జీజీహెచ్‌లో శిశు ఆధార్ సేవలు ప్రారంభం
కాకినాడ క్రైం: జీజీహెచ్‌లో శుక్రవారం శిశు ఆధార్ సేవలు ప్రారంభమయ్యాయి. ఆసుపత్రి గైనిక్ వార్డులోని బర్త్ రిజిస్ట్రేషన్ విభాగంలో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ రాజకుమారి రిజిస్ట్రార్‌గా వ్యవహరించనున్న శిశు ఆధార్ సేవలు జీజీహెచ్ ఎంఆర్‌డీ సెక్షన్ ఆధ్వర్యంలో అందించనున్నారు. పుట్టిన వెంటనే శిశువుకు ఆధార్‌కార్డు మంజూరు చేయడమే ఈ సేవల లక్ష్యం. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, డిప్యూటీ కలెక్టర్ ఎన్.శ్రీధర్, గైనిక్ హెచ్‌వోడీ డాక్టర్ అనురాగమయి, ఎంఆర్‌డీ ఎంఆర్‌వో జయచంద్ర పాల్గొన్నారు.
‘సత్రం డోనార్ స్కీం’కు
రూ.5,01,001 విరాళం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ‘సత్రం డోనార్ స్కీం’ కింద సికింద్రాబాద్‌కు చెందిన చేకొండ నరేష్‌బాబు, విజయ, రంజిత, వినిత కుటుంబ సభ్యులు రూ.5,01,011 విరాళాన్ని ఈఓ వీర్ల సుబ్బారావుకు శుక్రవారం అందచేశారు. ఆ స్కీం కింద హరిహరసదన్ సత్రంలో ఒక గదిని కేటాయించాలని వారు కోరారు. దాతలకు ఆ సత్రంలో ఒక గదిని కేటాయించి ఈ స్కీం కింద లభించే అన్ని సదుపాయాలు అందజేయాలని ఈఓ ఆదేశించారు.
హాకీ టోర్నీకి ప్రత్యేక కమిటీలు
కాకినాడ సిటీ: స్థానిక జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 15 నుంచి 28వ తేదీ వరకు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అంశాల వారీగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తూ కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 15 నుంచి 28వ తేదీ వరకూ డీఎస్‌ఏ స్టేడియంలో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment