
పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నారాయణ నియామకం
ఏలూరు (టూటౌన్): ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి కోర్టు, ఏలూరు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది ఏవీ నారాయణను నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పీడీజే కోర్టు పీపీగా కోనే సీతారామ్ పనిచేస్తున్నారు. ఈయన పదవీ కాలం మే 10న పూర్తి కానుండడంతో మే 11 నుంచి ఏవీ నారాయణ పీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. నెలకు రూ.45 వేలు గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఏలూరుకు చెందిన న్యాయవాది ఏవీ నారాయణ 1993–96 మధ్య ఏలూరు లా కాలేజీలో లా డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు. ఏలూరు బార్ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకుని జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. గతంలో ఆయన ఏలూరు కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా కూడా పనిచేశారు.