కథ అంతా విన్న కుంతి ఏమంది? | Vyjayanthi Puranapanda Devotional Article On Mahabharata | Sakshi
Sakshi News home page

కథ అంతా విన్న కుంతి ఏమంది?

Published Wed, Jan 13 2021 7:49 AM | Last Updated on Wed, Jan 13 2021 7:49 AM

Vyjayanthi Puranapanda Devotional Article On Mahabharata - Sakshi

ప్రశ్న: అగ్రహారానికి కొంత దూరంలో ఏముంది?
జవాబు: యమునా నది

ప్రశ్న: నది ఒడ్డున ఎవరున్నారు? 
జవాబు: బకాసురుడనే రాక్షసుడు

ప్రశ్న: పూర్వం ఏం చేసేవాడు?
జవాబు: ఆ ఊరి మీద పడి, ఇష్టం వచ్చినట్లు నరులను చంపి తినేవాడు

ప్రశ్న: జనం తగ్గిపోతుండటంతో గ్రామ పెద్దలు ఏమనుకున్నారు?
జవాబు: జన క్షయం నుంచి గ్రామాన్ని రక్షించాలనే ఆలోచనతో గ్రామ ప్రజలు బకాసురునితో ఒక ఒప్పందానికి వచ్చారు  

ప్రశ్న: ఏమని ఒప్పందం చేసుకున్నారు?
జవాబు: ప్రతి రోజు ఒక ఇంటి నుంచి ఒక మనిషి, రెండు దున్నపోతులు కట్టిన బండి, దాని నిండా ఆహారం, మాంసం తీసుకువెళ్లి, బకాసురునికి ఇవ్వాలి. అలా తెచ్చినవాటిని బకాసురుడు భక్షించాలని ఒప్పందం చేసుకున్నారు.

ప్రశ్న: అందుకు ప్రతిగా బకాసురుడు ఏం చేయాలి?
జవాబు: ఏకచక్రపురాన్ని రక్షించాలి. అంతవరకు ఆ రాక్షసుడిని చంపగల రాజులు పుట్టలేదని కుంతికి వివరించారు.

ప్రశ్న:. కథ అంతా విన్న కుంతి ఏమంది?
జవాబు: అయ్యా! మీరు నాకు ఉపకారం చేశారు. నాకు ఐదుగురు కొడుకులు. ఒకరిని ఆహారంగా పంపుతాను. అలా మీ ఋణం తీర్చుకుంటాను.. అంది

ప్రశ్న: కుంతి మాటలకు యజమాని ఏమన్నాడు?
జవాబు: మీరు నాకు అతిథులు. అతిథిని అవమానించటం పాపం. చంపించటం మహాపాపం. కాబట్టి నేను సమ్మతించను.. అన్నాడు.
– నిర్వహణ: వైజయంతి పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement