
పులిని కాస్త దూరంలో చూసినా పైప్రాణాలు పైకే పోతాయేమో అన్నట్లే భయపడతాం. అదే పులి ఒక్క ఉదుటన దూకి వస్తే ఇంకెలా ఉంటుంది.. ఇక ఆ పరిస్థితి వర్ణణాతీతమే. ఈ తరహా ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఆ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో చూస్తే మాత్రం పులి భయపెట్టిన తీరు అలా సరదాగా రైడ్‌కు వెళ్లిన వారి వెన్నులో వణుకు పుట్టించిదనే చెప్పాలి
కొంతమంది కలిసి టాప్ లెస్ జీప్‌లో ‘విహార యాత్ర’ కు బయల్దేరారు. వారు అలా స్లోగా వెహికల్‌లో వెళుతుండగా, పులి ఉన్నపళంగా దూకుతూ వారిపైకి రాబోయింది. వారు గట్టిగా కేకలు వేస్తూ వెహికల్‌ను ముందుకు కదిలించే క్రమంలో కూడా పులి మరొక్కసారి బయపెట్టింది. ‘ నా అడ్డాలోకి వస్తే ఇలానే ఉంటుంది’ అనేంతగా జర్క్‌లు ఇచ్చింది. అంతే వారు అక్కడ ఉండటం మంచిది కాదని విషయం అర్ధమై మెల్లగా జారుకున్నారు. పులి కూడా వారు వెళ్లిపోవడం చూసి ఇక దాడి చేయడానికి వెనుకాడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దీన్ని బట్టి ఏమి అర్ధమవుతుందంటే వన్య ప్రాణాల జోలికి వెళితే ఏమైనా జరగొచ్చనే విషయం అవగతమవుతోంది. ఏదో సరదాగా కోసం ముచ్చటపడితే మాత్రం అందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు.
Bhaiya, chalo chalo...ho gaya!!!🤣 pic.twitter.com/E3oPegDwaF— Dr. Ajayita (@DoctorAjayita) July 15, 2023