సంక్రాంతి అంటేనే కోడిపందేలకు పెట్టింది పేరు. అందులోనూ గోదావరి జిల్లా ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కోడిపందేల కోలాహలమే కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంబరాల పేరిట కోడిపందేలను ప్రభుత్వం నిషేధించినా, ‘తగ్గేదే లే’ అంటూ ఈ పందేలు ఏటా జరుగుతూనే వస్తున్నాయి. ఇప్పుడు ఈ కోడిపందేల కోలాహలం అమెరికాకూ వ్యాపించింది. తాజాగా అమెరికాలో ఇద్దరు కోడిపందెం రాయుళ్లను కెంటకీ స్టేట్ పోలీసులు అరెస్టు చేశారు.
వారి దగ్గర ఉన్న కోళ్లను స్వాధీనం చేసుకుని, రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది. మన దేశంలో జరిగే కోడిపందేల్లాగానే అమెరికాలోనూ కోడిపందేలు జరుగుతుంటాయి. బరిలోకి దించే పుంజులపై పందెం రాయుళ్లు, అలాగే పుంజుల పెంపకందారులు భారీగా పందేలు కాస్తుంటారు. పందేల కోసం పుంజులను సుమారు ఏడాది పాటు పుష్టిగా పెంచుతారు. పందెంకోళ్లకు పెట్టే ఆహారానికి, వాటి ఆరోగ్యానికి భారీగా ఖర్చు చేస్తుంటారు. ఏది ఏమైనా కత్తులతో కుత్తుకలు తెగేలా సాగే పుంజుల పోరాటాలు ఏ దేశంలో జరిగినా, చూడటానికి వచ్చే వారి సంఖ్య మాత్రం తగ్గటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment