''నేను మా దూరపు బంధువుల అబ్బాయిని ఇష్టపడుతున్నాను. అయితే అతను నాకు అన్న వరుస అవుతాడని ఈ మధ్యే తెలిసింది. ఈ విషయం తెలిశాక వాళ్లింట్లో వాళ్లు మా పెళ్లికి అభ్యంతరం చెప్తున్నారు. దాంతో ఆ అబ్బాయి కూడా భయపడుతున్నాడు. ఈ వరుస.. నిజంగానే మా పెళ్లికి ప్రమాదమా? దానివల్ల పుట్టబోయే పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం ఉంటుందా''?
దగ్గరి సంబంధంలోని పెళ్లిళ్లలో చాలాసార్లు జన్యుపరమైన వ్యాధులను చూస్తుంటాం. సేమ్ క్రోమోజోమ్ ప్యాటర్న్ దీనికి కారణం. రూపుదిద్దుకునే పిండంలో జెనెటిక్ మాల్‌ఫార్మేషన్స్ అవుతాయి. ఇలాంటి జంటలను సాధారణంగా ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందే ఒకసారి జెనెటిక్ కౌన్సెలింగ్‌కి పంపిస్తాం. ఆ ఇద్దరి ఫ్యామిలీ ట్రీలో ఆ జెనెటిక్ రిస్క్ నిర్ధారణ అవుతుంది.
కొన్ని పరీక్షల ద్వారా బిడ్డకు ఎలాంటి రిస్క్ ఉండవచ్చనేది కొంతవరకు కనిపెట్టవచ్చు. కానీ కొంతమందిలో తెలియకుండానే జెనెటిక్ రిస్క్ వల్ల అబ్‌నార్మల్ ఫీచర్స్ ఏర్పడతాయి. కొన్ని కేసెస్‌లో మూడవ నెల, అయిదవ నెల స్కానింగ్ ద్వారా కనిపెట్టవచ్చు. కొన్ని కేసెస్‌లో పుట్టిన తర్వాతే బిడ్డను డయాగ్నసిస్ చేయవచ్చు.
డా. భావన కాసు,
గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment