పెళ్లి, లగ్గం, వివాహం, కల్యాణం.. పేరేదైనా ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యే ఆడ, మగ కుటుంబ వ్యవస్థకు పునాదులవుతారు. మూడు ముళ్ల బంధంలో ఒదిగి ముచ్చటగా కాపు రం చేసి సమాజంలో ఓ భాగమవుతారు. బాధ్యతలను గుర్తుచేసి కుటుంబంలో తమ పాత్ర ఏమిటో తెలియజేసే వివాహ వ్యవస్థకు మన సమాజంలో ఎంతో ప్రాధాన్యం ఉంది.
మూడుముళ్ల బంధంతో ఒక్కటై బాధ్యతలు, బాంధవ్యాలు, కర్తవ్యాలను మనకు జ్ఞప్తికి తెచ్చే వివాహం ప్రతిఒక్కరి జీవితంలో కీలకమైన ఘట్టమే. స్త‍్రీ, పురుషులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టి, 'మాంగల్యం తంతునానేనా' అనే పురోహితుడి మంత్రోచ్ఛరణతో ఒక్కటయ్యే గొప్పదైన మన భారతీయ వివాహ వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది.
వివాహం భార్య, భర్తలను విడదీయలేని బంధంగా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవనం సాగిస్తే వందేళ్ల జీవితాన్ని సుఖసంతోషాలతో గడిపేయొచ్చు. మనస్పర్థలు, కోపతాపాలు, అనుమానాలు రేకెత్తకుండా చూసుకోవాలి. కోపతామాలతో నేనే గొప్ప అంటే నేనే గొప్ప అనే అహంకారం, చిన్న చిన్న కారణాలతో కాళ్లాపారణి ఆరకముందే విడాకులు తీసుకుంటున్న ఘటనలు నేటి సమాజంలో చోటుచేసుకుంటున్నాయి.
ఇలాంటి పరిణామాలు లేని స్వచ్ఛమైన ఆదర్శ దాంపత్యం సాగిపోవాలంటే ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమానురాగాలు పెంపొందించుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో జంటలు ఆదర్శనీయ జీవనం గడుపుతూ నేటి యువతకు స్ఫూర్తిదాతలుగా నిలుస్తున్నారు.
ఇవి చదవండి: 'మిలియనీర్లుగా బిచ్చగాళ్లు'..జస్ట్ 45 రోజుల్లో ఏకంగా రూ. 2.5 లక్షలు..!
Comments
Please login to add a commentAdd a comment