యాంటీ బయాటిక్స్ మందుల వాడకం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే తప్పదంటే తప్ప వీటిని డాక్టర్లు ప్రిస్కెప్షన్‌గా రాయరు. కానీ వైద్యులతో సంబంధం లేకుండా ప్రజలే ఏ చిన్న ఆరోగ్యపరమైన సమస్య వచ్చినా యాంటీ బయాటిక్స్‌ను మందుల దుకాణాల్లో కొనుగోలు చేసి మింగేస్తున్నారు. ఈ వాడకం కొత్త రకం సమస్యలకు దారి తీస్తోంది.
విజయనగరం ఫోర్ట్ : యాంటీ బయాటిక్స్ మందులను జనం తెగ మింగేస్తున్నారు. జిల్లాలో వీటి వినియోగం బాగా పెరిగింది. చిన్నపాటి జలుబు, దగ్గు వంటి వాటికి కూడా ప్రజలు యాంటీ బయాటిక్స్ వాడుతున్నారు. కొంతమంది ఆర్‌ఎంపీలు చీటికి మాటికీ యాంటీ బయాటిక్స్ ఇవ్వడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు కిడ్నీ, లివర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు.
యాంటీ బయాటిక్స్ అధిక మోతాదులో వాడడం వల్ల ప్రస్తుతం కొత్త చిక్కు వచ్చి పడింది. బాక్టీరియా లు సైతం యాంటీ బయాటిక్స్ మందులకు అలవా టు పడడంతో జ్వరాలు కూడా తగ్గక రోగులు రోజు ల తరబడి మంచాన పడి మూలుగుతున్నారు. వీటి వల్ల శరీరంలో సహజ సిద్ధంగా ఉండే వ్యాధి నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రమాదకర స్థాయికి యాంటీ బయాటిక్స్ వాడకం పెరిగిపోవడం వల్ల ఇప్పటికైనా నియంత్రణ చర్యలు చేపట్టాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చిన్న రోగాలకు కూడా..
పట్టణం, పల్లె అనే తేడా లేకుండా యాంటీ బయాటిక్స్ మందులు అ«ధికంగా వినియోగిస్తున్నారు. కొంత మంది ఆర్‌ఎంపీలు వద్ద తీసుకోగా, మరి కొంతమంది మందుల దుకాణాల వద్ద నేరుగా తెచ్చుకుని వాడుతున్నారు. జలుబు చేసినా.. దగ్గు వచ్చినా.. జ్వరం వచ్చినా.. తలనొప్పి, నడుం నొప్పి, చర్మ వ్యాధులు ఇలా ఏ జబ్బుకు అయినా యాంటీ బయా టిక్స్ తప్పనిసరిగా వాడేస్తున్నారు.
వ్యాధి తీవ్రతను బట్టి యాంటి బయాటిక్స్ వాడాల్సి ఉంది. కానీ చాలా మంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. యాంటీ బయాటిక్స్ మందులు ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీ, కాలేయ వ్యాధుల బారిన పడి మంచాన పడుతున్నారు.
జిల్లాలో 1200 మందుల దుకాణాలు
జిల్లాలో 1200 మందుల దుకాణాలు ఉన్నాయి. ఏడాదికి సుమారు 50 లక్షలకు పైగా యాంటీ బయా టిక్స్ మాత్రలు జనం వాడుతున్నారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండానే మందుల దుకాణాల్లో విచ్చల విడిగా యాంటి బయాటిక్స్ మందులు విక్రయిస్తు న్నారు. కొంత మంది నేరుగా మందుల దుకాణానికి వెళ్లి అడగగానే వీటిని ఇచ్చేస్తున్నారు. రైతులు, కూలీలు, ఒళ్లు నొప్పులు వచ్చిన వారు ప్రతీ సారి డైక్లోఫినాక్ ఇంజిక్షన్‌గాని లేదా యాంటీ బయాటిక్ మాత్రలుగాని మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి వాడేస్తున్నారు. వాటి వల అనర్ధాలు తెలియక తాత్కాలిక ఉపశమనం కల్గడంతో వాటినే ఆశ్రయిస్తున్నారు. ప్రిస్కప్షన్ లేకుండా మందులు అమ్మ కూడదన్న నిబంధన ఉన్నప్పటికి అమలు కావడం లేదు.
ప్రమాదమే...
నొప్పి నివారణ మందులు ఎక్కువగా వాడితే ప్రమాదమే. ప్లారోసిస్ వలన నొప్పులు ఎక్కువ గా ఉంటాయి. నొప్పి నివారణకు వాడే మందు లు వల్ల కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది. కొన్ని రకాల యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది. కొన్ని రకాల ఇంజక్షన్లు కిడ్నీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వైద్యుని సలహా లేకుండా ఎటువంటి యాంటీ బయాటిక్స్ వాడకూడదు. – డాక్టర్ ఎస్.అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment