నగర యువతలో పెరుగుతున్న క్రేజ్
ఫ్యాషన్ ఐకాన్స్‌గా హీరోలు, క్రికెటర్లు
విరాట్ నుంచి విజయ్ దేవరకొండ వరకూ..
సెలబ్ బ్రాండ్స్‌కి గ్రాండ్ బిజినెస్
మార్కెట్ ట్రెండ్ సెట్ చేస్తున్న తారలు
ప్రముఖ సినీతారలు, క్రీడాకారులు, ఫ్యాషన్ ఐకాన్స్, సింగర్స్, డ్యాన్సర్స్.. ఇలా విభిన్న రంగాల్లో సెలబ్రిటీలు తమ కళ, నైపుణ్యాలతో అభిమానులను అలరిస్తుంటారు. ఈ క్రమంలో ప్రేక్షకులతో, అభిమానులతో ఏర్పడిన ప్రత్యేక అనుబంధం వారిని సెలబ్రిటీలుగా మారుస్తుంది. ఇలా వారి వారి రంగాల్లో తారలుగా వెలుగొందుతూనే, వారికున్న ఇమేజ్, ప్రశస్తిని వ్యాపారంగానూ మార్చుకునే ట్రెండ్ గతంలోనే మొదలైంది. చాలా వరకూ సెలబ్రిటీలు వివిధ బ్రాండ్‌లకు, ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంటారు. అయితే కొందరు మాత్రం సొంత బ్రాండ్‌లను ఆవిష్కరిస్తుండడం విధితమే. ఇందులో టాలీవుడ్ స్టార్లు మొదలు బాలీవుడ్ తారలు, భారతీయ క్రికెటర్లు తదితర సెలబ్రిటీలు ఉన్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
మోడ్రన్ ట్రెండ్స్, అధునాతన ఫ్యాషన్ హంగులకు ఎల్లప్పుడూ వేదికగా నిలిచే హైదరాబాద్ నగరం ఈ సెలబ్రిటీ బ్రాండ్లకు సైతం కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో నగర వేదికగా క్రేజ్ పొందుతోన్న కొందరు సెలబ్ బ్రాండ్స్ గురించి తెలుసుకుందామా..
మేము సైతం..
టాలీవుడ్ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న మహేష్ బాబు కూడా ఈ ఓన్ బ్రాండ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టి కొన్ని సంవత్సరాలు కొనసాగించారు. ‘ది హంబుల్ కో’ అనే క్లాతింగ్ బ్రాండ్‌తో మహేష్ అలరించి మధ్యలో ఆపేశారు. తన బ్రాండ్ పేరు మధ్యలో ‘ఎమ్‌బి’ అనే ఇంగ్లిష్ అక్షరాలు వచ్చేలా చూసుకున్నాడు. ఇదే కోవలో ప్రముఖ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సైతం ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 1 విడుదలై, విజయవంతమైన సమయంలో ‘బీ ఇస్మార్ట్’ అనే బ్రాండ్‌ను ఆవిష్కరించారు. ప్రస్తుతం అది అందుబాటులో లేదని సమాచారం.
యూ వి కెన్..
క్యాన్సర్ నుంచి బయట పడిన అనంతరం తనలాంటి క్యాన్సర్ బాధితులకు సహకారం అందించడమే లక్ష్యంగా ప్రముఖ ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ‘యూ వి కెన్( ్గౌu గ్ఛి ఇ్చn...)’ అనే ఎన్‌జీవోను ప్రారంభించారు. ఈ సంస్థకు ఆర్థిక వనరుల కోసం అదే పేరుతో అథ్లెటిక్ వేర్, క్యాజువల్ వేర్‌ను ఆవిష్కరించారు. క్రీడాకారులు, క్రీడా రంగానికి చెందిన వివిధ వ్యక్తులు ఈ బ్రాండ్‌ను బాగా ఆదరిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం యూవీ ఇదే సంస్థ తరపున నగరంలో ఓ కార్యక్రమం నిర్వహించారు.
‘రాన్’.. రన్
అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అటు ఆటలో దూకుడుతోనూ.. ఇటు మోస్ట్ ఫ్యాషనబుల్ పర్సనాలిటీతోనూ ఎప్పుడూ మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీగా అలరిస్తుంటాడు. అయితే విరాట్ కోహ్లికి సైతం ‘రాన్’ అనే సొంత క్లాతింగ్ బ్రాండ్ ఉంది. ఈ బ్రాండ్‌కు దేశవ్యాప్తంగానే కాకుండా నగరంలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక్కడి ఆదరణ గమనించిన కోహ్లి.. తన బ్రాండ్ అంబాసిడర్ ఎబీ డివీలియర్స్‌తో ప్రత్యేక కార్యక్రమాన్ని నగరంలో నిర్వహించాడు. ఎబీ డివీలియర్స్ తనతో ఆర్‌సీబీ టీమ్ మేట్‌మాత్రమే కాదు, తన బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నాడు. మోడ్రన్, క్లాసీ లుక్స్ ఈ బ్రాండ్ ప్రత్యేకత.
ఏ ‘ఊకో కాక’..
సింగర్‌గా గల్లీ నుంచి ప్రయాణం ప్రారంభించి ఆస్కార్ వేదిక వరకూ ఎదిగిన లోకల్ బాయ్ రాహుల్ సిప్లిగంజ్ సైతం ఈ వ్యాపారంలోకి వచ్చారు. తన వ్యక్తిత్వానికి తగ్గట్టే ‘ఊకో కాక’ అనే పేరుతో క్లాతింగ్ స్టోర్లు ప్రారంభించాడు. మధ్య తరగతి కుటుంబాలు మొదలు రిచ్ పీపుల్ వరకూ ఈ బ్రాండ్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. లోకల్ ఫ్లేవర్‌తో, మాస్, ట్రెండీ లుక్స్‌తో ఈ బ్రాండ్ దూసుకుపోతోంది.
సచిన్ సైతం..
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఒక మతమైతే సచిన్ టెందుల్కర్‌ని దేవుడిలా కొలుస్తారు. అలాంటి సచిన్ సైతం ఫ్యాషన్ రంగంలో సొంత బ్రాండ్‌తో బిజినెస్ చేస్తున్నాడు. అరవింద్ ఫ్యాషన్‌తో సంయుక్తంగా జతకట్టి మగవారికి సంబంధించిన నాణ్యమైన కలెక్షన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వారసత్వ వైభవాన్ని ప్రదర్శించేలా అధునాతన హంగులనూ అవసోపన పట్టిన ఈ డిజైన్స్‌కు మంచి ఆదరణ ఉంది. దీంతో పాటు సచిన్ టెందుల్కర్ స్పిన్నీ, బూస్ట్, బీఎండబ్ల్యూ వంటి వ్యాపారాల్లోనూ భాగస్వామిగా ఉన్నారు.
‘అల్లూ’రిస్తూ...
తెలుగు సినిమాల్లోనే కాకుండా ప్రస్తుతం పాన ఇండియా స్థాయిలో స్టైలిష్ స్టార్‌గా ప్రత్యేక గుర్తింపున్న అల్లు అర్జున్ సైతం ‘ఏఏ’ బ్రాండ్ ఆవిష్కరిస్తున్నారని పలుమార్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ‘ఏఏ’ పేరుతో కొన్ని లోకల్ బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి.
ఫ్యాషన్ డిజైనర్..
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాకు సైతం నగరంలో ప్రత్యేకంగా స్టోర్ ఉండటం విశేషం. తన డిజైన్స్‌ను నగరంలో ప్రమోట్ చేయడం కోసం కరీనా కపూర్ వంటి బాలీవుడ్ తారలతో నగరంలో అతిపెద్ద ఫ్యాషన్ షోలను సైతం ఈ ఫ్యాషన్ ఐకాన్ నిర్వహించాడు.
