అనర్హులకు టీసీలు విక్రయించారని నిర్థారించడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. గతేడాది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు స్వీకరించిన వీర్రాజు సస్పెండ్ కావడంతో పాఠశాల ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment