
గుగ్గులోతుకు గురుజ్యోతి అవార్డు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయ, సామాజిక సేవా రంగంలో సుదీర్ఘ సేవలకు గుర్తింపుగా విశాఖకు చెందిన గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ గురు జ్యోతి రాష్ట్ర అవార్డు–2025ను ఏలూరుకు చెందిన గుగ్గులోతు కృష్ణకు ప్రకటించారు. ఆదివారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాసంశెట్టి కృష్ణమూర్తి పురస్కారానికి కృష్ణకు అందజేశారు. గోల్డ్ మెడ ల్, సర్టిఫికెట్ జ్ఞాపిక, సన్మాన పత్రాన్ని అందజేశారు. కృష్ణ ఏలూరు ఇందిరా కాలనీ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ రంగంలో 28 ఏళ్ల నుంచి సేవలందిస్తున్నారు. ఆయన్ను ఏపీటీఎఫ్1 1938 జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.రత్నం బాబు, జి.మోహన్‌రావు అభినందించారు.
పెద్దిరాజుకు పురస్కారం
ఉంగుటూరు: ఉంగుటూరు నం.1 పాఠశాల హెచ్‌ఎం శి రిమామిళ్ల పెద్దిరాజును గ్లో బల్ ఫౌండేషన్ సంస్థ ఉగా ది పురస్కారంతో సత్కరించింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పెద్దిరాజును సత్కరించి పురస్కారం అందించారు. విద్యారంగంలో సే వలకు గుర్తింపుగా అవార్డుకు ఎంపికచేశారు. పెద్దిరాజును ఎంఈఓ రవీంద్రభారతి, ఎంఈఓ పరసా వెంకటేశ్వరరావు అభినందించారు.
ఇంటర్ విద్యార్థులకు బస్ పాస్‌లు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశించిన విద్యార్థులకు తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో వారికి బస్ పాస్‌లు మంజూరు చేయనున్నారు. పాత ఐడీ కార్డుల ఆధారంగా బస్‌పాస్‌లు ఇస్తామని జిల్లా ప్రజా రవాణా అ ధికారి ఎన్‌వీఆర్ వరప్రసాద్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశించిన విద్యార్థులకు మాత్రమే రాయితీ బస్ పాసులు ఇస్తున్నామని పేర్కొన్నారు.
స్కౌట్స్, గైడ్స్‌లో రికార్డు
తాడేపల్లిగూడెం రూరల్: తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మండలంలోని పెదతాడేపల్లి గురుకుల విద్యాసంస్థ చోటు దక్కించుకుంది. పాఠశాలకు చెందిన 450 మంది విద్యార్థులు 18 యూనిట్లుగా ఏర్పడి స్కౌ ట్స్, గైడ్స్‌లో ప్రవేశ పరీక్ష రాసి అర్హత సాధించారు. ఒకే పాఠశాల నుంచి 450 మంది విద్యార్థులు స్కౌట్స్, గైడ్స్ విభాగంలో చేరడాన్ని అభినందిస్తూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కల్పించినట్లు ఆ సంస్థ రాష్ట్ర పరిశీలకులు సిరిమువ్వ శ్రీనివాస్ తెలిపారు.

గుగ్గులోతుకు గురుజ్యోతి అవార్డు