‘రౌడీ’ బాయ్స్..
టాలీవుడ్ టు బాలీవుడ్ వరకూ ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వినూత్న కథాంశాలు, మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్‌తో అతి తక్కువ సమయంలో టాప్ హీరోల స్థాయిలో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అదే హవాను కొనసాగిస్తూ ‘రౌడీ’ అనే ఇండియన్ స్ట్రీట్ కల్చర్ టాప్, బాటమ్ వేర్ బ్రాండ్‌ను ప్రారంభించారు. సరికొత్త ట్రెండ్స్‌ను ఇష్టపడే యూత్ ఈ రౌడీ బ్రాండ్‌ను బాగా ఆదరిస్తున్నారు. ఈ బ్రాండ్ యాడ్స్‌లో కూడా అప్పుడప్పుడు మెరుస్తూ సొంత బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకుంటున్నాడు విజయ్. సినిమా ఫంక్షన్లు, టీవీ షోలలో విజయ్ తన బ్రాండ్ దుస్తులనే ధరిస్తూ హ్యండ్సమ్ లుక్స్‌తో అలరిస్తుంటారు. ఈ బ్రాండ్ ఆన్‌లైన్ రౌడీ క్లబ్‌లో లభ్యమవుతాయి.
బీయింగ్ హైదరాబాదీ..
దేశ వ్యాప్తంగా ఫ్యాషన్ మార్కెట్‌లో బీయింగ్ హ్యూమన్‌ది ప్రత్యేక స్థానం. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సొంత బ్రాండ్ కావడంతో దీనికి మంచి ఆదరణ ఉంది. 2007 నుండి సల్మాన్‌ఖాన్ బీయింగ్ హ్యూమన్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి బీదవారి ప్రాథమిక విద్య, వైద్యానికి ఆర్థిక సహాయం అందిస్తున్నాడు. 2009 నుండి బీయింగ్ హ్యూమన్ పేరుతో ఫ్యాషన్ ఉత్పత్తులను ప్రారంభించాడు. వచ్చే ఆదాయాన్ని తన స్వచ్ఛంద సంస్థ తరపున సేవా కార్యక్రమాలకే ఖర్చుపెడుతున్నాడు. హైదరాబాద్‌లో సల్మాన్ ఖాన్‌కు అధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సల్మాన్‌కు నగరంతో ప్రత్యేక అనుబంధముంది. తన చెల్లి పెళ్లిని సైతం ఇక్కడే చేయడం తెలిసిందే.
గ్లామర్ క్వీన్స్..
ప్రియాంక చోప్రా అనోమ్లీ బ్యాటీ ఉత్పత్తులు, దీపికా పదుకొనె ఆల్ అ»ౌట్ యూ, సమంత సాకి, అనుష్క శర్మ నుష్ వంటి బ్రాండ్లు కూడా ఇక్కడ లాభాల్లో అమ్ముడవుతున్నాయి. గ్లామర్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తున్న ఈ తారల సొంత బ్రాండ్లు ఫ్లిప్‌కార్ట్, మింత్ర లాంటి అన్‌లైన్ పోర్టల్స్‌లో లభ్యమవుతుండగా.. సమంత మాత్రం సాకి.కామ్ పేరుతో సొంత ఈకామర్స్ పోర్టల్ నడుపుతోంది.
టాప్‌లో..
వీరితో పాటే ధోనీ సెవెన్ బ్రాండ్, విరేంద్ర సెహా్వగ్ వీఎస్ బ్రాండ్లకు సైతం ఇక్కడ మంచి ఆదరణ ఉంది. ఈ కామర్స్ పెరిగిపోవడంతో అందిరి సెలబ్రిటీల బ్రాండ్స్ అభిమానులు ఆర్డర్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment