♦ధౌమ్యుడు అంగీకరించగానే పాండవులు ఏమనుకున్నారు?
ధౌమ్యుడు అంగీకరించినందుకు సంతోషించారు. సకల భూరాజ్యం పొందినంత ఆనందించారు. ఆయన దీవెనలు అందుకున్నారు. తమ వృత్తాంతమంతా తెలియపరిచారు.
♦ధౌమ్యుని అనుమతి పొంది ఏం చేశారు?
పాంచాల రాజ్యానికి బయలుదేరారు.
♦మార్గ మధ్యంలో ఎవరు కనిపించారు?
వేదవ్యాసుడు కనిపించాడు. రాను న్న శుభాల గురించి పాండవులకు చెప్పి, వెళ్లిపోయాడు.
♦పాండవులు ఎక్కడకు చేరుకున్నారు?
కుంతి సహితంగా పాంచాల దేశానికి చేరారు. కాంపిల్య నగరంలో ప్రవేశించారు. కుమ్మరివాని ఇంట విడిది చేశారు. ఇతరులకు తెలియకుండా బ్రాహ్మణ వృత్తిలో జీవించసాగారు.
♦ద్రుపదుడు ఏం చేయాలనుకున్నాడు?
తన కుమార్తెను అర్జునునికి ఇవ్వాలనుకుని, వెదికించాడు
♦అర్జునుడు కనిపించకపోవడంతో ద్రుపదుడు ఏం చేశాడు?
అర్జునుడు కనిపించకపోవటంతో, స్వయంవరం ఏర్పాటుచేశాడు. ఆ స్వయంవరానికి కాశీ వస్త్రాలు, కవచాలు ధరించిన అనేక దేశాల రాజులు వచ్చారు.
♦స్వయంవర రంగస్థలాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
కాంపిల్య నగరానికి ఈశాన్య దిక్కున ఏర్పాటుచేశారు. రంగస్థలం చుట్టూ అగడ్త ఏర్పాటుచేశారు.
♦కాంపిల్యానికి వచ్చిన వారంతా ఎక్కడ కూర్చున్నారు?
రాజులు రంగస్థలానికి చేరి, ఉచితాసనాలలో కూర్చున్నారు. పాండవులు బ్రాహ్మణులలో కూర్చున్నారు.
♦సభా మండపానికి వచ్చిన ద్రౌపది ఎలా ఉంది?
తెల్లని రత్నభూషణాలు ధరించింది. తెల్లని గంధం అలముకుంది. చేతిలో తెల్లని పుష్పమాలను ధరించింది, మన్మధుని పూల బాణంలా ఉంది.
♦ధృష్టద్యుమ్నుడు ఏమన్నాడు?
రాజకుమారులారా! ఈమె నా సోదరి కృష్ణ. ఈమె అయోనిజ. అగ్ని నుంచి పుట్టింది. ఇక్కడ ఉన్న అగ్నిహోత్రానికి సమీపంలో మహా ధనుర్బాణాలున్నాయి. వాటిలో ఐదు బాణాల చేత మత్స్యయంత్రాన్ని భేదింయిచ ద్రౌపదిని వరించాలి అన్నాడు.
– నిర్వహణ: వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment