శరీర అంతర్గత స్థితిపై మన భావాన్ని ‘ఇంటరోసెప్షెన్’ అంటారు. దీనినే‘సిక్త్స్ సెన్స్’ అని కూడా అంటారు. ‘గట్ ఫీలింగ్’ అనేది మరో పేరు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి ముఖ్యమైనదిగా భావిస్తారు.
అంతశ్చేతన స్థాయి అంటే సబ్ కాన్షియస్ లెవల్‌లో పెద్ద మొత్తంలో సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి, ఏకీకృతం చేయడానికి మెదడు సామర్థ్యం నుంచి అంతర్దృష్టి్ట ఉద్భవిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. భారతీయ పురాణాల నుంచి ఆధునిక శాస్త్రీయ పరిశోధనల వరకు మన దైనందిన జీవితంలో అంతర్‌దృష్టి శక్తి అనేది మనకు ఎలా ఉపయోగపడుతుందో వివిధ కోణాలలో వివరించాయి.
నిర్ణయాలు తీసుకోవడం, సంబంధ బాంధవ్యాలు, సమస్యల పరిష్కారం, వ్యక్తిగత భద్రత, ఆరోగ్యం, క్రియేటివిటీ అండ్ ఇన్‌స్పిరేషన్.. మొదలైన వాటి విషయంలో ఇది ఉపయోగ పడుతుంది.
తాజా విషయానికి వస్తే... ప్రతి పదిమంది మహిళలలో 8 మంది ఆరోగ్యానికి సంబంధించి తమకు సిక్త్స్‌సెన్స్ ఉందని భావిస్తున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. 2000 మంది మహిళలపై జరిపిన ఒక సర్వేలో వారి అంతర్‌దృష్టి ఎంత బలంగా ఉందో పరీక్షించగా వారిలో సగానికి పైగా తమ అంతర్దృష్టిపై నమ్మకం ప్రదర్శించారు.
తమ ఆరోగ్య లక్షణాలకు సంబంధించి వివరాల కోసం 38 శాతం మంది మహిళలు ఆన్‌లైన్‌లో శోధిస్తున్నారు. 37 శాతం మంది గృహవైద్యం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆరోగ్యానికి సంబంధించి తమ ఆందోళనను వైద్యులు తోసిపుచ్చినప్పుడు పదిమందిలో నలుగురు ‘మెడికల్ గ్యాస్లైటింగ్’ అనుభవించామని చెబుతున్నారు. వైద్యపరీక్షలకు దూరంగా ఉండడానికి లేదా వాయిదా వేయడానికి కారణం ‘ఖర్చు భయం’ అంటున్నారు 24 శాతం మంది. 23 శాతం మందిలో ‘రోగ నిర్దారణ భయం’ ఉంది. జీవితంలో ముఖ్యనిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఆరోగ్య విషయంలో తమలోని ‘సిక్త్స్‌సెన్స్’ను ఉపయోగిస్తున్నారు.
అమెరికాకు చెందిన హెల్త్ కంపెనీ ‘ఎండీలైవ్’ కోసం టాకర్ రిసెర్చ్ ఈ సర్వేను నిర్వహించింది.‘అసాధారణ నొప్పి, శ్వాస ఆడక΄ోవడం, గుండెదడ లాంటి సాధారణ లక్షణాలు అంతర్లీన ఆరోగ్య పరిస్థితికి ఆరంభ సంకేతాలు కావచ్చు. ఆరోగ్యపరమైన ఆందోళన ఉన్నా వారు వేచి చూసే ధోరణి వల్ల అది మరింత ఎక్కువ అవుతుంది. మీ ఆరోగ్యం మీద సందేహం వస్తే ఆలస్యం చేయవద్దు. వెంటనే వైద్య సలహా తీసుకోండి’ అంటున్నారు ‘ఎండిలైవ్ బై’ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వోంట్రెల్ రౌండ్‌ట్రీ.
Comments
Please login to add a commentAdd a comment