puranapanda vyjayanthi
-
అట్ల తద్ది ప్రత్యేకం: వయసులో ఉన్న ఆడపిల్లలూ ... ఆడుకుందామా...!
ఆటల నోము అట్లతద్ది.. ఆడపిల్లలు నోచే తద్ది అంటూ పవిత్రబంధం సినిమాలో కథానాయికగా వేసిన వాణిశ్రీ వేడుకగా పాడుతుంది. తెలుగు వారి జీవితాలలో అట్లతద్దికి అంత ప్రాధాన్యత ఉంది. ఆడపిల్లలు ఆడుతుంటే, మగ పిల్లలు ఆట పట్టిస్తారు. ఎవ్వరూ ఎవరితోనూ గొడవపడరు. ఆట పట్టించటాన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తారు. తెల్లవారుజామునే పిల్లలంతా పొరపచ్చాలు, హెచ్చుతగ్గులు.. ఏ అభిప్రాయ భేదాలు లేకుండా ఆడుకుంటారు. ఐకమత్యానికి ఈ పండుగ ప్రతీకగా కనిపిస్తుంది. ఇంకా ఈ పండుగలో అనేక కోణాలున్నాయి... ఆడపిల్లలకు శారీరక వ్యాయామం తప్పనిసరి. పూర్వం అందరూ ఇంటి దగ్గరే ఉండేవారు. ఇంట్లో చేసే ప్రతి పనిలోనే వ్యాయామమే. చెరువుకు వెళ్లి బిందెడు నీళ్లు తేవటం, పెరట్లో బావిలో నీళ్లు తోడటం, పప్పులు రుబ్బడం, రవ్వ విసరటం, అప్పడాలు ఒత్తడం... ఏ పని చేసినా పనితో పాటు శరీర ఆరోగ్యానికి కావలసిన వ్యాయామం ఉండేది. దానితో పాటు మనసును కూడా కుదుటపరుస్తుంది. నిరంతరం ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవారికి ఆటవిడుపు కూడా ఉండాలి. అట్లతద్ది ఆడపిల్లలకు ఆటవిడుపు. ముందు రోజే గోరింటారు పెట్టుకోవాలి. తెల్లవారు జామున సూర్యుని కంటె ముందే నిద్ర లేచి, ముందురోజు రాత్రి అమ్మ వండిన అన్నాన్ని చద్దన్నంగా తినటం ఎంతో సరదా. నువ్వులపొడి, ఉల్లిపాయ పులుసు, గోంగూర పచ్చడి, గడ్డ పెరుగు, తాంబూలం... అన్నీ కడుపు నిండా తిని, ఆహారం అరిగేవరకు ఉయ్యాల ఊగి, ఆటలు ఆడి, బారెడు పొద్దెక్కిన తరవాత ఇంటికి వచ్చి హాయిగా స్నానం చేయటం... ఇదీ ఈ పండుగ విధానం. చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! ఇక్కడితో ఆగదు... అమ్మ వేసే అట్లను కడుపు నిండా తినాలి. కొందరైతే వాయినాలు ఇవ్వాలి. ఇవన్నీ సంప్రదాయంలో భాగం. మరి తెల్లవారుజామున ఆడే ఆటల్లో ఒక కలివిడితనం ఉంటుంది. ఆడపిల్లలు ఆడుతుంటే, మగ పిల్లలు దురదగుంటాకుతో వచ్చి ఆడపిల్లల్ని సరదాగా ఆటపట్టించటం, ఈ ఆడపిల్లలు వారిని బెదిరించటం... ఇదీ ఆడమగ తేడా లేకుండా అందరం ఒకటే అనే భావనతో సరదాసరదాగా నడిచే పండుగ. ఎక్కడా శృతిమించని సరదాల వేడుక ఈ పండుగ. ఉయ్యాలో ఉయ్యాల... ఊరు చివర చెరువు గట్టున ఉన్న పెద్దపెద్ద చెట్లకు ఉయ్యాలలు వేసి, ఒకరిని ఒకరు ఊపుకుంటూ, పాటలు పాడుకుంటూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ చేసుకునే ప్రకృతి పండుగ. ఏ చెట్టు కొమ్మ ఎంత గట్టిగా ఉందో చూసుకోవటం ప్రధానం. జీవితం అనే ఉయ్యాల దృఢంగా ఉండాలంటే ఆధారం గట్టిగా ఉండాలనే అంతరార్థం చెబుతుంది ఈ పండుగ. నిత్యజీవితంలో ఆటుపోట్లు వస్తాయి. మనసు డోలాయమానంగా అయిపోతుంటుంది. ఎత్తుపల్లాలు చవిచూడాల్సి వస్తుంది. ఒకసారి అంత ఎత్తుకు వెళ్లిపోతాం, ఒకసారి నేల మీదకు పడిపోతాం. అదే ఉయ్యాల అంతరార్థం. పండుగల పరమార్థం వెనకపడిపోవటంతో, అందులోని సామాజిక కోణం మరుగున పడిపోయి, అనవసరమైన చాదస్తాలు మాత్రం మిగిలిపోతున్నాయి. చదవండి: ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నారో పార్లర్‌కి వెళ్లాల్సిన పనేలేదు! వయసులో ఉన్న ఆడపిల్లలు ఆటలు ఆడాలి... నలుగురితో కలిసిమెలిసి ఆడుతుంటే, ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించటం నేర్చుకోవాలి. యుక్త వయసు నుంచి ఆలోచనలలో మార్పు వస్తుంది. మంచి మార్గం వైపు కాని, చెడు తోవలోకి కాని వెళ్లే వయసు ఇదే. స్నేహితులతో ఆడుకుంటూ ఉండటం వల్ల, ఒకరిని చూసి ఒకరు మంచి నేర్చుకునే అవకాశం కలిగించే పండుగ. అంతేనా యుక్తవయసులో వచ్చే శారీరక మార్పులకు అనుగుణంగా అనారోగ్యాలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి అనువుగా ఏర్పడిన పండుగలు ఇవి. శరీరం బాగా అలసిపోయే వరకు ఆడుకుంటూ, తోటివారితో ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ రకరకాల మనస్తత్వాలను అర్థం చేసుకుంటూ వ్యక్తిత్వాన్ని అందంగా రూపుదిద్దుకోవటానికి అవసరమైన విధంగా పండుగలు మార్గం చూపుతాయి. అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ముద్ద పప్పోయ్ మూడట్లోయ్ పీట కింద పిడికెడు బియ్యం పిల్లల్లారా జెల్లల్లార లేచి రండోయ్... ఎంతో అందమైన పాట ఆశ్వీయుజం వెనుకబడి, కార్తికం వస్తోందంటే చలి ముదురుతుంది. ఆ చలికి ముడుచుకుని పడుకుంటే కుదరదు. చలికి సవాలుగా నిద్ర లేచి చలిని పరుగులు పెట్టించాలి. అందుకే పిల్లలంతా తెల్లవారు జామునే లేచి ఆడుకోవాలని చెప్పే పండుగ ఇది. కడుపు నిండుగా అట్లు తినాలి. మినుములు, బియ్యంతో కలిపి చేసిన అట్లు తింటే ఒళ్లు ఇనుములా తయారవుతుంది. ప్రకృతి సిద్ధంగా ఆడపిల్లల శరీరంలో కలిగే మార్పులకి ఇది చాలా అవసరం. ముద్ద పప్పు తినాలి. పిడికెడు బియ్యాన్ని మాత్రమే అన్నంగా వండుకుని తినాలి. మనం ఈ పాటను ఎలా కావాలంటే అలా చెప్పుకోవచ్చు. అందుకే అట్లతద్దిని అందరూ జరుపుకునేందుకు వీలుగా నోము కింద ఏర్పాటుచేశారు. నోముగా చేసుకునేవారు ఉదయాన్నే కార్యక్రమం పూర్తయ్యాక, సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, చందమామను చూశాకే భోజనం చేస్తారు. నోము అంటే మొక్కుబడిగా కాకుండా, త్రికరణశుద్ధిగా ఆచరించాలి. చాదస్తాలకు దూరంగా, ఆరోగ్యానికి దగ్గరగా ఉండేలా ఈ పండుగను జరుపుకోవాలని చెబుతుంది మన సంప్రదాయం. ఇదే అట్లతద్దిలోని అంతరార్థం. - వైజయంతి పురాణపండ చదవండి: Pollution In China: ఏటా 7 లక్షల 50 వేల మంది మృతి అందుకేనట! ప్రమాదం అంచున.. చైనా..! -
ఉపాధ్యాయ దినోత్సవం: మొదట చెప్పుకోవాల్సిన గురువు ఆయనే
సెప్టెంబర్ 5 అనగానే ఉపాధ్యాయుల దినోత్సవం అనుకోవటం కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా పాటిస్తున్నాం. ఇటువంటి సందర్భంలో ఒకసారి గురువులను అంటే ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన గురువులను స్మరించుకోవాలి. మొట్టమొదటగా మనం చెప్పుకోవలసిన, గుర్తు చేసుకోవలసిన గురువు జగద్గురువు శ్రీకృష్ణపరమాత్ముడు. ఈ జాతికి భగవద్గీతను బోధించిన గురువు ఆ నల్లనయ్య, ఒక్క భగవద్గీతతో అర్జునునిలోని అజ్ఞానాన్ని తొలగించాడు. కురుక్షేత్ర యుద్ధం చేయించాడు. దుష్టసంహారం చేయించాడు. కురు వృద్ధుడైన భీష్మాచార్యుడు స్వయంగా శ్రీకృష్ణుడిని జగద్గురువు అని సంబోధించాడు. గురువు అంటే తన శిష్యునిలోని అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలేవాడని అర్థం. అంతేకాని పాఠాలు చెప్పే ప్రతివారు గురువులు కాదు. విద్యార్థికి మార్గదర్శనం చేసి, విద్యార్థిలోని ఆసక్తిని గమనించి, ఆ విద్యార్థి ఏ రంగంలో రాణించగలడో గమనించగల శక్తి కలవాడే గురువు అని భీష్ముని మాటలలో వ్యక్తమవుతుంది. అందుకే వయసులో శ్రీకృష్ణుడు భీష్ముడి కంటె చిన్నవాడైనప్పటికీ జగద్గురుత్వం ప్రాప్తించింది. చదవండి: సీఎం వైఎస్ జగన్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు m అదే గౌరవం దక్కిన మరొకరు ఆదిశంకరాచార్యులు. జగద్గురు ఆదిశంకరాచార్య అనే మనం భక్తితో, గౌరవంగా పిలుచుకుంటాం. 32 సంవత్సరాలు మాత్రమే తనువుతో జీవించినా, ఆయన రచనలతో నేటికీ అంటే కొన్ని వందల సంవత్సరాల తరవాత కూడా జీవించాడు శంకరాచార్యుడు. ఆచార్యత్వ గుణాల వల్లే శంకరుడు శంకరాచార్యుడయ్యాడు. జగద్గురువయ్యాడు. భారతజాతికి అనర్ఘరత్నాల వంటి స్తోత్రాలు అందించాడు. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు తిరుగుతూ, శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ, శక్తి పీఠాలు స్థాపించి, జ్ఞానతృష్ణ ఉన్నవారికి పరోక్షంగా గురువుగా నిలుస్తున్నాడు శంకరుడు. చదవండి: మొదటి నమస్కారం... టు టీచర్.. విత్ లవ్ మరో జగద్గురువు స్వామి వివేకానందుడు. రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యరికం చేసి, ఆయన దగ్గర జ్ఞాన సముపార్జన చేసి, గురువుల సందేశాలను యావత్ప్రపంచానికి అందించి, అతి పిన్నవయసులోనే కన్నుమూశాడు వివేకానందుడు. అయితేనేం నేటికీ వివేకానందుడు ఎంతోమందికి గురువుగా పరోక్షంగా జ్ఞానభిక్ష ప్రసాదిస్తున్నాడు. చెళ్లపిళ్ల కవుల దగ్గర చదువుకున్నామని చెప్పుకోవటం ఒక గర్వం, ఒక ధిషణ, ఒక గౌరవం. అంతటి గురువుల దగ్గర చదువుకున్న కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తన గురువులకు దక్కని గౌరవం తనకు దక్కిందన్నారు. తన వంటి శిష్యులున్న గురువులు మరెవరూ లేరని సగర్వంగా అన్నారు. అదీ గురువుల ఔన్నత్యాన్ని చాటిచెప్పే సంఘటన. గురువులు అంటే శిష్యుల భుజాల మీద చేతులు వేసుకుని, వారితో సమానంగా అల్లరి పనులు చేయటం కాదు. గురువులు అంటే శిష్యుల దగ్గర డబ్బులు చేబదులు పుచ్చుకుని, వ్యసనాలను తీర్చుకోవటం కాదు. వందే గురు పరంపర గురువు అంటే తన దగ్గర చదువుకునే విద్యార్థిని ప్రేమ వివాహం చేసుకోవటం కాదు. గురువంటే బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు. ఉత్తర తన శిష్యురాలు. ఆమెను వివాహం చేసుకోమని విరటుడు కోరితే, అందుకు అర్జునుడు.. అయ్యా, నా దగ్గర చదువుకున్న అమ్మాయి నాకు కూతురితో సమానం. కూతురితో సమానమైన అమ్మాయిని కోడలిగా చేసుకోవచ్చు కనుక నా కుమారుడు అభిమన్యునికిచ్చి వివాహం చేస్తానన్నాడు. అదీ గురువు లక్షణం. చదువురాని గురువులు విద్యార్థులకు చేసే బోధన మీద తెన్నేటి లత ఆ రోజుల్లోనే సంచలన కథ రాశారు. అదే ఎబ్బెచెడె... అంటే ఏ బి సి డి లను ఎలా పలుకుతారో వివరించారు. అంతేకాదు కొన్ని పాఠశాలల్లో టీచర్లు చుక్ చుక్ రైలు వస్తోంది అనే బాల గేయాన్ని... సుక్కు సుక్కు రైలు వత్తాంది అని చెబుతున్నారు. ఇటువంటి గురువుల వల్ల విద్యార్థులకు గురువుల పట్ల అగౌరవంతో పాటు, విద్య అంటే ఏమిటో తెలియకుండా పోతారు. చదువు చెప్పే గురువులకు చదువుతో పాటు క్రమశిక్షణ, నిబద్ధత, సత్ప్రవర్తన వంటి మంచి లక్షణాలు ఉండాలి. అటువంటి గురువులు ఉన్ననాడే ఉపాధ్యాయ దినోత్సవానికి అర్థం పరమార్థం కలుగుతుంది. గురుదేవోభవ అనే మాటల అంతరార్థం నిజమవుతుంది. గురువు దేవుడిలా బోధించాలి. దానవుడిలా బోధిస్తే అది దానవత్వాన్ని వృద్ధి చేస్తుందని గుర్తించాలి. - వైజయంతి పురాణపండ -
చిర స్మరణీయం – ‘చీర’స్మరణీయం
చీర ధరించడం సంప్రదాయం, పాత కాలం వాళ్లలా చీరలేమిటి అనుకుంటున్నారా. చీరతో ఆ తరం వారికి ఎన్నో అనుభూతులు, అనుబంధాలు, అనుభవాలు ఉన్నాయి. పెళ్లి చీర, మధుపర్కాల చీర, మొట్టమొదటిసారి చంటి పిల్లను ఎత్తుకున్న చీర, పసిపాపకు ఉయ్యాల వేసిన పాత చీర... మొట్టమొదటగా కట్టుకున్న అమ్మ చీర, మొదటి జీతంతో కొనుక్కున్న మొదటి చీర, అత్తవారింట్లో కొన్న చీర... ఎన్నో జ్ఞాపకాలు పెనవేసుకుంటాయి చీరతో. ఎన్ని తరాలు మారినా, తెలుగు ఆడపిల్లలు చీరను ఎన్నటికీ విడిచిపెట్టలేరు. ఇప్పుడు పెళ్లికి ఆడ పిల్లలు చీరలు కొనుక్కోవటానికి ఎంత హడావుడి చేస్తున్నారో తెలుసు కదా. చీర ఎప్పటికీ చీరే. చీరను స్మరించని ఆడవారు ఎక్కడా ఉండరేమో. ఏదో ఒక సందర్భంలో చీరను ధరించి మధురానుభూతి పొందకుండా ఉండలేరు. ఒక్కో చీరకు ఒక్కో అనుభూతి ఉంటుంది. ఎంతో ఇష్టంతో కొనుక్కున్న చీరకు సంబంధించి ఏదో ఒక కథ ఉంటుంది. చిరస్మరణీయం చీరస్మరణీయం. చీరలను స్మరించుకోవటానికి వేదికను ఏర్పాటుచేశారు కజగిస్థాన్లో ఉంటున్న దుర్గప్రియ గొట్టాపు. ఈ పేజీ ప్రారంభించటం గురించి సాక్షితో ఆమె పంచుకున్న మాటలు... చెన్నైలో పుట్టి పెరిగినప్పటికీ, చిన్నప్పటి నుంచి తెలుగు పురాణాల మీద చాలా ఆసక్తి. ఇప్పటివరకు సుమారు రెండు వేల మందికి తెలుగు నేర్పాను. తెలుగు టీచర్‌గా పదహారు సంవత్సరాల క్రితం మలేసియా వచ్చాను. తెలుగు పాఠాలు చెబుతున్నాను. మలేసియా తెలుగు అకాడెమీలో ఇప్పటికీ కొనసాగుతున్నాను. తెలుగు నేర్పటం నా లక్ష్యం. మయన్మార్‌లో కొంతకాలం వర్క్‌షాప్స్ నిర్వహించాను. 2016లో కజగిస్థాన్ వెళ్లిపోయాను. ఇప్పటికీ మలేసియా వస్తూనే ఉంటాను. చాలా సంవత్సరాలుగా మన దేశానికి దూరంగా ఉండటం వలన నాలో ఏదో ఒక వెలితి ఏర్పడింది. ఇప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఆనందం కోసం.. సాధారణంగా ఆడపిల్లలకు 18 సంవత్సరాల నుంచి చివరి దాకా చీరతోనే అనుబంధం పెనవేసుకుని ఉంటుంది. విద్యార్థులకు చీరలో పాఠం చెప్పే గురువును అందరూ గౌరవిస్తారు. చీర కట్టుకున్న నాయనమ్మ, అమ్మమ్మల మీద మనవలకు అపారమైన ప్రేమ ఉంటుంది. ఇలా చీరతో ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి. అందుకే ఆడవారందరికీ ఆనందం కలిగేలా ఏదో ఒక పని చేయాలనుకున్నాను. ఆడవాళ్లకి చీరల మీద ఇష్టం ఎక్కువగా ఉంటుంది. చాలామంది ‘చీరలలో ఏముంటుందిలే?’ అనుకుంటారు. కానీ అందరికీ చీరలతో ఏదో ఒక అనుబంధం, అనుభూతి పెనవేసుకుని ఉంటాయి. చంటి బిడ్డను మొట్టమొదటి సారి ఎత్తుకున్న చీర, ఉయ్యాల వేసిన చీర, బొంత కుట్టిన చీర... ఇలా ప్రతి చీర ఒక జ్ఞాపకంగా అనుభూతి చెందిన సంఘటనలు చాలా ఉంటాయి. చీరజ్ఞాపకాలు, అనుభవాలతో పెనవేసుకున్న చీర పాడైపోయినా... ఎవ్వరికీ ఇవ్వలేకపోతారు. ఒక తియ్యని అనుబంధంగా దాచుకుంటారు. శారీ స్పీక్స్... చీర కట్టుకోవడం, కట్టుకున్న వాళ్లను గౌరవంగా చూడటం.. ఇటువంటి ఎన్నో అంశాలు చీరతో కొంగుముడి వేసుకుని ఉంటాయి. ‘శారీ స్పీక్స్’ అనే ఇంగ్లీషు పేజీ చూశాక, అటువంటిదే ఒక ఫేస్ బుక్ పేజీ పెడితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ఇది నా బ్రెయిన్ చైల్డ్. పేజీ పెట్టగానే పెద్దపెద్ద వాళ్లు ఇందులో చేరారు. పేజీలో అందరూ ఉత్సాహంగా పాల్గొనడానికి వీలుగా కొత్త కొత్త కాన్సెప్ట్స్ పెడుతుంటాను. ‘శారీస్ – స్టోరీస్’ అంశం గురించి రాయమనగానే. అందరూ ఎంతో మంచి మంచి అనుభవాలు రాశారు. 90 సంవత్సరాల పెద్దావిడ కూడా తన అనుభవాలు వివరించారు. ఆవిడ అమ్మమ్మ పెళ్లి చీరను నాలుగు తరాలుగా పెళ్లి కట్టుకున్నామని చెప్పారు. ఆరోజు నాకు గర్వం అనిపించింది. అందరినీ గుర్తు చేసుకుంటూ, వారి అభిప్రాయాలను పంచుకుంటూంటే, చీర మన జీవితంలో ఒక బంధం అయిపోయిందనిపించింది. చీర నిత్మ స్మరణీయంగా అంటే చిరస్మరణీయంగా మిగిలిపోతుందనే ఉద్దేశంతోనే ఈ పేజీకి చీర స్మరణీయం అని పేరు పెట్టాను. చీరే కదా అని తోసి పారేయకూడదు, ‘అది చీర’ అనుకోవాలి. వారానికో థీమ్ చీరకు సంబంధించి ఎన్నో రకాలుగా వారి అనుభవాలను పంచుకునేలా చేయాలనే తలంపుతో వారానికో థీమ్ పెడుతుంటాం. కలర్ థీమ్, తలంబ్రాలు లేదా మధు పర్కాల చీర, పెళ్లి చీర, అక్కయ్యలతో కలిసి తీయించుకున్న చీర ఫొటో, అమ్మతో ఫొటో, ఒంటరిగా ఒక రంగుచీరతో ఫొటో... ఇలా రకరకాలుగా థీమ్ అనౌన్స్ చేస్తుంటాం. గిరిజారాణి అనే ఆవిడ ఫన్నీగా అనౌన్స్మెంట్స్ అన్ని మాండలికాల్లో ఇస్తుంటారు. పేజీ సభ్యులందరూ అప్పటికప్పుడు ఫోటోలు, సెల్ఫీలు తీసుకుని, ఎంతో ఇష్టంగా పోస్టు చేస్తున్నారు. ప్రముఖ కథా రచయిత్రి బలభద్రపాత్రుని రమణి ఎన్నో విషయాలు వివరిస్తున్నారు. హడావుడి మొదలైంది అంటూ కామెంట్స్ 80 సంవత్సరాల వయసు వారు కూడా సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కరోనా సమయంలో అందరూ బాధలో ఉంటున్నారు. ఇలా చీర గురించి పోస్టు చేస్తూండటం వల్ల, బాధలన్నీ మరచిపోగలుగుతున్నామని అందరూ కామెంట్స్ పెడుతుంటే ఎంతో సంతోషంగా ఉంటోంది నాకు. మన చీరలో మనలను చూసుకుంటూ, మనలను గుర్తు చేసుకుంటూ హడావుడి మొదలైంది అంటూ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఇందులో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ద్వారం లక్ష్మి, రచయిత్రి మన్నెం శారద, నాట్యకళాకారిణి కోకా విజయలక్ష్మి వంటి ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు. – దుర్గప్రియ గొట్టాపు, మలేసియా తెలుగు ఉపాధ్యాయిని. అమ్మ ఉంటే చీర ఇచ్చేది ఈ గ్రూపు ని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ప్రత్యేకంగా అమ్మ ఇచ్చిన చీర, అమ్మమ్మలతో ఫొటోలు లాంటి పోస్టులు బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మా అమ్మనాన్నలను ఫొటోలో మాత్రమే చూశాను. నాకు ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడు మా పేరెంట్స్ ఇరువురూ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. నేను ‘మా అమ్మ ఉంటే ఎలాంటి చీర ఇచ్చేది... ఇలానే ఉండేదేమో’ అని ఊహిస్తాను. అమ్మ ఉన్నవారు ఎంత అదృష్టవంతులండీ. మీ పేరెంట్స్‌తో పోస్టు చూస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అండీ. – శ్రీలక్ష్మి, ఒక సభ్యురాలు. ఇక ఈ చీర గురించి.. 2004 లో పుట్టపర్తిలో పరిచయం అయిన సుధాసుందర్ తన పెళ్లికి, నన్ను ఒక మంచి కంచి పట్టు చీర కొనుక్కోమన్నారు. నేను వద్దన్నా వినకుండా కొన్నారు. చీర ధర చూసి నా కళ్ళు తిరిగాయి. అక్షరాల 14,500 రూపాయలు. స్వచ్ఛమైన ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. – శ్రీదేవి లేళ్లపల్లి, చెన్నై అప్పుడు కట్టుకున్నాను యామినీ కృష్ణమూర్తి గారి బయోపిక్ మూవీకి పనిచేసినప్పుడు.ఆ లెజెండ్ ని ప్రసాద్ లాబ్స్‌లో కలిసే అదృష్టం లభించింది. ఈ బయోపిక్ ఎప్పటికి సినిమాగా పూర్తి అవుతుందో తెలీదు కానీ అంత నృత్యం చెయ్యగల తార దొరకాలిగా, అప్పుడు నేను కట్టుకున్న చీర అది. అది మా అన్నయ్య తన కొడుకు పెళ్లికి పెట్టాడు, -బలభద్రపాత్రుని రమణి, రచయిత – సంభాషణ: వైజయంతి పురాణపండ -
దుర్యోధనుడు ఏం చేశాడు?
స్వయంవరానికి ఎవరెవరు వచ్చారు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలుగా వంద మంది కౌరవులు, కర్ణుడు, అశ్వత్థామ, సోమదత్త, భూరిశ్రవుడు మొదలైన రాజులు వచ్చారు. స్వయంవరానికి ఇంకా ఎవరెవరు వచ్చారు? శల్యుడు, జరాసంధుడు, శకుని, అక్రూరుడు, సాంబు డు, సాత్యకి, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, కృతరవర్మ, అనిరుద్ధుడు, యుయుధానుడు మొదలైన యదు, వృష్టి, భోజ, అంధక వంశీయులు వచ్చారు. ఇంకా ఎంతోమంది రాజకుమారులు వచ్చారు. ద్రౌపదిని చూసిన రాజులు ఏం చేశారు? ద్రౌపదిని చూసిన రాజులు మక్కువతో, ధనుస్సు దగ్గరకు వెళ్లారు. కొందరు ధనుస్సు పట్టలేకపోయారు. కొందరు వంచలేకపోయారు. వారిని చూచి మరికొందరు ప్రయత్నం మానుకున్నారు. కృష్ణుడు ఎవరెవరిని వారించాడు? వృష్టి, భోజ, యాదవులను కృష్ణుడు వారించాడు. ఎవరెవరు విఫలులయ్యారు? శిశుపాల, జరాసంధ, శల్య, కర్ణులు ప్రయత్నించి విఫలులయ్యారు. బ్రాహ్మణుల మధ్య నుంచి ఎవరు లేచారు? అర్జునుడు బ్రాహ్మణుల మధ్య నుంచి లేవటంతో, బ్రాహ్మణులు సంతోషించారు. అర్జునుడు ఏం చేశాడు? ధనువు దగ్గరకు వచ్చి, గురువులకు నమస్కరించి, ధనుస్సుకు ప్రదక్షిణం చేసి, అవలీలగా ధనుస్సు అందుకుని, ఐదు బాణాలు వేశాడు. ఆకాశంలో ఉన్న మత్స్యయంత్రం పడగొట్టడంతో సభ ఆశ్చర్యపోయింది. అందరూ అర్జునుడిని ఏ విధంగా కీర్తించారు? మత్స్యయంత్రాన్ని ఇంత సులువుగా కొట్టినవాడు నరుడు కాడు, ఇంద్రుడో, రుద్రుడో, సూర్యుడో, కుమారస్వామియో అయి ఉంటారని కీర్తిస్తూ, పూల వాన కురిపించారు. దుర్యోధనుడు ఏం చేశాడు? దుర్యోధనుడు కోపంతో, ద్రుపదుడు తమను అవమానించాడనుకుని, ద్రుపదుని వధించాలని దండెత్తాడు. భీముడు, అర్జునుడు ఏం చేశారు? ఒక చెట్టు పెరికి నిలిచాడు, అర్జునుడు బాణం ఎక్కుపెట్టాడు. అర్జునుడికి కర్ణుడికి, భీముడికి శల్యుడికి మధ్య యుద్ధం జరిగింది. – నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ -
ద్రుపదుడు ఏం చేయాలనుకున్నాడు?
♦ధౌమ్యుడు అంగీకరించగానే పాండవులు ఏమనుకున్నారు? ధౌమ్యుడు అంగీకరించినందుకు సంతోషించారు. సకల భూరాజ్యం పొందినంత ఆనందించారు. ఆయన దీవెనలు అందుకున్నారు. తమ వృత్తాంతమంతా తెలియపరిచారు. ♦ధౌమ్యుని అనుమతి పొంది ఏం చేశారు? పాంచాల రాజ్యానికి బయలుదేరారు. ♦మార్గ మధ్యంలో ఎవరు కనిపించారు? వేదవ్యాసుడు కనిపించాడు. రాను న్న శుభాల గురించి పాండవులకు చెప్పి, వెళ్లిపోయాడు. ♦పాండవులు ఎక్కడకు చేరుకున్నారు? కుంతి సహితంగా పాంచాల దేశానికి చేరారు. కాంపిల్య నగరంలో ప్రవేశించారు. కుమ్మరివాని ఇంట విడిది చేశారు. ఇతరులకు తెలియకుండా బ్రాహ్మణ వృత్తిలో జీవించసాగారు. ♦ద్రుపదుడు ఏం చేయాలనుకున్నాడు? తన కుమార్తెను అర్జునునికి ఇవ్వాలనుకుని, వెదికించాడు ♦అర్జునుడు కనిపించకపోవడంతో ద్రుపదుడు ఏం చేశాడు? అర్జునుడు కనిపించకపోవటంతో, స్వయంవరం ఏర్పాటుచేశాడు. ఆ స్వయంవరానికి కాశీ వస్త్రాలు, కవచాలు ధరించిన అనేక దేశాల రాజులు వచ్చారు. ♦స్వయంవర రంగస్థలాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? కాంపిల్య నగరానికి ఈశాన్య దిక్కున ఏర్పాటుచేశారు. రంగస్థలం చుట్టూ అగడ్త ఏర్పాటుచేశారు. ♦కాంపిల్యానికి వచ్చిన వారంతా ఎక్కడ కూర్చున్నారు? రాజులు రంగస్థలానికి చేరి, ఉచితాసనాలలో కూర్చున్నారు. పాండవులు బ్రాహ్మణులలో కూర్చున్నారు. ♦సభా మండపానికి వచ్చిన ద్రౌపది ఎలా ఉంది? తెల్లని రత్నభూషణాలు ధరించింది. తెల్లని గంధం అలముకుంది. చేతిలో తెల్లని పుష్పమాలను ధరించింది, మన్మధుని పూల బాణంలా ఉంది. ♦ధృష్టద్యుమ్నుడు ఏమన్నాడు? రాజకుమారులారా! ఈమె నా సోదరి కృష్ణ. ఈమె అయోనిజ. అగ్ని నుంచి పుట్టింది. ఇక్కడ ఉన్న అగ్నిహోత్రానికి సమీపంలో మహా ధనుర్బాణాలున్నాయి. వాటిలో ఐదు బాణాల చేత మత్స్యయంత్రాన్ని భేదింయిచ ద్రౌపదిని వరించాలి అన్నాడు. – నిర్వహణ: వైజయంతి పురాణపండ -
బౌండరీలు దాటే మనస్సు నాదీ... సెంచరీలు కొట్టే వయస్సు నాది
శంకరమంచి జానకి... షావుకారు చిత్రంతో ఇంటిపేరు మారిపోయింది.. తొమ్మిది పదులు నిండినా ఇప్పటికీ తన పని తనే చలాకీగా చేసుకుంటున్నారు.. 74 సంవత్సరాల క్రితం నటించిన షావుకారు చిత్రంలోని డైలాగులను నిద్రలో లేపి అడిగినా నేటికీ ఒప్పచెబుతున్నారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆవిడ ఎంత యాక్టివ్‌గా ఉన్నారో! వయసు తన శరీరానికే కానీ, తన మనస్సు మాత్రం బౌండరీలు దాటుతోందంటున్న షావుకారు జానకి తన ఆరోగ్య రహస్యాలను సాక్షితో పంచుకున్నారు. ఆ వివరాలు ఆవిడ మాటల్లోనే... నేను బ్రిటిషు వారి పరిపాలనా కాలంలో.. 1931 డిసెంబరు 11న తూ. గో. జిల్లా రాజమండ్రిలో పుట్టాను. మాది చాలా ఆచారవంతుల కుటుంబం. అమ్మ శచీదేవి, నాన్న టేకుమళ్ల వెంకోజీరావు. అమ్మ పద్ధతులు, శుభ్రత అన్నీ అలవడ్డాయి. నాకు ఇప్పుడు 89 పూర్తయ్యి 90కి వచ్చాను. నా కంటె ముందు అన్నయ్య, అక్కయ్య, నా తరవాత, చెల్లి కృష్ణకుమారి. అక్కయ్య చాలా చిన్నతనంలోనే కన్నుమూసింది. రాజమండ్రి ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నాను. నాన్న ఉద్యోగరీత్యా చాలా రాష్ట్రాలకు మారుతుండటం వల్ల నా చదువు సరిగ్గా సాగలేదు. నాన్న హిందూ పేపర్ చదవటం అలవాటు చేశారు. మద్రాసు ఆంధ్ర మహిళా సభలో మెట్రిక్‌లో చేర్పించారు. క్రమేపీ తెలుగు రాయటం, మాట్లాడటం నేర్చుకున్నాను. బాల్య వివాహం... పదిహేను సంవత్సరాలకే పెళ్లి చేసేశారు. మద్రాసు ఆకాశవాణిలో బాలానందం ప్రోగ్రామ్ లో నా గొంతు విన్న బి.ఎన్. రెడ్డి గారు నన్ను పిలిపించి, ‘సినిమాలో చేస్తావా’ అన్నారు. ఏమీ తెలియక పోయినా ‘చేస్తాను’ అనేసి, ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పాను. నాన్న చీవాట్లు పెట్టి, శంకరమంచి శ్రీనివాసరావుతో నాకు పెళ్లి చేసేశారు. ఆ తరవాత నాన్నగారు బదిలీ మీద అస్సాం వెళ్లిపోయారు. విజయవాడలో కొత్త కాపురం... మేం విజయవాడ సత్యనారాయణపురంలో కాపురం పెట్టాం. అయితే ఆయనకు సంపాదన అంతగా లేక పోవడంతో క్రమేపీ మాకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దాంతో మమ్మల్ని అస్సాం రమ్మన్నారు నాన్న. అక్కడ కొన్నాళ్లు ఉన్నాం. పెళ్లి అయ్యాక పుట్టింట్లో ఉండటం ఇబ్బందిగా అనిపించింది. అప్పట్లో మా చెల్లి కృష్ణకుమారి చదువుకుంటోంది. ఊరికే కూర్చోలేక, తనని చదివిస్తూ, నేను ప్రైవేట్‌గా పరీక్ష రాశాను. అప్పుడు నాకు పదిహేడు సంవత్సరాలు. నిండు నెలలు, ఓవర్‌కోట్ కప్పుకుని పరీక్ష రాశాను. షావుకారు ఇంటి పేరుగా మారింది.. ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉండటం మర్యాద కాదని, మద్రాసు మా మేనమామ ఇంటికి చేరాం. అక్కడే నాకు పెద్దమ్మాయి యజ్ఞ ప్రభ పుట్టింది. ఒక రోజున మా వారితో, గతంలో నాకు వచ్చిన సినిమా అవకాశం గురించి చెప్పి, నేను నటించటానికి ఒప్పించి, బిఎన్ రెడ్డిగారిని కలిశాను. చేతిలో పాపాయి, పక్కన మా వారు. ఆయనకు నా కళ్లల్లో మా ఇబ్బంది కనిపించి, వారి తమ్ముడు తీస్తున్న ‘షావుకారు’ చిత్రం గురించి చెప్పారు. ఎన్నో పరీక్షల తరవాత ఆ చిత్రంలో హీరోయిన్ అవకాశం వచ్చింది. అప్పటి నుంచి షావుకారు జానకి అయ్యాను. షావుకారు íసినిమాలో బాగా చేస్తేనే నిలదొక్కుకోగలను అనుకున్నాను. ఇంట్లో మూడు నెలల పాపను వదిలి, తల్లిగా మానసిక వేదన అనుభవిస్తూ, ఆ సినిమా చేశాను. ఆ సినిమాకు 2500 రూపాయలు పారితోషికం. అలా కుటుంబం కోసం సినిమాలలోకి ప్రవేశించాను. నాలుగు కాలాల పాటు ఉండే పాత్రలు చేస్తూ, ‘నువ్వు పనికిరావు’ అన్న కె. వి. రెడ్డిగారితో ‘పనికి వస్తావు’ అనిపించుకునే స్థాయికి ఎదిగాను. శివాజీ గణేశన్ గారి ప్రోద్బలంతో పుదియ పరవై అనే తమిళ చిత్రంలో గ్లామర్ రోల్ చేసి, అందరి ప్రశంసలు అందుకున్నాను. బాలచందర్ నాటకాలలో... 500 సినిమాలు చేసినా, నాటకాల మీద వ్యామోహం పోలేదు. సినిమాలలో చేస్తూనే, పైసా కూడా తీసుకోకుండా 300 నాటకాలు చేశాను. అప్పట్లో కె. బాలచందర్ రచన, దర్శకత్వం వహించిన నాటకాలలో కూడా వేశాను. కలైమామణి అవార్డు, అరిజోనా యూనివర్సిటీ డాక్టరేట్ కూడా అందుకున్నాను. సంవత్సరానికి 20 సినిమాలు చేశాను ‘ఈ రోజు ఎంత ఆనందంగా ఉన్నానో, ప్రతిరోజూ ఇలాగే గడవనీ’ అని దేవుడికి దండం పెట్టుకుంటాను. మా కుటుంబం నుంచి ఎవ్వరూ నన్ను ప్రోత్సహిం^è కున్నా, వృత్తి పట్ల అంకితభావంతో పనిచేశాను. నా కష్టాలు ఎవ్వరికీ తెలియనివ్వలేదు. మూడు ప్రసవాలు జరిగినా కెరీర్ కు ఇబ్బంది రాకుండా సంవత్సరానికి 20 సినిమాలు చేశాను. ఉదయమే దేవుడికి దండం పెట్టుకుని, కాఫీ, బ్రెడ్ తీసుకున్నాక, పేపర్ చదువుతాను. ఇప్పుడు కాఫీ మానేసి, వేడినీళ్లు, తేనె, శొంఠి పొడి, జీలకర్ర పొడి కలిపిన నీళ్లు తాగుతున్నాను. ఆరోగ్యకరమైన భోజనం తింటాను. ఎవరినీ బాధపెట్టను. గౌరవంగా, మర్యాదగా, తృప్తిగా బతకడానికి ఎంత డబ్బు కావాలో అంతే కావాలి అని కోరుకుంటాను. వీలైతే సహాయం చేస్తూంటాను. పబ్లిసిటీ, ఆర్భాటం ఇష్టం లేదు. ఇంటిపనే నాకు పెద్ద వ్యాయామం నాకు వంట బాగా అలవాటు. స్వీట్లలో అరిసెలు ఇష్టం. ఇవి తినాలంటే మిగిలినవి కట్ చేసేస్తాను. పెరుగు, అరటి పండు, ఒక కూర/పప్పు/ చారు/పులుసు ఏదో ఒకటి మాత్రమే. వెన్న, నెయ్యి, పాల వంటివి పరిమితంగా తింటాను. ఆరోగ్యకరమైన భోజనం çరోజుకొకసారి చాలు. ఆకలి లేకపోతే పండు తిని, మంచినీళ్లు తాగి పడుకుంటా. ఈ అలవాట్ల వల్ల నాకు సుగర్, బీపీలు లేవు. రెండు మోకాళ్లకు ఆపరేషన్ చేయించుకున్నాను. గుండె ఆపరేషన్ అయినా పని చేస్తూనే ఉన్నాను. సినిమాలు లేకపోయినా ఇంటి పనే నాకు పెద్ద వ్యాయామం. దేవుడి మీద భక్తి ఉంది. మూఢ నమ్మకాలు లేవు. మంచి ఆలోచనలతో ఉంటే దేవుడు ఇక్కడే ఉన్నాడని భావిస్తాను. మాట వెనక్కు తీసుకుంటానన్నారు.. పుల్లయ్యగారి దర్శకత్వంలో ‘వెంకటేశ్వర మహాత్మ్యం’లో ఎరుకలసాని వేషం వేసే అవకాశం వచ్చింది. సాయంత్రం షూటింగ్ అయితే, మధ్యాహ్నం చెప్పారు. నేను భయపడ్డాను. పుల్లయ్యగారు ధైర్యం చెప్పి, నాకు ట్రయినింగ్ ఇచ్చారు. పదిహేను నిమిషాల పాత్ర. చెప్పింది చెప్పినట్లుగా నేర్చుకున్నాను. ఆ సినిమా చూసిన కె. వి. రెడ్డిగారు తన మాటను వెనక్కు తీసుకుంటాను అన్నారు. ఎంతో సంతోషించాను. అదే నాకు నిజమైన సినిమా అనుకుంటాను ఇప్పటికీ. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
అర్జునుడు అంగారపర్ణునితో ఏమన్నాడు?
♦అర్జునుడు అంగారపర్ణునితో ఏమన్నాడు? మిత్రమా! నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావు. అప్పుడు మేం పాండవులమని నీకు తెలియదా? తెలిసే విడిచిపెట్టావా? అని ప్రశ్నించాడు. ♦అర్జునుని ప్రశ్నకు చిత్రరథుడు ఏమన్నాడు? మిత్రమా! నీ శౌర్యప్రతాపాలను గురించి నారదాది మునులు, దేవతల వలన విన్నాను. అయినా విడిచిపెట్టడానికి రెండు కారణాలున్నాయి.. అన్నాడు. ♦రెండు కారణాల గురించి ఏమన్నాడు? స్త్రీలు దగ్గరున్నప్పుడు మగవారు దురభిమానంతో ఉంటారు. మంచిచెడ్డల తారతమ్యం గ్రహించలేరు. ఎదుటివారి శక్తిని గుర్తించలేరు. తామే గొప్పవారం అనుకుంటారు. ఇక రెండవది... రాజులకు పురోహితుడు ఉండాలి. నాకు పురోహితుడు లేడు. ఇప్పుడు మంచి పురోహితుడిని ఏర్పరచుకుంటాను అని చెప్పాడు. ♦పురోహితుడికి ఉండవలసిన లక్షణాల గురించి ఏమన్నాడు? పురోహితుడు వేదవేదాంగాలు చదివి ఉండాలి. జపహోమ యజ్ఞాలలో ప్రసిద్ధుడై ఉండాలి. శాంతచిత్తులు, సత్యవంతులు కావాలి. ధర్మార్థకామమోక్షాలు పొందటానికి సమర్థుడై ఉండాలి. అటువంటి పురోహితులు ఉన్న రాజులు ప్రకాశవంతులు అవుతారు అని పురోహితుడి గురించి వివరించాడు. ♦చిత్రరథుని మాటలు విన్న పాండవులు ఎలా ఆలోచించారు? చిత్రరథుని మాటలు విన్న పాండవులు, వారు కూడా పురోహితుడిని ఏర్పరచుకోవాలనుకున్నారు. అటువంటి వానిని సూచించమని చిత్రరథుని కోరారు. ♦చిత్రరథుడు ఎటువంటి సూచన చేశాడు? చిత్ర రథుడు ఆలోచించి, ఉత్కచమనే దివ్య క్షేత్రం ఉంది. అక్కడ ధౌమ్యుడు అనే ఉత్తముడు ఉన్నాడు, ఆయనను పురోహితునిగా చేసుకోమని చెప్పి, అక్కడ నుంచి భార్యాసహితుడై వెళ్లిపోయాడు. ♦పాండవులు ఎక్కడకు వెళ్లారు? పాండవులు ఉత్కచం వెళ్లారు. ధౌమ్యుని చూశారు. అతడు శాంతచిత్తుడు. తపస్సు చేస్తున్నాడు. పాండవులు అతడిని పూజించారు. తనకు పురోహితునిగా ఉండవలసినదని ప్రార్థించారు. ధౌమ్యుడు అంగీకరించాడు. – నిర్వహణ: వైజయంతి పురాణపండ -
అంగారపర్ణుని భార్య ఎవరు, ఆమె ఏమంది?
అంగార పర్ణుని మాటలకు అర్జునుడేమన్నాడు? అంగారపర్ణా! గొప్పలు మాట్లాడుతున్నావు. శక్తిహీనులు సంధ్యాకాలంలోను, అర్ధరాత్రి సమయంలోనూ సంచరించటానికి జంకుతారు. గంగానది నీది కాదు, ప్రజలందరిదీ. గంగ హిమవత్పర్వతంలో పుట్టింది. భూలోకంలో ప్రవహిస్తోంది, సముద్రంలో కలుస్తోంది.. అన్నాడు. అర్జునుడు గంగానది గురించి ఏమన్నాడు? గంగానది శివుని జటాజూటంలో పుట్టింది, ఆకాశంలో ప్రవహించేటప్పుడు మందాకిని. మూడులోకాలను పరిశుద్ధం చేస్తున్న గంగానది అందరికీ చెందినది. మేం ఇక్కడ స్నానం చేస్తాం.. అని ముందుకు సాగాడు. అంగారపర్ల– అర్జునుల యుద్ధం ఎలా జరిగింది? అంగారపర్ణుడు అర్జునుడి మీదకు బాణం విడిచాడు. అర్జునుడు కొరివితో బాణాలను కొట్టేశాడు. ద్రోణుడు ప్రసాదించిన ఆగ్రేయాస్త్రం ప్రయోగించాడు. అది అంగారపర్ణుని రథాన్ని కాల్చింది. భయభ్రాంతుడైన అంగారపర్ణుడు నేలకూలాడు. అర్జునుడు ఏం చేశాడు? నేలకూలిన అంగారపర్ణుని జుట్టు పట్టి ఈడ్చుకొచ్చి, ధర్మరాజు ముందు ఉంచాడు. అంగారపర్ణుని భార్య ఎవరు, ఆమె ఏమంది? అంగారపర్ణుని భార్య కుంభీనస ఉరికి వచ్చి, తన భర్తను రక్షించమని వేడుకుంది. కుంభీనస మాటలకు ధర్మరాజు ఏమన్నాడు? ధర్మరాజు అంగారపర్ణుని దీనత్వాన్ని చూశాడు. కుంభీనసను, ఆమె దుఃఖాన్ని చూసి, ‘అర్జునా! యుద్ధంలో ఓడినవానినీ, హీనుడినీ, శౌర్యం విడిచినవారినీ చంపకూడదు. వీడు నీ చేతిలో ఓడాడు. భయపడుతున్నాడు, విడిచిపెట్టు’ అన్నాడు. ధర్మరాజు గురించి అర్జునుడు ఏమన్నాడు? అంగారపర్ణా! ఇతడు నా అన్న ధర్మరాజు. కురువంశ ప్రభువు. దయ గలవాడు. శరణాగతవత్సలుడు. నిన్ను విడిచిపెట్టమని ఆజ్ఞాపించినందుకు విడిచిపెడుతున్నాను, భయం విడిచిపెట్టు’ అని పలికి, అంగారపర్ణుడిని విముక్తుడిని చేశాడు. అర్జునుడి మాటలకు అంగారపర్ణుడు ఏ విధంగా స్పందించాడు? అంగారపర్ణుడు ధైర్యం తెచ్చుకుని, ‘అర్జునా! నేను నీ చేతిలో ఓడిపోయాను కాబట్టి నా పేరు మార్చుకుంటాను. నేటి నుంచి నేను చిత్రరథుడిని, నీతో స్నేహం చేయదలిచాను అన్నాడు. అంగారపర్ణుడు తన దగ్గర ఉన్న విద్య గురించి ఏమన్నాడు? నా దగ్గర చాక్షుహు అనే విద్య ఉంది. దానితో ఏకకాలంలో మూడు లోకాలు చూడవచ్చు. ఈ విద్య నీకు ఇస్తున్నాను. ఇది ఫలించటానికి ఆరుమాసాలు వ్రత నియమాలు కలిగి ఉండాలి అన్నాడు. పాండవులు ఐదుగురికి ఏమిస్తానన్నాడు? తనకు ఏమివ్వమని కోరాడు? ఐదుగురికి కొంత ధనం, నూరేసి గుర్రాల చొప్పున గంధర్వజాతి గుర్రాలను ఇస్తాను, అందుకు బదులుగా ఆగ్రేయాస్త్రం ఇవ్వమని కోరాడు. – నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ -
కథ అంతా విన్న కుంతి ఏమంది?
ప్రశ్న: అగ్రహారానికి కొంత దూరంలో ఏముంది? జవాబు: యమునా నది ప్రశ్న: నది ఒడ్డున ఎవరున్నారు? జవాబు: బకాసురుడనే రాక్షసుడు ప్రశ్న: పూర్వం ఏం చేసేవాడు? జవాబు: ఆ ఊరి మీద పడి, ఇష్టం వచ్చినట్లు నరులను చంపి తినేవాడు ప్రశ్న: జనం తగ్గిపోతుండటంతో గ్రామ పెద్దలు ఏమనుకున్నారు? జవాబు: జన క్షయం నుంచి గ్రామాన్ని రక్షించాలనే ఆలోచనతో గ్రామ ప్రజలు బకాసురునితో ఒక ఒప్పందానికి వచ్చారు ప్రశ్న: ఏమని ఒప్పందం చేసుకున్నారు? జవాబు: ప్రతి రోజు ఒక ఇంటి నుంచి ఒక మనిషి, రెండు దున్నపోతులు కట్టిన బండి, దాని నిండా ఆహారం, మాంసం తీసుకువెళ్లి, బకాసురునికి ఇవ్వాలి. అలా తెచ్చినవాటిని బకాసురుడు భక్షించాలని ఒప్పందం చేసుకున్నారు. ప్రశ్న: అందుకు ప్రతిగా బకాసురుడు ఏం చేయాలి? జవాబు: ఏకచక్రపురాన్ని రక్షించాలి. అంతవరకు ఆ రాక్షసుడిని చంపగల రాజులు పుట్టలేదని కుంతికి వివరించారు. ప్రశ్న:. కథ అంతా విన్న కుంతి ఏమంది? జవాబు: అయ్యా! మీరు నాకు ఉపకారం చేశారు. నాకు ఐదుగురు కొడుకులు. ఒకరిని ఆహారంగా పంపుతాను. అలా మీ ఋణం తీర్చుకుంటాను.. అంది ప్రశ్న: కుంతి మాటలకు యజమాని ఏమన్నాడు? జవాబు: మీరు నాకు అతిథులు. అతిథిని అవమానించటం పాపం. చంపించటం మహాపాపం. కాబట్టి నేను సమ్మతించను.. అన్నాడు. – నిర్వహణ: వైజయంతి పురాణపండ -
తల్లి మాటలు విన్న భీముడు ఏం చేశాడు?
ప్రశ్న: తల్లి మాటలు విన్న భీముడు ఏం చేశాడు? జవాబు : కుంతిని వారి ఇంటికి పంపాడు ప్రశ్న: ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంది? జవాబు : వారి ఇల్లు అల్లకల్లోలంగా ఉంది. బంధువులు, జనులు అందరూ దుఃఖిస్తున్నారు. యజమాని కన్నీరు కారుస్తున్నాడు ప్రశ్న:యజమాని విలపిస్తూ బంధువులతో ఏమన్నాడు? జవాబు : నా భార్యను రాక్షసుడికి అర్పించాలి. ఆమె రక్షణ బాధ్యత నా మీద ఉంది. నా కూతురుని పంపలేను. ఆమెకు పెండ్లి చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. నా కుమారుడు చిన్నవాడు. వాడు వృద్ధిలోకి రావాలి. అందువల్ల నేనే రాక్షసునికి ఆహారంగా వెళ్తాను అన్నాడు ప్రశ్న:యజమాని మాటలకు అతని భార్య ఏమంది? జవాబు : ఆపద వచ్చినప్పుడు విచారించకూడదు. ఎదిరించాలి. మీకు పుత్రులను ఇచ్చాను. నా ఋణం తీరింది. నేను ఉన్నప్పటికీ పిల్లల్ని పోషించలేను. మిమ్మల్ని వదిలి జీవించలేను. మీరు జీవించి ఉండాలి. నేను రాక్షసుడికి ఆహారంగా వెళ్తాను.. అంది ప్రశ్న: కూతురు ఏమంది? జవాబు : తల్లిదండ్రులారా! ఎంతకాలం ఉన్నా, నేను పరుల ఇంటికి వెళ్లవలసినదానిని. మీరు జీవించి ఉంటే, బిడ్డలను పొందవచ్చు. నేనే రాక్షసునికి ఆహారంగా వెళ్తాను అంది ప్రశ్న: కుమారుడు ఏమన్నాడు? జవాబు : నేను రాక్షసుడిని చంపుతాను అంటూ కర్ర పట్టుకుని ఉరికాడు. అంత దుఃఖంలోనూ బాలుని మాటలు విని అందరూ నవ్వారు ప్రశ్న: అంతా విన్న కుంతి ఏం చేసింది? జవాబు : వారిని ఓదార్చి అసలు కథ అడిగింది. -
పాండవులు ఏ వేషం ధరించారు?
ప్రశ్న: పాండవులు శాలిహోత్రుని దగ్గర ఏమేమి నేర్చుకున్నారు? జవాబు: ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు అభ్యసించారు ప్రశ్న: శాలిహోత్రుని దగ్గర నుంచి ఏయే దేశాలు దాటారు? జవాబు: మత్స్య, త్రిగర్త, కీచక దేశాలు దాటి, వ్యాసుడు చెప్పిన ఏకచక్రపురం చేరారు ప్రశ్న: పాండవులు ఏ వేషం ధరించి, ఎవరి దగ్గర ఉన్నారు? జవాబు: బ్రాహ్మణ బ్రహ్మచారుల వేషం ధరించి, ఒక బ్రాహ్మణుని ఇంటి ఉన్నారు ప్రశ్న: పాండవులు నిత్యం ఏం చేసేవారు? జవాబు: భిక్షకు వెళ్లేవారు ప్రశ్న: పాండవులను చూసి ఆ ఊరి జనులు ఏమనుకున్నారు? జవాబు: పాండవుల తేజస్సు చూసి, ఆశ్చర్యపడ్డారు. పాండవులు రాజ్యం పాలించవలసినవారు, భగవంతుడు వీరి పట్ల క్రూరంగా ఉన్నాడు. భిక్షుకులను చేశాడు అనుకున్నారు ప్రశ్న: పాండవులు నిత్యం ఏం చేసేవారు? జవాబు: నిత్యం భిక్ష తెచ్చి, తల్లికి ఇచ్చేవారు. కుంతి భిక్షను రెండు భాగాలు చేసి, ఒక భాగం భీముడికి, రెండవ భాగం తాను, మిగిలిన నలుగురు పాండవులు పంచుకుని తినేవారు ప్రశ్న: ఒక రోజు ఎవరెవరు భిక్షకు వెళ్లారు? జవాబు: భీముడు, కుంతి ఇంట్లో ఉన్నారు. మిగిలిన పాండవులు భిక్షకు వెళ్లారు. ప్రశ్న: ఆ సమయంలో ఏం జరిగింది? జవాబు: పాండవులు ఉన్న ఇంట పెద్దగా ఏడ్పులు వినిపించాయి ప్రశ్న: కుంతి ఆ ఏడ్పులు విని భీముడితో ఏమంది? జవాబు: భీమా! ఈ ఇంటి వారికి ఆపద వచ్చినట్టుంది. నా మనసు పరితపిస్తోంది. మేలు చేసినవారికి మేలు చేయటం మధ్యమం. మేలు చేసిన వారికి ఎక్కువ మేలు చేయటం ఉత్తమం. మేలు చేసినవారిని గుర్తు ఉంచుకోవటం పుణ్యం. ఈ ఇంటి వారు మనకు మేలు చేశారు. వారికి ఉపకారం చేసే ఉపాయం ఆలోచించు... అంది. – నిర్వహణ: వైజయంతి పురాణపండ -
ఇంత ఆరోగ్యం దాగి ఉందా తండ్రీ!
ధనుర్మాసం... ముగ్గులు, హరిదాసులు, గొబ్బిళ్లు, బొమ్మలు, ఆటలు పాటలు... మరో పక్క గోదాదేవి తెల్లవారుజామునే నిద్ర లేచి, తన స్నేహితులను కూడా మేల్కొలుపుతుంది. అందరూ భక్తిగా శ్రీకృష్ణుడిని ధ్యానిస్తారు. ఇది సంప్రదాయంగా వస్తున్న ఆచారం. గోదాదేవి ధనుర్మాసంతో మాట్లాడితే ఎలా ఉంటుంది. ధనుర్మాస పురుషుడు ఏమని సమాధానం చెప్పి ఉంటాడు. ధనుర్మాసంలో సామాజిక కోణం ఏదైనా ఉందా... ఉండే ఉంటుంది. గోదాదేవి, ధనుర్మాసుడితో సంభాషిస్తే బహుశ ఇలా ఉండొచ్చు. సూర్యుడు ధనుస్సులోకి ప్రవేశిస్తూనే తన సహస్ర కిరణాలతో చలి బాణాలను ప్రపంచం మీదకు వదులుతున్నాడు. చలి గజగజలాడిస్తోంది మరి. చెట్లు వణికిపోతున్నాయి. నీళ్లు గడ్డకట్టిపోతున్నాయి. సూర్యుడు బారెడు పొద్దెక్కితేనే కానీ నిద్ర లేవనంటున్నాడు. పాపం చంద్రుడి పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉంది. నక్షత్రాలైతే ‘బాబోయ్ నిద్ర లేవటం మా వల్ల కాదు. మేం కొన్ని రోజులు హాయిగా నిద్రపోతాం’ అంటున్నాయి. పెద్దపులులు, సింహాలు, ఏనుగులు... ఎక్కడ కునుకు తీయాలో అర్థం కాక, పొదల కోసం పరిభ్రమిస్తూనే ఉన్నాయి. అమ్మ బాబోయ్ ఇదేం మాసంరా నాయనా, ఇంత వణికిస్తూ భయపెడుతోంది అంటోంది ప్రాణి కోటి సమస్తం. చలితోనే స్నేహం చేస్తున్న చలిచీమలు ఏం చేస్తున్నాయో. చలి మొదలైతే చాలు చలి పులి అనేస్తాం. పులి కంటె భయంకరమైనది చలి. అయితేనేం... అన్నం పెట్టే రైతును ఆదరించే మాసంగా దనుర్మాసాన్ని ఆరాధిస్తోంది మానవాళి. అంతేనా ఈ మాసమంతా గోమయం, ఆనందమయం, ఆరోగ్య మయం. ధనుర్మాసంలో ధనుస్సును ఎక్కుపెట్టిన నెల్లాళ్లకు మకరం ప్రవేశించి, ధనుస్సు ను ముక్కలు ముక్కలు చేస్తేనే గానీ చలి పురుషుడు పారిపోడు. చలికి వణికిపోతున్నా, ఉదయాన్నే నిద్ర మేల్కొన్న గోదాదేవి ఒకనాడు ధనుర్మాసం దగ్గరకు వచ్చింది. వారిరువురి మధ్య చిన్న సంభాషణ జరిగింది (సృజన మాత్రమే) గోదా: ‘అయ్యా! నమస్కారం ధను: ప్రతి నమస్కారం తల్లీ! ఏమ్మా ఉదయాన్నే లేచావు! గోదా: మీకు తెలీదా తండ్రీ! మా కన్నెపిల్లలమంతా నోము చేసుకుంటున్నాం కదా! ఉదయాన్నే నిద్ర లేచి స్నానాదులు చేసుకుని, పరిమళపుష్పాలు తీసుకుని రంగనాథుని సేవించాలి కదా! ధను: అవును తల్లీ! ఈ చలికి ముసుగు వేసుకునేసరికి అన్నీ మరచిపోయాను. గోదా: మీరు మాత్రం ముసుగు వేసుకుని పడుకుంటారు, మేం మాత్రం గజగజ వణికిపోతూ చన్నీటి స్నానం చేసి, వ్రతం ఆచరించాలి. ధను: తల్లీ అసలు వ్రతం అంటే ఏమిటో తెలుసా నీకు? గోదా: ఏముంది, ఒక విధానంలో చేసే పూజే కదా. ధను: వ్రతం అంటే క్రమశిక్షణ. వ్రతం అంటే నియమానుసారంగా పనిచేయటం. వ్రతం చేయటం వల్ల మనసు ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటుంది. అంతేకాదు... పంచభూతాలు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తుంటే మానవులు అదుపు తప్పుతున్నారు. అలా ఉండకూడదని మీ వంటి యువతుల ద్వారా చెప్పించటమే వ్రతాలలోని పరమార్థం. గోదా: నిజమే స్వామీ. ఇంతకీ వ్రతం చేయటంలోని అంతరార్థం ఏమిటో కాస్త దుప్పటి తొలగించి వివరించు స్వామీ. ధను: వ్రతం చేయటమంటే ఆర్భాటంగా పట్టు వస్త్రాలు ధరించి, ఖరీదైన పూలు పండ్లతో అర్చించటం కాదు. త్రికరణశుద్ధిగా అంటే మనసు, వాక్కు, శరీరం ఈ మూడూ ఒక పని మీద లగ్నం కావాలి. ప్రదర్శన ఉండకూడదు. నువ్వు చేసే పని మీద నీ మనసు లగ్నం చేయాలి. అప్పుడే అనుకున్నది సాధిస్తాం. ఇటువంటి వాటి కోసమే వ్రతాలు, పూజలు, నోములు ఉద్దేశించబడ్డాయి. గోదా: నిజమే తండ్రీ. ధను: మరో విషయం చెప్పనా, ముఖ్యంగా ఆడపిల్లలకు ఉదయానే నిద్ర లేవటం ఆరోగ్యం. ఆమె శరీరం సుకుమారంగా ఉంటుంది. ఆ సౌకుమార్యాన్ని చలికి అలవాటు చేయడం కోసమే ఇటువంటివి నిర్దేశించబడ్డాయి. గోదా: ఇంత ఆరోగ్యం దాగి ఉందా తండ్రీ! ధను: అంతేకాదు తల్లీ, సృష్టిలో స్త్రీకి స్త్రీ శత్రువు అంటారు. అది అవాస్తవం అని చూపటానికే ఇటువంటి వ్రతాలు. కన్నె పిల్లలంతా కలిసికట్టుగా ఆచరించే పూజ ఇది. ఏ వ్రతం చేసినా, ఏ నోము చేసినా... ఇరుగుపొరుగు స్త్రీలను ఆహ్వానించి వారికి తాంబూలం ఇస్తాం. ఇప్పుడు చెప్పు ఎవరికి ఎవరు శత్రువో. గోదా: నిజమే తండ్రీ! అయితే ఇక్కడ మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మీరు వచ్చిన మాసంలోనే ముగ్గులు, గొబ్బిళ్లు, మూడు రోజుల పండుగలు.. పిండివంటలు ... ఇవన్నీ ఎందుకు తండ్రీ? ధను: బంగారుతల్లీ! చంద్రుడు ధవళ కాంతులీనుతున్నప్పటికీ, వెండి వెన్నెలలు కురిపిస్తున్నప్పటికీ, అమృతకిరణుడు, సుధామయూఖుడు అనుకున్నప్పటికీ, ఆయన కూడా పరుగులు తీస్తూనే ఉంటున్నాడు. అందువల్ల క్రిమికీటకాలు బద్దకం వదిలి విజృంభిస్తాయి. గోదా: ఓహ్ అందుకేనా అవి ఇంట్లోకి రాకుండా గుమ్మాలలో వరిపిండితో ముగ్గులు వేసి, గొబ్బిళ్లు ఉంచి, వాటిమీద పూలు అలంకరిస్తారు. ధను: ఇందులో మరో పరమార్థం చెప్పనా, ఆవుపేడతో గొబ్బిళ్లు చేస్తారు మీరు. ఆవుపేడను మించిన క్రిమిసంహారకం లేదు. అందుకే పేడతో గొబ్బెమ్మ ఆకృతి రూపొందించి, వాటి మీద ముగ్గు, పసుపు, కుంకుమ వేసి, ఆ పైన గొబ్బిపూలతో అలంకరించి, ముగ్గు నడిబొడ్డున ఉంచుతాం. గోదా: అవును నిజమే. మీరు చెప్పినది అక్షర సత్యం. ధను: మరొకటి, ఆడపిల్లలకు ఏ పనైనా అందంగా, పద్ధతిగా చేయటమంటే చాలా ఇష్టం. వాళ్లు మాత్రమే చేయగలుగుతారు. ఈ పనుల వల్ల ఆరోగ్యంతోపాటు, సృజన శక్తి కూడా పెరుగుతుంది. ఏ పనినైనా మంచి మనసుతో, క్రమశిక్షణతో, త్రికరణశుద్ధి గా చేయటం వల్ల పాపపుణ్యాల మాట అటుంచితే, ఆరోగ్యం సమకూరుతుంది. గోదా: ఈరోజు మీరు మాకు ఎన్నో మంచి విషయాలు చెప్పారు. ఒక్కో పండుగలోని సామాజిక కోణం తెలుసుకోవాలనే విషయం అర్థమైంది స్వామీ. ఇంక నేను బయలుదేరతాను. నా స్నేహితురాళ్లను నిద్ర లేపి, మీరు సూచించిన విధంగా వ్రతం ఆచరించుతాను. ధను: మంచిది తల్లీ! శుభమస్తు. (గోదాదేవి అందరినీ నిద్ర మేల్కొలపటానికి బయలుదేరింది) – సృజన: డాక్టర్ వైజయంతి పురాణపండ -
ఈ సరస్సులో నీళ్లు తాగినవారికి..
ప్రశ్నోత్తర భారతం ప్రశ్న: వేదవ్యాసుని ఘనత ఎటువంటిది? జవాబు: వేదవ్యాసుడు తేజోవంతుడు, మహాజ్ఞాని. ప్రశ్న: వేదవ్యాసుని చూడగానే పాండవులు ఏం చేశారు? జవాబు: వేదవ్యాసునికి నమస్కరించారు, అర్ఘ్యపాద్యాలు ఇచ్చారు. ఆసనం అర్పించారు. వేదవ్యాసుడు కూర్చున్నాడు. ప్రశ్న: పాండవులతో వ్యాసుడు ఏమని పలికాడు? జవాబు: దుర్యోధనుడు దుర్మార్గుడు. పాపాత్ములను, దుష్టులను నమ్మకూడదు. మీకు మేలు చేయటానికి వచ్చాను.. అన్నాడు. ప్రశ్న: పూర్వజన్మ ఫలితం గురించి వ్యాసుడు ఏమన్నాడు? జవాబు: పూర్వజన్మ ఫలితం కారణంగా మీకు బంధు విరోధం కలిగింది. అందుకు దుఃఖించకూడదు. ముందుముందు మీకు మేలు కలుగుతుంది.. అన్నాడు. ప్రశ్న: ఆ ప్రాంత మహత్మ్యం గురించి ఏమన్నాడు? జవాబు: ఈ సరస్సులో నీళ్లు తాగినవారికి ఆకలిదప్పులు ఉండవు. ఈ చెట్టు కింద ఉన్నవారి చలి, ఎండ, వాన, అలసట వంటి బాధలు ఉండవు. మీరు కొంతకాలం ఇక్కడ నివసించండి. తరవాత ఏకచక్రపురానికి వెళ్లండి, మళ్లీ నేను మిమ్మల్ని కలుస్తాను... అన్నాడు. ప్రశ్న: హిడింబ గురించి వ్యాసుడు ఏమన్నాడు? జవాబు:హిడింబ పతివ్రత. ఈమె పేరు నేటి నుంచి కమలపాలిక. ఈమెను భీముడు వివాహం చేసుకోవాలి. ఈమెకు భీముని వలన పుత్రుడు కలుగును. అతడు మీకు ఆపదలలో సాయం చేయగలడు.. అని వ్యాసుడు చెప్పి అంతర్థానమయ్యాడు. ప్రశ్న: భీముడు ఏం చేశాడు? జవాబు: భీముడు హిడింబను భార్యగా స్వీకరించాడు. ఆమెకు పుత్రుడు కలిగేవరకు ఆమెతోఉండి, తరువాత ఆమెను వదలివేసేలా నియమం ఏర్పరిచాడు. ప్రశ్న: భీముడు, కమలపాలిక ఏం చేశారు? జవాబు: భీముడు, కమలపాలిక పగలంతా అడవులపలోను, కొండలలోను విహరించారు. రాత్రులు పాండవుల దగ్గర ఉండి వారిని రక్షించారు. ప్రశ్న: కొంతకాలం తరవాత ఏం జరిగింది? జవాబు: కమలపాలిక సద్యోగర్భం కలిగి కుమారుడిని కన్నది. ప్రశ్న: కుమారుని ఆకారం ఎలా ఉంది? జవాబు: ముఖం భయంకరంగా ఉంది. కళ్లు వికారంగా ఉన్నాయి. నల్లని దేహం, భయంకరమైన కోరలు కలిగి, వికార రూపం కలిగి ఉంది. అతడు కామరూప ధరుడు, సకల శస్త్రాస్త్ర విద్యాలలో ఆరితేరినవాడు. వాడు ఘటోత్కచుడు. ప్రశ్న: కొంతకాలం పాండవుల దగ్గర ఉన్నఘటోత్కచుడు పాండవులకు నమస్కరించి ఏమన్నాడు? జవాబు: తండ్రులారా! నేను బయలుదేరతాను. రాక్షసులతో కలిసి ఉంటాను. మీకు నాతో పని ఉన్నప్పుడు నన్ను తలచుకోండి. నేను మీ దగ్గరకు వచ్చి వాలతాను.. అని, తల్లి కమలపాలికను వెంటబెట్టుకుని ఉత్తర దిక్కుకు వెళ్లిపోయాడు. – నిర్వహణ: వైజయంతి పురాణపండ -
నాటి రాత్రి లక్క ఇంటిని కాల్చమని..
లక్క ఇల్లు ప్రశ్న: ఒకనాడు హస్తిన నుంచి ఎవరు వచ్చారు? సమాధానం: ఒక మనిషి వచ్చాడు. అతడు గనులు తవ్వులయందునేర్పరి ప్రశ్న: ఆ మనిషిని ఎవరు పంపారు? సమాధానం: విదురుడు ప్రశ్న: ఆ మనిషి ఏం చేశాడు? సమాధానం: పాండవులను రహస్యంగా కలుసుకున్నాడు ప్రశ్న: ధర్మరాజుతో ఏమన్నాడు? సమాధానం: నేను విదురుడు పంపగా వచ్చాను. అతడు మీ క్షేమం కోరి నన్ను ఇక్కడకు పంపాడు ప్రశ్న: లక్క ఇంటి గురించి ఏమని వివరించాడు? సమాధానం: కృష్ణపక్ష చతుర్దశి నాటి రాత్రి లక్క ఇంటిని కాల్చమని పురోచనుడు అన్నాడు. ఈ ఇంటి నుండి మిమ్మల్ని తప్పించమని విదురుడు నన్ను ఆజ్ఞాపించాడు. అందుకు నేను ఒక బిలం తవ్వాను. దాని ద్వారా మీరు బయటకు వెళ్లవచ్చు అన్నాడు. ప్రశ్న: అతడి మాటలు విన్న భీముడు ఏం చేశాడు? సమాధానం: భీముడు బిలం పరిశీలించి చూశాడు. అపాయం లేదని గ్రహించాడు. తమకేమీ తెలియనట్లు ఉన్నాడు ప్రశ్న: పురోచనుడు ఎవరిని వివాహమాడాడు? సమాధానం: నిషాద స్త్రీని ప్రశ్న: పురోచనుడికి ఎంతమంది కొడుకులు? సమాధానం: ఐదుగురు –నిర్వహణ: వైజయంతి పురాణపండ -
పుస్తక నవోదయం...
విజయవాడలోని ఏలూరురోడ్డులో అన్నీ పుస్తకాలయాలే, అందులో అన్నీ ఉద్ద్దండుల పుస్తకాలే. అన్ని ప్రచురణల మధ్య రెండు చేతులు జోడించి నమస్క రిస్తూ కనిపిస్తుంది నవోదయ సంస్థ. తెలుగు వారంతా తెల్లకాగితాలతో ఉన్న ఒక పుస్తకాన్ని ప్రదర్శిస్తే దానికి కూడా నిశ్శబ్దంగా నవోదయ ముద్ర పడుతుంది. ఈ ముద్ర వెనుక కథ చాలా పెద్దదే. రామమోహనరావు చిన్నబావ కొండపల్లి రాఘవరెడ్డి గుడివాడలో ‘నవోదయ పబ్లిషర్స్’ స్థాపించిన ఏడాదికే ఆ కార్యాలయాన్ని విజయవా డకు మార్చడంతో నవోదయ ప్రస్థానం మొద లైంది. 60 ఏళ్ల క్రితం సువిశాల ప్రాంగణంలో ప్రారంభమై, కొత్త పోకడల పెనుతుఫాన్‌కు తల వంచి, తన పరిధిని తగ్గించుకుంది. నవోదయ సంస్థ ఆర్థికంగా చిక్కినా, లక్ష్యాన్ని విడిచి పెట్టలేదు. ప్రచురణలు ఆపారు. విక్రయాలు జరిపారు. 1934లో కృష్ణాజిల్లా గన్నవరం తాలూకా ఉంగుటూరు గ్రామంలో ముగ్గురు ఆడపిల్లల తరవాత జన్మించిన అట్లూరి రామమోహన్‌రావు, ఎస్సెస్సెల్సీ వరకు చదువుకున్నారు. 1955లో పర్వతనేని ఝాన్సీతో దండల వివాహం చేసు కున్నారు. పుస్తక వ్యాపారాన్ని గౌరవప్రదమైన వృత్తిగా భావించిన రామమోహనరావు, ‘చదువుకున్న వారితో పరిచ యాలు పెరిగినకొద్దీ నాకున్న సాహిత్య పరిజ్ఞానం ఎంతటిదో తెలిసింది. బాపు కార్టూన్ల సంకలనాన్ని శ్రీరమణ ముందుమాటతో మొట్టమొదటగా ప్రచు రించే అదృష్టం నాకు దక్కింది. నండూరి రామ మోహనరావుగారి ‘విశ్వ రూపం’ పుస్తకాన్ని నాటి రాష్ట్ర విద్యామంత్రి పీవీ నరసింహారావు ఆవిష్క రించడం మరపురాని ఘట్టం. ‘బాపు రమణీయం’ పుస్తకావిష్కరణ సభ నవోదయ సంస్థకి ఒక తీపి జ్ఞాపకం అనేవారు. కలకత్తాలోని పుస్తకప్రదర్శనకు వెళ్లి వచ్చాక, ‘ఇటువంటి పండుగను యేటా విజ యవాడ నగరంలో నిర్వహిస్తే బాగుంటుంది. అందరూ కలిసి వస్తే అందుకు నేను పెద్దరికం తీసుకుంటాను’ అని పలికి, పాతికేళ్లపాటు పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఒక రచయిత పదికాలాల పాటు జీవించి ఉండాలంటే వారి రచనలు పుస్తక రూపంలో ఉండాలి. లేదంటే ఆ వ్యక్తి రచయితగా మరణించినట్లే అనే భావనతో చాలామందిని సజీ వులను చేశారు రామమోహనరావు. 1961 నాటికి గొల్లపూడి మారుతీరావు రచించిన ‘చీకట్లో చీలికలు’ పుస్తకానికి బాపుతో బొమ్మలు వేయించారు. ముళ్లపూడి వెంకటరమణ ‘గిరీశం లెక్చర్లు’ పుస్తకం అందంగా ముద్రించడంతో, వారికి నవోదయ మీద నమ్మకం కుదిరింది. ‘‘బాపు ఓసారి హైదరాబాద్ వెళ్తూ విజయవాడలో నన్ను కలవటం నా జీవితంలో మేలి మలుపు. నాటి నుంచి వారిద్దరూ నాకు ఆత్మీ యులు. అందుకే వారితో అవసరానికి మించి అభి మానం పెంచుకున్నాను’’ అని వారిని స్మరించుకునే వారు రామమోహనరావు. శంకరమంచి సత్యం రచించిన ‘అమరావతి కథలు’ (100 కథలు) పుస్త కానికి బాపు చేత బొమ్మలు వేయించాలనుకున్న కలను నెరవేర్చుకున్నారు. ఆకాశవాణి మిత్రుల మాటలలో జరుక్శాస్త్రి పేరు తరచుగా తగిలేది. ‘ఎవరు ఈ జరుక్శాస్త్రి? చదువుదామంటే ఎక్కడా కనబడడేమండీ?’ అనుకుని, సమాచారం సేక రించి, ‘శరత్ పూర్ణిమ’ (కథలు), ‘తనలో తాను’ (వ్యాసాలు), ‘జరుక్శాస్త్రి పేరడీలు’ ప్రచురించారు. ఆరుద్ర కోరికపై, శ్రీరంగం నారాయణబాబు ‘రుధి రజ్యోతి’ ప్రాముఖ్యత తెలియకుండానే ప్రచురిం చడంవల్ల శ్రీశ్రీ, ఆరుద్రల మధ్య సంబంధాలు నిర్దేశించే స్థాయికి చేరింది ఆ ప్రచురణ. 1963లో గోపీచంద్ ఫొటోని క్యాలెండర్‌గా ప్రచురించారు. నవోదయ రామమోహనరావును ఎవరైనా ‘మీరు కమ్యూనిస్టు కదా’ అంటే ‘నేను కమ్యూ నిస్టుని కాదు, హేతువాదిని. నా పిల్లలిద్దరి పెళ్లిళ్లూ రిజిస్ట్రార్ ఆఫీసులోనే చేయించాను. మా అబ్బాయి కులాంతర వివాహం చేసుకున్నప్పుడు గర్విం చాను. మా నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రి యలు నిర్వహించమని ఎంతమంది ఒత్తిడి చేసినా తలొగ్గలేదు. నా తదనంతరం కూడా నా శరీరంలోని అన్నిభాగాలూ వైద్య విద్యార్థులకే ఉపయోగ పడాలన్నది నా కోరిక’ అనేవారు. ఎన్నో ఆదర్శ భావాలు కలిగి, పుస్తక ప్రపంచంలో ఒక శకాన్ని సృష్టించిన నవోదయ రామమోహనరావు, తన ప్రచురణల ద్వారా రచయితతో పాటు చిరయశస్సు సంపాదించుకున్నారు. (బాపు జయంతిరోజునే నవోదయ రామమోహనరావు కాలం చేయడం యాదృచ్ఛికం కావొచ్చు) డాక్టర్ వైజయంతి పురాణపండ -
నిలిచిపోయిన ‘నర్తనం’
నివాళి ఒక మువ్వ రాలిపోయింది... నిన్నటి దాకా నేలపై నర్తించిన పాదం... శివునితో నాట్యం చేయడానికి కైలాసం చేరుకుంది...కూచిపూడి వెంపటి వారసత్వం లయమై పోయింది... ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు పద్మవిభూషణ్ వెంపటి చినసత్యం రెండవ కుమారుడు నాట్యాచార్యులు వెంపటి రవి శంకర్ ఈ ఉదయం గుండె పోటుతో చెన్నైలో కన్నుమూశారు. ‘‘1969 అక్టోబర్‌లో జన్మించిన రవి శంకర్ తండ్రి దగ్గర నాట్యాభ్యాసం చేయలేదు. వెంపటి చినసత్యంగారి ప్రథమ శిష్యురాలు బాల కొండలరావు దగ్గర వెంపటి నాట్యం ఆరంభించారు. ‘శ్రీనివాస కల్యాణం’లో కల్పతరువుగా నటించి, తండ్రి దృష్టిలో పడ్డారు. కుమారుడిని చూసి తండ్రి మురిసి పోయారు. ‘ఇంతింతై వటుడింతౖయె’ అన్నట్లుగా తండ్రికి దీటుగా నాట్యకారుడిగా అవ తరించాడు. చినసత్యం రూపొందించిన అంశాలను 1994 – 2004 మధ్యకాలంలో ప్రదర్శించారు. అర్ధనారీశ్వరుడిగా నటించి అందరినీ అలరించారు. ‘హరవిలాసం’లో శివుడు, ‘శకుంతలదుష్యంతులు’లో దుష్యంతుడు, ‘కిరాతార్జునీయం’లో అర్జునుడిగా నటించారు. బాల్యంలోనే ‘క్షీరసాగర మథనం’లో అప్సరసగా కూచిపూడి సంప్రదాయ రీతుల్లో ఆడ వేషం వేశారు. 1994లో ‘వందే ఉమాసుతం’ అనే స్వీయరచన చేసి 2007లో నృత్య రూపకల్పన చేశారు. ఈ రూపకాన్ని ఐదు గతుల్లో నడిపించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఎవ్వరూ స్పృశించని అనేక అన్నమయ్య కీర్తనలకు నృత్యాభినయం సమకూర్చి పిల్లల చేత ప్రదర్శనలు ఇప్పించారు. ‘అతడిని మించినవాడు లేడు’ అనిపించుకున్నాడు’’ అంటున్నారు ప్రముఖ నాట్యాచార్యులు కూచిపూడి గ్రామానికి చెందిన పశుమర్తి కేశవప్రసాద్. ‘‘మాస్టారుగారి అబ్బాయికి నేర్పడం నాకు గర్వంగా ఉంది. నా శిష్యుడు నన్ను అధి గమించాడు. తండ్రితో సమానంగా, తండ్రికి ధీటుగా ప్రతి విషయాన్ని చక్కగా కూచిపూడి శైలిలో మలిచాడు’’ అంటారు వెంపటి రవిశంకర్ నాట్యగురువులు శ్రీమతి బాల కొండలరావు. ‘‘పద్మభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ దగ్గర సంగీతం అభ్యసించి, కచేరీలు చేశాడు. ఆయన మంచి నాట్యాచార్యుడు, నర్తకుడు. ఆయనకు జ్ఞాత, అజ్ఞాత శిష్యులు దేశవిదేశాలలో ఉన్నారు. ఆయన అçస్తమయం కూచిపూడి కళారంగానికి తీరనిలోటు. అన్ని వాద్యాల మీద అపరిమితమైన పరిజ్ఞానం ఉంది. ఎవరిని ఎలా ఉపయోగించు కోవాలో, ఏ వాద్యాన్ని ఏ సందర్భానికి ఉపయోగించాలో బాగా తెలుసు. లఘువు బిగువులు తెలిసిన మహావ్యక్తి. కుర్రవాళ్లలో ఇటువంటి వ్యక్తిని చూడలేదు. తీర్చిదిద్దడం, అంశాన్ని డ్రమెటైజ్ చేయడం ఆయనకి బాగా తెలుసు. మాకు బాలా త్రిపుర సుందరి మీద కీర్తనలు పాడి ఇచ్చారు. అందరి మనసులలో స్థానం ఏర్పరుచుకున్నారు. సంగీతం, నృత్యం నేర్చుకోవడమే కాదు, అందులో నిష్ణాతులు. చినసత్యం అంతటి వారవ్వగలిగిన జ్ఞాని ఆయన. కాని అనారోగ్యం కారణంగా కాలేకపోయారు. దక్ష యజ్ఞంలో శివుడు వేషం వేసి మెప్పించారు. విద్వత్సభలలో సంగీత కచేరీలు చేశారు. నట్టువాంగం రావాలంటే సంగీతం వచ్చి తీరాలి. చినసత్యం గారు రూపకల్పన చేసిన వాటిని యథాతథం ప్రదర్శించేవారు. ఆనందతాండవం, జయముజయము... వంటివి. చినసత్యంగారి వారసుడుగా నిలబడలేకపోవడం కూచిపూడికి తీరనిలోటు.. అంటు న్నారు విజయవాడకు చెందిన ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యులు భాగవతుల వెంకట రామశర్మ. 2008లో మొట్టమొదటి కూచిపూడి నాట్య సమ్మేళనం అమెరికాలో జరిగినప్పుడు తండ్రితో పాటు సిలికానాంధ్రకు విచ్చేసి ‘కూచిపూడి వైజయంతిక’ అనే బ్యాలేలో సిద్ధేంద్ర యోగి పాత్ర ధరించారు. అప్పటి నుంచి సిలికానాంధ్ర చేస్తున్న అన్ని కార్యక్రమాలకు తోడ్పడుతూ వచ్చారు. 2016లో విజయవాడలో జరిగిన అంతర్జాతీయ కూచిపూడి నాట్యసమ్మేళనానికి ‘సాధన వీడియో’ స్వయంగా తయారుచేసి అందించారు. అద్భుత మైన కళాకారుడు. మృదుస్వభావి. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున 2015లో కళారత్న పురస్కారం అందచేశాం. ఎన్నో సాధించవలసిన వ్యక్తి, చినసత్యంగారి వార సుడు ఆయన. వారి కుటుంబానికి తగిన సహాయం సిలికానాంధ్ర తరఫు నుంచి అంద చేయాలని సంకల్పించాం... అన్నారు సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచిభొట్ల ఆనంద్. – డాక్టర్ పురాణపండ వైజయంతి -
తమిళ రాష్ట్రంలో తెలుగు కవి సమ్మేళనం
రిపోర్టు 350 మంది కవులు... 350 కవితలు.. 4 రాష్ట్రాల నుంచి ఒకే వేదిక మీద తెలుగువారు... మద్రాసు విశ్వవిద్యాలయం, దక్షిణ భారత తెలుగు సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో 24 గంటలపాటు నిరాఘాటంగా జరిగిన తెలుగు కవుల సమ్మేళనం గురించి, ఆ కార్యక్రమ రూపకర్త మాడభూషి సంపత్‌కుమార్ ‘సాక్షి’కి అందించిన వివరాలు: ‘‘ఇంతకుముందు ఎక్కడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు. ఇందులో ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి 350 మంది కవులు పాల్గొన్నారు. తెలుగేతర రాష్ట్రంలో తెలుగు భాషలో ఇటువంటి కార్యక్రమం జరగడం ఒక అరుదైన సంఘటన. ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ వారు మా కార్యక్రమాన్ని గుర్తించారు. ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ వారు కూడా, ‘ఈ కార్యక్రమం మాకు గర్వకారణం. ఇటువంటిది ఎక్కడా వినలేదు’ అని ప్రశంసించారు. ఆలోచన ఇలా.. తెలుగువాళ్లంతా మనవాళ్లే అనే ఆలోచన నుంచే ఈ కార్యక్రమ రూపకల్పన జరిగింది. మనందరం అప్పుడప్పుడు కలుస్తూండటం వల్ల తెలుగుదనం అణగారిపోకుండా ఉంటుంది. ఇంతమంది తెలుగువాళ్లం ఉన్నామనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. భౌగోళికంగా విడిపోయినా కలసి ఉన్నామనే భావనతోనే అందరూ మాట్లాడారు. తెలుగు భాష, తెలుగు వారం అనే అంశం మీద 10 శాతం మంది ఉపన్యసించారు. ఈ సమ్మేళనంలో పద్యకవులు ఎక్కువమంది పాల్గొన్నారు. 150 మంది దాకా స్త్రీలు వచ్చారు. గోదావరి పుష్కరాల కారణంగా అటువైపు వారు కొందరు ఆగిపోయారు. కార్యక్రమం వాయిదా వేసుకుంటే వస్తామని సూచించినప్పటికీ వీలు లేకపోయింది. అయినా ఊహించని విధంగా కొందరు అప్పటికప్పుడు వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగింపు సమావేశానికి వచ్చిన మండలి బుద్ధప్రసాద్‌గారు సంతోషించారు. ఇది తెలుగు రాష్ట్రాలలో అయితే ఇంత చక్కగా జరిగేది కాదన్నారు’’. సంభాషణ: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై.