ప్రశ్న: పాండవులు ఏకచక్ర పురంలో ఉండగా ఏం జరిగింది?
జవాబు: ఒకనాడు ద్రుపద రాజ్యం నుంచి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు.
ప్రశ్న:వచ్చిన బ్రాహ్మణుడు ఏమని చెప్పాడు?
ద్రుపద మహారాజు తన కూతురుకి స్వయంవరం ప్రకటించాడని చెప్పాడు.
ప్రశ్న:బ్రాహ్మణుని మాటలు విన్న కుంతి ఏమనుకుంది?
ఇక్కడ ఎంతకాలం ఉన్నా ప్రయోజనం లేదు. పాంచాల దేశం లో అన్నీ సమద్ధిగా ఉన్నాయని విన్నాను. అక్కడికి వెళ దాం అని పాండవులతో పలికింది.
ప్రశ్న:తల్లి మాటలు విన్న పాండవులు ఏం చేశారు?
ఆమె మాటలకు సమ్మతించారు. వారు నివసిస్తున్న గహస్థు దగ్గర సెలవు తీసుకుని, పాంచాల దేశానికి పయనమయ్యారు.
ప్రశ్న:వారి ప్రయాణం ఏ విధంగా సాగింది?
సరస్సులు, నదులు దాటి, మహారణ్యాలు కూడా దాటారు.
ప్రశ్న:దారిలో ఎవరు కనిపించారు?
దారిలో వ్యాసుడు దర్శనమిచ్చాడు. పాండవులు వ్యాసునికి మ్రొక్కి, పూజించి, ఆయనకు ఆసనం చూపారు. వ్యాసుడు కూర్చున్నాడు.
ప్రశ్న:వ్యాసుడు పాండవులకు ఏ వివరాలు చెప్పాడు?
పూర్వం ఒక ముని కన్యకు భర్త లభించలేదు. ఆమె తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ ముని కన్య, భర్త కావాలి అని ఐదు సార్లు అంది. అందుకు శివుడు, ‘నీకు రాబోయే జన్మలో ఐదుగురు భర్తలు వస్తారు’ అని వరం ఇచ్చాడు. ఇప్పుడు ఆమె ద్రుపదుని కుమార్తెగా జన్మించింది., ద్రుపదులు ఆమె స్వయంవరం చాటించాడు. మీరు కాంపిల్య నగరానికి వెళ్లండి’ అని చెప్పి వ్యాసుడు అంతర్థానమయ్యాడు.
ప్రశ్న:పాండవులు ఏమనుకున్నారు?
పాండవులు వ్యాసుని మాట విన్నారు. తమకు మేలు జరుగుతుంది అనుకుని ప్రయాణం సాగించారు.
ప్రశ్న: ఒకనాటి రాత్రి ఏం జరిగింది?
ఒకనాటి రాత్రి వారు గంగానది ఒడ్డుకు చేరారు. గంగలో స్నానం చేయదలచారు. అర్జునుడు కొరివి తీసుకుని ముందు నడిచాడు. మిగిలినవారు అతడిని అనుసరించారు.
ప్రశ్న:అంతుకు ముందే అక్కడకు ఎవరు వచ్చారు?
అంగారపర్ణుడు అనే గంధర్వుడు భార్యాసహితంగా అక్కడికి వచ్చారు. అతడు పాండవుల అడుగుల చప్పుడు విన్నాడు. దూరం నుంచి హెచ్చరించాడు. వింటినారి ధ్వని చేశాడు.
ప్రశ్న:ఆ గంధర్వుడు ఏమన్నాడు?
ఎవరు వస్తున్నారు. ఆగండి. ఉభయ సంధ్యలు అర్ధరాత్రులు సకల భూత యక్ష రాక్షస గంధర్వాదులవి. అర్ధరాత్రులు మానవులు సంచరించటానికి భయపడతారు. మీరు ఎందుకు ప్రమాదం కోరి తెచ్చుకుంటున్నారు అన్నాడు.
ప్రశ్న:అంగారపర్ణుడు తన గురించి ఏమని చెప్పుకున్నాడు?
నేను అంగారపర్ణుడిని. గంధర్వుడిని. కుబేరుని మిత్రుడిని. ఈ గంగ నాది. ఇక్కడ గంగకు అంగారపర్ణ అని పేరు. ఈ గంగ నాది, ఈ వనం నాది. ఇక్కడికి ఎవరు వచ్చినా నేను అడ్డుకుంటాను.. అన్నాడు.
– నిర్వహణ: డా. పురాణపండ వైజయంతి
Comments
Please login to add a commentAdd a comment