భారత్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పర్చడానికి విదేశీ విశ్వవిద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం తలుపులు తెరిచింది. ఈ క్యాంపస్‌ను ఏర్పర్చాలనుకునే విదేశీ విశ్వవిద్యాలయం గ్లోబల్ ర్యాకింగ్స్‌లో టాప్ – 500ల్లో ఉండాలి. స్పష్టంగా వీటిలోని కోర్సులను ప్రపంచస్థాయిలో పోటీపడే సిలబస్‌తో ఇంగ్లిష్‌లో నేర్పుతారు.
కేంద్రం ఇంగ్లిష్‌లో తమ ఇచ్ఛప్రకారం కోర్సులను బోధించే విశ్వవిద్యాలయాలను అనుమతించడం ఆశ్చర్యంగా లేదా? ఇదే ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థల్లో హిందీని బోధనా భాషగా చేయాలనీ, సిలబస్ భారతీయ సంçస్కృతిపై ఎక్కువగా ఆధారపడి ఉండాలనీ చెబుతూ వచ్చింది. ప్రశ్న ఏమిటంటే, భారతీయ విశ్వవిద్యాలయాల్లో హిందీలో చదివేవారు ఎవరు? విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లిష్‌లో అధ్యయనం చేసేది ఎవరు?
మన విద్యా వ్యవస్థ ద్వంద్వ ప్రమాణాల వల్ల దెబ్బతింటోంది. తీవ్ర జాతీయవాది సైతం తమ పిల్లలకు ఇంగ్లిష్, విదేశీ యూనివర్సిటీ విద్య నేర్పించడాన్నే ఇష్టపడుతున్నారు. మరోవైపు సంస్కృతి, వారసత్వం, మాతృభాష అంటూ రాగం ఎత్తుకుంటారు.
ఒక కుటుంబానికి డబ్బుంటే, వారి పిల్లలు ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్‌లో చదవడానికి భారీగా ఖర్చు చేస్తారు. విదేశీ యూనివర్సిటీల్లో చదవడానికి అమెరికా లేదా ఇంగ్లండ్‌కు పోతారు. కానీ స్వదేశంలో అత్యున్నత విజ్ఞానాన్ని మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు బోధించాలని వీరు కోరుకోవడం లేదు.
కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం భారత్‌లో తమ క్యాంప స్‌లను ఏర్పర్చడానికి విదేశీ విశ్వవిద్యాలయాలకు (యేల్, హార్వర్డ్, ప్రిన్్సటన్) తలుపులు తెరిచింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్‌పర్సన్ ఎం. జగదీశ్ కుమార్ జనవరి 5న నిర్వహించిన ఒక ప్రెస్ కాన్ఫరెన్ ్సలో ఈ ప్రకటన చేశారు.
మీడియా నివేదికల ప్రకారం, ‘భారత్‌లో తన క్యాంపస్‌ను ఏర్పర్చాలనుకునే విదేశీ విశ్వవిద్యా లయం గ్లోబల్ ర్యాకింగ్స్‌లో టాప్– 500ల్లో ఉండాలి.’ అంటే వివిధ దేశాలకు చెందిన అగ్రశ్రేణి యూనివర్సిటీలు భారత్ లోని కొత్త క్యాంపస్‌లపై దృష్టి సారిస్తాయని దీనర్థం. స్పష్టంగా వీటిలోని అన్ని కోర్సులను ప్రపంచస్థాయిలో పోటీపడే సిలబస్‌తో ఇంగ్లిష్‌లో నేర్పుతారు.
బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇంగ్లిష్‌లో తమ ఇచ్ఛప్రకారం కోర్సులను బోధించే విశ్వవిద్యాలయాలను అనుమతించడం ఆశ్చర్యం కలిగించడం లేదా? ఇదే ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థల్లో హిందీని బోధనా భాషగా చేయాలనీ, సిలబస్ భారతీయ సంస్కృతి, వార సత్వంపై ఎక్కువగా ఆధారపడి ఉండాలనీ పదే పదే చెబుతూ వచ్చింది.
యూనివర్సిటీ సిలబస్‌లో నిర్బంధంగా వేద, పురాణ అధ్యయనాలను చొప్పించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. వివాదా స్పదమైన ప్రశ్న ఏమిటంటే, భారతీయ విశ్వవిద్యాలయాల్లో హిందీలో చదివేవారు ఎవరు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లిష్‌లో అధ్యయనం చేసేది ఎవరు? విదేశీ విశ్వవిద్యాలయాలు వేద విజ్ఞానం, గణితం, మానవ శాస్త్రాలను ‘ప్రపంచ’ నాగరికతా ఆధారాలుగా హిందీలో బోధిస్తాయా?
‘భారతీయ క్యాంపస్‌లో విదేశీ విశ్వవిద్యాలయం అందించే విద్యా నాణ్యత, దాని సొంత దేశంలోని ప్రధాన క్యాంపస్‌లో అందించే విద్యానాణ్యతకు సమానంగా ఉంటుందని హమీ ఇవ్వాల్సి ఉంటుంది.
అలాగే భారతీయ క్యాంపస్‌లోని విద్యార్థులకు అందించే విద్యా పరమైన అవార్డులు సొంతదేశంలోని ప్రధాన క్యాంపస్‌లోని ఉన్నత విద్యాసంస్థలు అందించే విద్యాపరమైన అవార్డులకు సరిసమానంగా ఉండటమే కాకుండా ఆ మేరకు తగిన గుర్తింపును కూడా ఇవ్వాల్సి ఉంటుంది’ అని యూజీసీ చైర్‌పర్సన్ జగదీశ్ కుమార్ పేర్కొన్నారు.
భారత్‌లో విదేశీ విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి గురించి కూడా ఆయన నొక్కి చెప్పారు. క్యాంపస్‌లో విద్యా కార్యక్రమాలు, మౌలిక వసతుల విషయంలో తప్ప, నిర్వహణాత్మక అంశంలో యూజీసీ నుంచి ఎలాంటి జోక్యం ఉండబోదని అన్నారు.
జాతీయ విద్య వర్సెస్ గ్లోబల్ విద్యతో దేశాన్ని కుల, వర్గ ప్రాతిపదికన మరింతగా విభజించాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటున్నట్లయితే, భారతీయ యూనివర్సిటీలలో విద్యా నాణ్యత, పట్టభద్రుల ఉపాధి విషయం ఏమిటి? ఇదే జరిగితే, భారత్ మరోసారి తన అంధకార గతం వైపు వెళ్లిపోతుంది. శూద్రులు, ఇతర వెనుక బడిన వర్గాలు (ఓబీసీలు), దళితులు, ఆదివాసీలు ఆధునిక విద్యాసంస్థల్లో ప్రవేశం పొందలేరు. రిజర్వేషన్ ప్రయోజనాలు ఇకపై శూన్య మైపోతాయి.
ఉత్పాదక వర్గాల పిల్లలకు కేంద్ర ప్రభుత్వం విద్యా భారతిని చూపిస్తుంది. ఇది ఆరెస్సెస్ నిర్వహించే పాఠశాలల నెట్‌వర్క్. ఇలాంటి విద్యా నమూనా ద్వారా ఘనమైన ప్రాచీన నాగరికతను భారతీయులు అనుసరించాలని ఆరెస్సెస్, బీజేపీ కోరుకుంటున్నాయి. అదే సమయంలో ఆధునిక ఉత్పత్తి, ఆధునిక విజ్ఞానశాస్త్రం, వనరుల పంపిణీ, సమానత్వం వంటివాటిని భార తీయేతరమైనవిగా ఇవి చూస్తున్నాయి. వర్ణవ్యవస్థ కేంద్రకంగా ఉన్న మానవ సంబంధాలు, ఆశ్రమాల్లో నివసించడమే సమాజ ఆద ర్శాలుగా మారిపోతాయి.
అదే సమయంలో విదేశీ, భారతీయ ప్రైవేట్ పాఠశాలలు, యూనివర్సిటీలు దేశంలోని కులీన వర్గాల, పాలక వర్గాల పిల్లలకు హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్, యేల్ యూనివర్సిటీల సిలబస్‌తో ఇంగ్లిష్‌లో బోధనను అందిస్తాయి. దీనివల్ల వీరు పాశ్చాత్య దేశాలతో వాటికి వెలుపలి ప్రపంచంతో కూడా కనెక్ట్ అవుతారు. వీరే నిజమైన విశ్వగురువులుగా లేదా ప్రపంచ నేతలుగా మారతారు.
