
● సొంతింటి కోసం రాయిపై రాయి
బుట్టాయగూడెం మండలం కామవరం అటవీ ప్రాతంలో కొలువైన గుబ్బల మంగమ్మతల్లి గుడి వద్దకు వస్తున్న వేలాది మంది భక్తులు గుడి సమీపంలో రాయి మీద రాయి పెట్టి సొంతిల్లు నిర్మించుకునే భాగ్యం కలిగించు తల్లి! అంటూ మొక్కు కుంటున్నారు. తమకు ఎటువంటి ఇల్లు కావాలో చెబుతూ కొందరు మూడు నుంచి నాలుగు రాళ్లు పేర్చి మొక్కుకుంటున్నారు. ఇలా మొక్కుకుంటే తమ కోర్కులు తీరతాయని భక్తుల నమ్మకం. ఈ మధ్య కాలంలో గుడి ప్రాంగణం సమీపంలో ఎక్కువ మంది భక్తులు రాయి మీద రాయి పెట్టి పూజలు చేస్తున్నారని ఆలయ కమిటీ తెలిపింది. – బుట్టాయగూడెం