సాక్షి ప్రతినిధి, గుంటూరు: చంద్రబాబు నాయుడి అరెస్టు నేపథ్యంలో సానుభూతి కోసం తెలుగుదేశం నాయకులు ఎంతటి అడ్డదారులు తొక్కడానికై నా సిద్ధం అయ్యారు. ఒకరోజు ముందు అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తిని కూడా చంద్రబాబునాయుడి అరెస్టు నేపథ్యంలో చనిపోయినట్లు చిత్రీకరించారు. ఇంకేముంది అవకాశం కోసం ఎదురుచూస్తున్న పచ్చపత్రిక ఈనాడు దానిని తన ఇంటర్‌నెట్ ఎడిషన్‌లో పోస్టు చేసింది.
ఆ వార్త సారాంశం ...
‘ చంద్రబాబు అక్రమ అరెస్టు వార్త వినగానే గుంటూరు రూరల్ మండలంలోని బుడంపాడు గ్రామ బీసీ నాయకుడు శివయ్య యాదవ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన భౌతిక కాయానికి గుంటూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి కల్లూరి శ్రీనివాస్, పార్టీ నేతలు ఇమ్మడి లీలా మల్లేశ్వరరావు, రమేష్, యాదాల గణేష్, పెండ్యాల శ్రీధర్‌బాబు తదితరులు శివయ్య భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.’
వాస్తవం...
గుంటూరు రూరల్ మండలం బుడంపాడుకు చెందిన మైలా శివయ్య యాదవ్(65) శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో గుండె నొప్పిగా ఉందని తన కుమారులకు చెప్పాడు. దీంతో వారు శివయ్యను చికిత్స కోసం గుంటూరు ఆసుపత్రికి తరలిస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో గ్రామ శివార్లలో మృతి చెందాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారు రాత్రికి రాత్రే తమ తండ్రి మృతిపై శుక్రవారం 08–09–2023న మృతి చెందినట్లుగా ఫ్లెక్సీలు వేసి గ్రామం అంతా కట్టారు. శనివారం ఉదయం 11.30 గంటలకు అంత్యక్రియలు జరిగాయి. అయితే శనివారం చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక శివయ్య మృతి చెందాడంటూ తెలుగుదేశం నేతలు ప్రచారం మొదలు పెట్టారు. దీనికి ఈనాడు వంతపాడింది.
Comments
Please login to add a commentAdd a comment