ఈ రకమైన విభజన వల్ల మన దేశంలోని సెక్యులర్, లిబరల్ ద్విజులు పెద్దగా కోల్పోయేది ఏమీ ఉండదు. తమ పిల్లలకు హిందీ మీడియం విద్యా భారతి సిలబస్‌ను నేర్పరని వీరందరికీ స్పష్టంగా తెలుసు. బోధనా పద్ధతులపై, బోధనా శాస్త్రంపై వీరి విమర్శ అటు భాష, ఇటు విషయంపై అస్పష్టతతోనే ఉంటుంది. కానీ వీరు సమా నతా విద్య గురించి వల్లిస్తుంటారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యావేత్తలు ఈ విద్యా నమూనాతో పోరాడరు. గతంలో పేలవమైన విద్యా విధానాలను రూపొందించింది వీరే మరి. దీనివల్లే శూద్రులు, ఓబీసీలు, దళితలు, ఆదివాసుల్లో ఇంగ్లిష్ విద్య పొందిన మేధావులు అతి కొద్ది సంఖ్యలో మాత్రమే ఉండిపోయారు. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ మేధావుల విషయానికి వస్తే ఈ విధమైన విద్యాపరమైన విభజన వారికి పెద్ద సమస్య కాదు.
ఎందుకంటే పలువురు ముస్లిం విద్యార్థులు మదరసాల్లో, క్రిస్టియన్ విద్యార్థులు మిషనరీ స్కూల్స్‌లో చదువుకుంటూ ఉంటారు. మదర సాలు, క్రిస్టియన్ స్కూళ్లు అంతరిస్తున్నాయనుకోండి! మరోవైపున విద్యావకాశాలకు దూరమైన శూద్రులు, ఓబీసీలు కూడా ఈ సమ స్యను పెద్దగా పట్టించుకోవడం లేదు.
హిందూ సామ్రాట్ గుర్తింపుతో మొట్టమొదటి బీసీ ప్రధానిగా చెప్పుకొంటున్న నరేంద్ర మోదీ తమను చారిత్రక బానిసత్వం నుంచి బయటపడేస్తారని వీరిలో చాలామంది భావిస్తున్నారు. భారతీయ ప్రాంతీయ పార్టీలు కూడా ప్రజారాసులకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందించడాన్ని సీరియస్‌గా తీసుకోలేదు.
ఎందుకంటే అది వారి సొంత భాషా దురహంకారానికి వ్యతిరేక మవుతుంది. ఇక ఓబీసీ, దళిత సంస్థల విషయానికి వస్తే విద్యా నాణ్యత కంటే రిజర్వేషన్ లో తమ వాటా గురించే ఆందోళన చెందుతున్నాయి.
నిరంకుశమైన 2020 వ్యవసాయ సంస్కరణ చట్టాలను ఉపసంహరించుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా వ్యవసాయ ప్రజా బాహుళ్యం చిన్న విజయం సాధించగలిగింది. కానీ ఆరెస్సెస్, బీజేపీ విద్యా కుట్రతో తమ పిల్లలు మరింత ప్రమాదంలో పడనున్నారని వీరు గుర్తించడం లేదు.
ప్రజారాసుల పిల్లలను చేర్చు కుంటామని హామీ ఇవ్వకుండానే అనేక విదేశీ విశ్వవిద్యాలయాలు చాలావరకు ప్రజల భూములను కొనివేయబోతున్నాయి. రైతుల పిల్లల విద్యాపరమైన శక్తిసామర్థ్యాన్ని విచ్చిన్నపర్చడానికి పాలక వర్గాలు పథకం వేస్తున్నాయి.
ఈ విధానాల ద్వారా వీరి భవిష్యత్తు అంధకారం కానుంది. ప్రభుత్వ రంగంలో మాత్రమే ఉంటున్న రిజ ర్వేషన్లు పొందుతున్నవారేమో ఒకసారి ప్రైవేటీకరణ పూర్తి శక్తితో ముందుకొచ్చాక న్యూనతతో బాధపడక తప్పదు.
ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment