
ధాన్యం కేంద్రాల ప్రారంభమెప్పుడో?
భీమడోలు: ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. పంట కోతలు ముమ్మరంగా చేపడుతుండగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతలు పూర్తయి చేతికందిన దాళ్వా ధాన్యాన్ని ప్రధాన రోడ్లు, అప్రోచ్ రోడ్లపై ఆరబెడుతున్నారు. నిబంధనలకు అనుగుణంగా తేమ శాతం ఉన్న ధాన్యాన్ని రోడ్లపైనే భద్రపరుచుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని, గోనె సంచులు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ఈ సమయంలో వర్షాలు పడితే నిండా మునిగిపోతామని ఆవేదన చెందుతున్నారు. భీమడోలు మండలంలో 13 వేల ఎకరాల్లో దాళ్వా వరి సాగుచేయగా 20 శాతానికి పైగా మాసూళ్లు పూర్తయ్యాయి. 1153, పీఎల్ 126 రకాల పంట వారం ముందుగా కోతలు పూర్తికాగా ఈ పంటను కాపాడుకునేందుకు రైతులు పాట్లు పడుతున్నారు. కొందరు రైతులు దళారులకు అయినకాడికి అమ్ముకుంటున్నారు.
రోడ్లపై ఆరబోస్తున్న రైతులు

ధాన్యం కేంద్రాల ప్రారంభమెప్పుడో?