సాక్షి ప్రతినిధి, ఏలూరు: మాకు ఇదేం ఖర్మ.. చంద్రబాబు అరెస్టు అయిన రోజు నుంచి అసలైన కార్యకర్తలుగా మేము బాధపడ్డాం.. మా స్థాయిలో ఒకటి రెండు రోజులు సొంత డబ్బులుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించాం.. ప్రతిరోజూ కార్యక్రమాలు నిర్వహించే స్థాయి మాకెక్కడ ఉంటుంది.. ఇది టీడీపీ కార్యకర్తల మనోగతం.. దీక్షలతో నాకు సంబంధం లేదు.. టెంట్ నుంచి జనాల వరకు మీరే డబ్బులు ఖర్చు పెట్టి చేయాలి.. రేపు ఏం జరుగుతుందో తెలియకుండా నేను ఎందుకు ఖర్చుపెడతాను.. ఇవి ఒక నియోజకవర్గ ఇన్‌చార్జి టీడీపీ కేడర్‌తో చెప్పిన మాటలు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ దీక్షలు జరుగుతున్న తీరిది. ఇన్‌చార్జే పట్టించుకోనప్పుడు మనకెందుకులే అని కేడర్ లైట్‌గా తీసుకోవడంతో ఏలూ రుతో సహా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ రిలే శిబిరాలు ఎత్తివేయడం చర్చనీయాంశంగా మారింది.
అగమ్యగోచరంగా..
జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీ అధినేత అరైస్టె జైలుకు వెళ్లిన క్రమంలో విడుదలయ్యే వరకు రోజూ 60 మందికి తక్కువ కాకుండా రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో మొదట కొద్దిరోజులు మొక్కుబడిగా దీక్షలను అన్ని నియోజకవర్గాల్లో మొదలుపెట్టారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఏలూరు, దెందులూరు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు, నూజివీడు ఇలా ప్రధాన నియోకజవర్గాల్లో రిలే నిరాహార దీక్షలకు పార్టీ శ్రేణులు గుడ్‌బై చెప్పారు.
► దెందులూరు ఇన్‌చార్జి చింతమనేని ప్రభాకర్ భీమవరం అల్లర్ల కేసులో ఉండటంతో అప్పటినుంచి పరారీలో ఉంటూ నాలుగు రోజుల క్రితమే ముందస్తు బెయిల్‌పై జనజీవన స్రవంతిలోకి వచ్చారు. దీంతో దెందులూరులో పూర్తిగా పార్టీ కార్యక్రమాలు అటకెక్కాయి.
► చింతలపూడిలో దిక్కూమొక్కు లేకుండా ఎవరికి నచ్చిన రీతిలో వారు ఫొటో కోసం కార్యక్రమాల నిర్వహణకు పరిమితమయ్యారు.
► పోలవరం నియోజకవర్గానికి సంబంధించి కొ య్యలగూడెంలో రిలే దీక్షల శిబిరంలో ఇన్‌చార్జి బొరగం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మొడి యం శ్రీనివాస్ మధ్య వర్గపోరు మరింత ముదిరి రెండు వర్గాలు గత నెల 26న బాహాబాహీకి దిగా యి. అప్పటి నుంచి దీక్షా శిబిరం పూర్తిగా వెలవెలబోయింది.
► ఉండి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కని పించింది. ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు మధ్య విబేధాలు తారాస్థాయికి చేరడంతో వేర్వేరు క్యాంపులు ఏర్పాటుచేశారు.
► ఇక తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, కై క లూరు, నూజివీడు నియోజకవర్గాల్లో పూర్తి మొ క్కుబడిగా ఉదయం పూట గంట సమయానికే రిలే దీక్షలు పరిమితమయ్యాయి.
కలిసి రాని జనసేన నేతలు
ఉమ్మడి పశ్చిమలో జనసేన నేతలు టీడీపీ రిలే దీక్షలను, నిరసన కార్యక్రమాలను చాలా లైట్‌గా తీసుకున్నారు. పవన్‌కళ్యాణ్ జైలుకు వెళ్లి పరామర్శించి పొత్తు ప్రకటన చేసిన దగ్గర నుంచి టీడీపీ దీక్షలను పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. ముఖ్యంగా తాడేపల్లిగూడెం, భీమవరం, ఏలూరుతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో జనసేన నేతలు కనీసం పది మంది కూడా మొక్కుబడిగా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనని పరిస్థితి. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జులు జనసేన నేతలకు ఫోన్లు చేసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతున్నా ఎక్కడా పట్టించుకోని పరిస్థితే కనిపిస్తోంది.
మొక్కుబడిగా..
సాక్షి, భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు మొక్కుబడిగా సాగుతున్నాయి. రోజూ ఉదయం ఆర్బాటంగా దీక్షలు ప్రారంభిస్తున్నా మధ్యాహ్నం 12 గంటలకే కుర్చీలు ఖాళీ అవుతున్నాయి. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు గ్రూపులుగా విడిపోయారు. ప్రధా నంగా భీమవరం, ఉండి, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దీంతో చాలా మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ గూటికి చేరిపోయారు. మిగిలిన కార్యకర్తలను కూడా ముందుకు నడిపించే నాయకుడు కనిపించడం లేదు. చాలా చోట్ల ఉదయం దీక్ష ప్రారంభం, సాయంత్రం దీక్ష ముగింపు సందర్భంలో మినహా మిగిలిన సమయంలో శిబిరాల్లో పార్టీ కార్యకర్తలు కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment