పిల్లల్లని వేధించే వాటిలో టాన్సిల్స్ సమస్య ఒకటి. చాలామంది పిల్లలు దీనిబారినపడి పెద్దల్ని నానా ఇబ్బందులు పెడుతుంటారు. ఆఖరికి సర్జరీ చేయించి తీసేయడం జరుగుతుంది. అసలు ఎందుకొస్తుంది. దీన్ని నివారించాలంటే ఏం చేయాలి తదితరాల గురంఇచ ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లో చూద్దాం.
కొన్ని సార్లు ఇబ్బంది పెట్టినా కూడా టాన్సిల్స్ మంచివి. మనం తీసుకున్న ఆహారంలో ఉండే బాక్టీరియా లాంటి కొన్ని రకాల క్రిములని ఈ టాన్సిల్స్ అడ్డుకుంటాయి. ఒంట్లో బాగా వేడి చేస్తే ఈ టాన్సిల్స్ వాపు చేసి నొప్పి పెడతాయి. టాన్సిల్స్ రావడానికి ప్రధాన కారణం వేడి చేసే పదార్దాలు తినడం (ఫ్రిడ్జ్లో నీరు తాగడం,. కూల్ డ్రింక్స్, మసాలాలు, కారం, పచ్చళ్ళు లాంటివి అన్నమాట). వాతావరణానికి తగ్గట్లు ఆహారపు అలవాట్లలో కొంచెం మార్పు చేసుకుంటే టాన్సిల్స్ పెద్దగా ఇబ్బంది పెట్టవు.
ఒకవేళ మీరు నొప్పితో బాధపడుతుంటే డాక్టరు దగ్గరకి వెళ్లేముందు ఒక్కసారి ఇది చేసి చూడండి. రాళ్ళ ఉప్పు వేసిన వేడి నీరు గొంతు వరకు పోసుకుని పుక్కిలించండి. ఇలా రోజుకి 4 సార్లు చొప్పున 2 రోజులు చేయండి. 90% వరకు నొప్పి మాయం అవుతుంది. అలానే తాగే నీరు కూడా వేడి గా ఉండేలా చూసుకోండి. అదే వృద్దులకు గొంతులో నొప్పి కఫాన్ని తగ్గాలంటే..మెత్తగా దంచి జల్లించి న కరక్కాయ పొడి, తేనెలో కలిపి రెండు పూటలా చప్పరించాలి.
ఉదయం లేవగానే గోరు వెచ్చని మంచినీరు రెండు గ్లాసులు త్రాగాలి.రాత్రి పడుక్కోడానికి అరగంట ముందు రెండు చిటికెల పసుపు, నాలుగు మిరియాలు ( దంచిన ముక్కలు) పంచదార కొంచెం ( షుగరు లేకపోతే ఉంటే మెత్తని ఎండు ఖర్జూరం పొడి) ఒక గ్లాసు పాలు లో మరిగించి, వడకట్టి త్రాగాలి. వృద్ధులుకి ఏది ఇచ్చినా అది ద్రవ రూపంలో లేదా మెత్తని పౌడర్ రూపంలో ఉండాలి అయినా కూడా నొప్పి తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్‌కి వెళ్లండి. టాన్సిల్స్‌కి చిన్నపాటి సర్జరీ ఉంటుంది.
ఆయుర్వేద నిపుణులు, నవీన్ నడిమింటి
(చదవండి: బొమ్మలు వేస్తూ ఆ ఫోబియాను పోగొట్టకుంది! ఏకంగా గొప్ప ఆర్టిస్ట్‌గా..)
Comments
Please login to add a commentAdd a comment