ఏలూరు: సభ్య సమాజం తలదించుకునేలా పదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వరుసకు అన్న అయిన యువకుడితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఏలూరు డీఎస్పీ ఈ.శ్రీనివాస్, సీఐ వైవీవీఎల్ నాయుడు చెప్పారు. మండవల్లి పోలీసుస్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలను వెల్లడించారు. కలిదిండి మండలం మట్టగుంట గ్రామానికి ఓ బాలిక ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఉంటూ మండవల్లి స్కూల్‌లో ఐదో తరగతి చదువుతోంది. హాస్టల్ సమీపంలో తల్లి అక్క, కమారుడు అబ్రహం (20)తో నివాసముంటోంది.
దీంతో కుమార్తెను అక్క ఇంటికి తల్లి అప్పుడప్పుడూ తీసుకువస్తోంది. ఈ క్రమంలో అన్న వరసైన అబ్రహం బాలికపై కన్నేశాడు. తల్లి లేని సమయంలో బాలికను హాస్టల్ నుంచి తీసుకువచ్చి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ నెల 16న అంతేకాక తనకు పరిచయమన్న పఠాన్ ఖాదర్ ఖాన్ (50)తో కలిసి సామూహిక లైంగికదాడికి దిగాడు. శుక్రవారం మరోసారి హాస్టల్ నుంచి తీసుకురావడానికి ప్రయత్నించగా, బాలిక ఏడుస్తూ వార్డెన్ నాగమణికి విషయం చెప్పగా ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది.
దీంతో బాలిక తల్లి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. మండవల్లి రైల్యేస్టేషన్ సమీపంలో అబ్రహం, ఖాదర్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ చెప్పారు. నిందితులపై పోక్సో, ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్లతో కేసు నమోదు చేశామన్నారు. ఎస్‌ఐ రామకృష్ణ పాల్గొన్నారు.
హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్
మండవల్లి బాలికల వసతిగృహ సంక్షేమాధికారిణి కె.నాగమణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టరు ప్రసన్న వెంకటేష్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముదినేపల్లి కళాశాల బాలికల హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు కె.అనితకు ఇన్‌చార్జి వార్డెన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
బాలికకు ధైర్యం చెప్పిన ఎస్పీ
ఏలూరు టౌన్ : లైంగిక దాడికి గురై ఏలూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను జిల్లా ఎస్పీ మేరి ప్రశాంతి శనివారం పరామర్శించారు. బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలికకు ధైర్యం చెప్పి తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో కేసు, ముగ్గురు నిందితుల్లో ఒకరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని, నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment