పాండవులు ఏ వేషం ధరించారు? | Vyjayanthi Puranapanda Prashnottara Bharatam Article In Telugu Devotional | Sakshi
Sakshi News home page

పాండవులు ఏ వేషం ధరించారు?

Published Mon, Dec 28 2020 6:45 AM | Last Updated on Mon, Dec 28 2020 6:45 AM

Vyjayanthi Puranapanda Prashnottara Bharatam Article In Telugu Devotional - Sakshi

ప్రశ్న:  పాండవులు శాలిహోత్రుని దగ్గర ఏమేమి నేర్చుకున్నారు?
జవాబు:  ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు అభ్యసించారు

ప్రశ్న:  శాలిహోత్రుని దగ్గర నుంచి ఏయే దేశాలు దాటారు?
జవాబు: మత్స్య, త్రిగర్త, కీచక దేశాలు దాటి, వ్యాసుడు చెప్పిన ఏకచక్రపురం చేరారు

ప్రశ్న:  పాండవులు ఏ వేషం ధరించి, ఎవరి దగ్గర ఉన్నారు?
జవాబు: బ్రాహ్మణ బ్రహ్మచారుల వేషం ధరించి, ఒక బ్రాహ్మణుని ఇంటి ఉన్నారు  

ప్రశ్న:  పాండవులు నిత్యం ఏం చేసేవారు?
జవాబు: భిక్షకు వెళ్లేవారు

ప్రశ్న:  పాండవులను చూసి ఆ ఊరి జనులు ఏమనుకున్నారు?
జవాబు: 
పాండవుల తేజస్సు చూసి, ఆశ్చర్యపడ్డారు. పాండవులు రాజ్యం పాలించవలసినవారు, భగవంతుడు వీరి పట్ల క్రూరంగా ఉన్నాడు. భిక్షుకులను చేశాడు అనుకున్నారు

ప్రశ్న:  పాండవులు నిత్యం ఏం చేసేవారు?
జవాబు: 
నిత్యం భిక్ష తెచ్చి, తల్లికి ఇచ్చేవారు. కుంతి భిక్షను రెండు భాగాలు చేసి, ఒక భాగం భీముడికి, రెండవ భాగం తాను, మిగిలిన నలుగురు పాండవులు పంచుకుని తినేవారు

ప్రశ్న:  ఒక రోజు ఎవరెవరు భిక్షకు వెళ్లారు?
జవాబు: 
భీముడు, కుంతి ఇంట్లో ఉన్నారు. మిగిలిన పాండవులు భిక్షకు వెళ్లారు.

ప్రశ్న:  ఆ సమయంలో ఏం జరిగింది?
జవాబు: 
పాండవులు ఉన్న ఇంట పెద్దగా ఏడ్పులు వినిపించాయి

ప్రశ్న:  కుంతి ఆ ఏడ్పులు విని భీముడితో ఏమంది?
జవాబు: 
భీమా! ఈ ఇంటి వారికి ఆపద వచ్చినట్టుంది. నా మనసు పరితపిస్తోంది. మేలు చేసినవారికి మేలు చేయటం మధ్యమం. మేలు చేసిన వారికి ఎక్కువ మేలు చేయటం ఉత్తమం. మేలు చేసినవారిని గుర్తు ఉంచుకోవటం పుణ్యం. ఈ ఇంటి వారు మనకు మేలు చేశారు. వారికి ఉపకారం చేసే ఉపాయం ఆలోచించు... అంది.
– నిర్వహణ: వైజయంతి పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement