ఇది ప్రజల బడ్జెట్. మరింత ఇన్‌ఫ్రా, మరిన్ని ఇన్వెస్ట్‌మెంట్లు, మరింత వృద్ధి, మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా రూపొందిన ప్రగతిశీల బడ్జెట్. పేదల సంక్షేమానికి పెద్దపీట వేయడం ఇందులోని ప్రధాన హైలైట్. ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూనే, సామాన్యుడు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి సరికొత్త అవకాశాలు చూపడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందింది. ప్రతి నిరుపేదకూ పక్కా ఇల్లు, టాయిలెట్, నల్లా నీరు, గ్యాస్ కనెక్షన్‌ల కలను సాకారం చేయనుంది. ఆధునిక ఇంట ర్నెట్ కనెక్టివిటీకీ ప్రాధాన్యమిచ్చింది. యువతకు మెరుగైన భవిష్యత్తుకు భరోసానిచ్చింది.
హిమాచల్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల వంటి కొండ ప్రాంతాల్లో ఆధునిక రవాణా వ్యవస్థకు బాటలు వేస్తోంది. రైతులకు డ్రోన్లు, వందే భారత్ ట్రైన్లు, డిజిటల్ కరెన్సీ, 5జీ సేవలు, నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకో సిస్టమ్ తదితరాలతో యువత, మధ్యతరగతికే గాక పేద, దళిత, వెనకబడ్డ వర్గాలకు కూడా ఎంతో లబ్ధి చేకూరుతుంది. గంగా ప్రక్షాళనతో పాటు నది పరీవాహక రాష్ట్రాల్లో సహజ సాగును ఈ బడ్జెట్ ప్రోత్సహించనుంది. అగ్రి స్టార్టప్‌లకు ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ప్యాకేజీ వంటివి రైతు ఆదాయాన్ని బాగా పెంచేవే. వారికి రుణ హామీతో పాటు మరెన్నో పథకాలు ఈ బడ్జెట్లో ఉన్నాయి. రక్షణ బడ్జెట్లో 68 శాతాన్ని దేశీయ పరిశ్రమకే రిజర్వ్ చేయడం వల్ల ఎంఎస్‌ఎంఈ రంగానికి ఎంతో లబ్ధి చేకూరుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, అన్ని రంగాలూ మనస్ఫూర్తిగా స్వాగతించిన ’ఆత్మనిర్భర్ భారత్ బడ్జెట్’ ఇది!
Comments
Please login to add a commentAdd a comment