వేసవి సెలవలు ఇచ్చేశారు. పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటారు. ఈ సమయంలోనే వారికి వ్యాధినిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పెరిగే ఆహారాన్ని అందించడం వల్ల స్కూళ్లు తిరిగి తెరిచి, వర్షాలు పడినా కూడా చిన్నా చితకా వ్యాధులు రాకుండా ఉంటాయి. పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలో తెలుసుకుందాం...
సాధారణంగా పోషకాలన్నీ ఉన్న సమీకృత ఆహారం అందించడం వల్ల వ్యాధినిరోధకత పెరుగుతుంది. అందుకు ఏం చేయాలో చూద్దాం...
గుడ్డు: కోడిగుడ్డులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పిల్లలకు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినిపించాలి. కండరాలు, చర్మం, గుండె ఆరోగ్యానికి గుడ్డు మంచిది. పిల్లల ఎదుగుదలకు అవసరమైన విటమిన్ ఎ, బి2 (రైబోఫ్లేవిన్) కోడిగుడ్డులో లభిస్తాయి.
ఆకుకూరలు: ఆకుపచ్చటి ఆకుకూరలు, కొత్తిమీర, పాలకూర, ఈ సీజన్‌లో సమృద్ధిగా లభించే మునగకాడలు వంటివి తప్పనిసరిగా పెట్టాలి. వీటిలో ఫైబర్‌తోపాటు ఐరన్, జింక్, మినరల్స్ లభిస్తాయి.
పెరుగు, మజ్జిగ: పెరుగులో ప్రొబయోటిక్స్, విటమిన్ బి12 లభిస్తాయి. ఇది పొట్టలో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేలా ఫ్రూట్ యోగర్ట్, వెజిటబుల్స్ రైతా, బూందీ రైతా రూపంలో ఇవ్వొచ్చు.
పసుపు: పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. పిల్లలకు రోజూ ఇచ్చే ఆహారంలో చిటికడు పసుపును చేర్చడం వల్ల ఆస్తమా, అలర్జీకి సంబంధించిన సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. పాలల్లో పసుపు వేసి తాగించడం అలవాటు చేయవచ్చు.
బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్‌నట్స్, అప్రికాట్స్ వంటివి ఎక్కువగా తినిపించడం వల్ల మెదడు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు లభించడంతో పాటు పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది.
ఇంకా సీజనల్ ఫ్రూట్స్ అయిన మామిడి, జామ, తాటిముంజలు, సపోటా వంటివి ఇవ్వాలి. పిల్లలకు స్వీట్స్, పంచదార ఎక్కువగా ఉండే ఇతర పదార్థాలైన ఫ్రూట్‌జ్యూస్‌లు, చాక్లెట్స్, ΄్యాకేజ్డ్ స్నాక్స్‌ను ఎక్కువగా తినిపించకూడదు. ఇవి ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. ముఖ్యంగా పిల్లలు రోజూ తగినంత నిద్రపోయేలా చూడాలి. గంటసేపైనా బయట ఆడుకునేలా ్రపోత్సహించాలి. ఈ జాగ్రత్తలు పాటించడం మంచిది.
ఇవి చదవండి: Health: ఇంతకీ.. పనీర్ స్వచ్ఛమైనదేనా? ఏం కొంటున్నామో! ఏం తింటున్నామో!!
Comments
Please login to add a commentAdd a comment