#Ayodhya Ram Mandir అయోధ్య శ్రీరాముని మందిరి ఆధునిక ఇంజినీరింగ్‌లో ఒక అద్భుతమని, ఇది కేవలం బలమైన భూకంపాలు ,అత్యంత తీవ్రమైన వరదలను తట్టుకునేలా తయారు చేసినట్టు, అయోధ్య రామమందిరాన్ని నిర్మిస్తున్న దేశీయ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రకటించింది. దీంతో అయోధ్య రామ మందిర నిర్మాణ శైలి చర్చల్లో నిలిచింది. నిజంగానే ఇది వెయ్యేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటుందా? దీనికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలున్నాయి లాంటి ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో బిల్డింగ్ రీసెర్చ్ సంస్థలు, నిపుణులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం.
నూతనంగా నిర్మించిన రామమందిరంలో నేడు(జనవరి 22న) అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్న 12:29:08 సెకన్లకు బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాని మోదీ చేతులు మీదుగా అత్యంత ఘనంగా నిర్వహించారు. జనవరి 24 నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు. ఐఐటీ చెన్నై ఇంజనీర్లు, నిపుణుల సలహాలు సూచనలతో, అయోధ్యలో ఎల్ అండ్ టీ సంస్థ నిర్మిస్తున్న శ్రీరామ దేవాలయం కేవలం ప్రార్థనా స్థలంగానే కాకుండా ప్రాచీన విశ్వాసం , ఆధునిక విజ్ఞాన సమ్మేళనంగా నిలవబోతోంది.
ఇదీ చదవండి: సుదృఢ నిర్మాణం... సుందర రూపం.. రామాలయం!
ఈ ఆలయ నిర్మాణ విశేషాలు
► టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్వహణతో లార్సెన్ అండ్ టూబ్రో ఖచ్చితమైన ప్రణాళిక, వినూత్న నిర్మాణ సాంకేతికతలతో నిర్మస్తోంది. సంప్రదాయ నగారా శైలి, వాస్తు శిల్పం ఆధారంగా ఆ ఆలయాన్ని రూపొందించారు. సిమెంట్ , ఇనుముతో కాకుండా పూర్తిగా రాతితో నిర్మించారు. ఇతర పదార్థాలతో పోలిస్తే రాయికి ఎక్కువ జీవితకాలం, మంచి మన్నిక ఉండటంతోపాటు, భూకంపాలను కూడా తట్టుకుంటుందని భావిస్తున్నారు. ఇది 6.5 తీవ్రతతో కూడిన భూకంపాన్ని కూడా తట్టుకోగలదు. ఈ ఆలయానికి1,000 సంవత్సరాల వరకు మరమ్మతులు అవసరం లేదని అంచనా. ఈ ప్రాంతంలోని వరద రికార్డులను కూడా పరిశీలించిన ఇంజనీర్లు, భవిష్యత్తులో ఎలాంటి వరదలు రాకుండా సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
#WATCH | Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya.#RamMandirPranPrathistha pic.twitter.com/kKivThGh67
— ANI (@ANI) January 22, 2024
► ఆలయ నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణలలో ఒకటి దీని పునాది. ఫ్లై యాష్, దుమ్ము రసాయనాలతో తయారు చేయబడిన 56 పొరల కాంపాక్ట్ కాంక్రీటు మిశ్రమంతో 15 మీటర్ల మందపాటి రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీటుపై దీన్ని ఏర్పాటు చేశారు.
► 21 అడుగుల మందపాటి గ్రానైట్ పునాదితో దీన్ని మరింత పటిష్టం చేశారు. ఇది ఆలయాన్ని తేమ నుండి రక్షిస్తుంది. నిర్మాణ ప్రక్రియలో ప్రత్యేకమైన సవాళ్లు ముఖ్యంగా సెల్ఫ్-కాంపాక్ట్ కాంక్రీటు ఉష్ణోగ్రతను 18 డిగ్రీల కంటే తక్కువ పరిసర ఉష్ణోగ్రత వద్ద నిర్వహించడం. ఇందుకోసం ఆన్-సైట్ ఐస్ క్రషింగ్ ప్లాంట్లతో బయటి ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తగ్గించడానికి పునాదిని రాత్రిపూట మాత్రమే నిర్మించారు.
► 150 మంది ఇంజనీర్లు, వేలాది మంది నిపుణులైన కార్మికులు ఇందుకు కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డారు. 360 స్తంభాలతో నిర్మించిన రామ మందిర సముదాయం 380 అడుగుల పొడవు(తూర్పు-పశ్చిమ దిశ), 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది
► చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సలహా మేరకు ఇంజనీర్లు 15 మీటర్ల మేర మట్టిని తవ్వి పైమట్టిని తొలగించారు. ఆ తర్వాత రీ-ఇంజినీరింగ్ చేసిన మట్టితో నింపారు. రీ-ఇంజనీరింగ్ మట్టి 14 రోజులలో రాయిగా ఘనీభవిస్తుంది. ఇలా మొత్తం 47 పొరలు జాగ్రత్తగా వేశారు.
►ఆలయ నిర్మాణంలో రాయిని ఉపయోగించడంపై రూర్కీలోని CISR-సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CBRI) డైరెక్టర్ ప్రశంసించారు. ఇది ఇతర పదార్థాల కంటే ఎక్కువ కాలం ఉంటుంది. అలాగే నిర్మాణంలో ఇనుము తుప్పు పడుతుందనే ఆందోళన కూడా ఉండదని పేర్కొన్నారు.
One of my friends working with L&T posted at Ayodhya RAM mandir site sent this video of temple from inside. Absolutely amazing. Stunningly beautiful. Absolutely Divine. A symphony in stone. 👍👏🙏👍🙏🏻🙏🏻 pic.twitter.com/8Ge45FrRkn
— Jandial Naresh (@JandialNaresh) January 21, 2024
మరో విశిష్టత, శ్రీరామనవమికి అద్భుత దృశ్యం
ఈ ఆలయంలో CBRI రూపొందించిన ప్రత్యేకమైన నూన్ రిఫ్లెక్షన్ మరింత ఆశ్యర్యంగా నిలుస్తోంది. శ్రీరామ నవమి సమయంలో మధ్యాహ్న సమయంలో ఈ మందిరంలోని విగ్రహాల నుదుటిని సూర్యకిరణాలు తాకే అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఇది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పెంచుతుందని కంపెనీ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment