చపాతీలోకి సూపర్‌ కాంబినేషన్‌.. సగ్గుబియ్యం పచ్చడి | How To Make Healthy Recipe With Sabudana | Sakshi
Sakshi News home page

Sabudana Pickle Recipe: చపాతీలోకి సూపర్‌ కాంబినేషన్‌.. సగ్గుబియ్యం పచ్చడి

Published Wed, Aug 23 2023 3:12 PM | Last Updated on Wed, Aug 23 2023 3:55 PM

How To Make Healthy Recipe With Sabudana - Sakshi

సగ్గుబియ్యం పచ్చడి తయారీకి కావల్సినవి

సగ్గుబియ్యం – అరకప్పు; పెరుగు – రెండున్నర కప్పులు; అల్లం తురుము –టేబుల్‌ స్పూను;
క్యారట్‌ తురుము – రెండు టేబుల్‌ స్పూన్లు; ఆవాలు – టీస్పూను; జీలకర్ర – టీస్పూను;
పచ్చిశనగపప్పు –టీస్పూను; పసుపు – అరటీస్పూను; కొత్తిమీర తరుగు – పావు కప్పు;
ఉప్పు – రుచికి సరిపడా; నూనె – మూడు టీస్పూన్లు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – చిటికెడు.

తయారీ విధానమిలా:
సగ్గుబియ్యాన్ని పదినిమిషాల పాటు మీడియం మంట మీద వేయించి పక్కన పెట్టుకోవాలి.
► సగ్గుబియ్యం చల్లగా అయిన తరువాత పెరుగు వేసి కలపాలి. పెరుగు చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లుపోసుకోని ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి.
► సగ్గుబియ్యం పట్టుకుంటే మెత్తగా అయ్యేంతవరకు నానాక... కొత్తిమీర తరుగు , రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి 
► బాణలిలో నూనెవేసి, వేడెక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి వేయించాలి.
► ఇవన్నీ వేగిన తరువాత పసుపు, ఇంగువ, క్యారట్‌ తరుగు వేసి నిమిషం పాటు వేయించి తీసేయాలి 
► ఈ తాలింపు మిశ్రమాన్ని సగ్గుబియ్యం మిశ్రమంలో వేసి కలిపితే సగ్గుబియ్యం పచ్చడి రెడీ. అన్నం, చపాతీల్లోకి ఈ చట్నీ మంచి కాంబినేషన్‌.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement