చిందర వందర!
గుంటూరు
శుక్రవారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 2025
పది చదువులు
వంద రోజుల కార్యాచరణ అస్తవ్యస్తం
విగ్రహాలకు ముసుగులు
నరసరావుపేటఈస్ట్: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో పట్టణంలోని రాజకీయపార్టీల నాయకుల విగ్రహాలకు మున్సిపల్ సిబ్బంది ముసుగులు తొడుగుతున్నారు.
వాల్‌పోస్టర్స్ ఆవిష్కరణ
బాపట్ల : స్పర్శ కుష్ఠు నివారణ పక్షోత్సవాల సందర్భంగా గురువారం వాల్‌పోస్టర్స్‌ను కలెక్టర్ జె.వెంకట మురళి ఆవిష్కరించారు. ఫిబ్రవరి 13 వరకు సర్వే కొనసాగుతుందని తెలిపారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 552.80 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 9,700 క్యూసెక్కులు విడుదలవుతోంది.
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో టెన్త్ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పది ఫలితాల్లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా చేపట్టిన వంద రోజుల ప్రణాళిక విధానం అస్తవ్యస్తంగా మారింది. మార్చి 17 నుంచి పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో జెడ్పీ నుంచి ఇవ్వాల్సిన స్టడీ మెటీరియల్ ఇప్పటికీ విద్యార్థుల చేతుల్లోకి రాకపోవడంతో విద్యార్థుల సన్నద్ధత ప్రశ్నార్థకంగా ఉంది. ఇదిగో ఇస్తాం.. అదిగో ఇస్తామంటూ జెడ్పీ పాలకవర్గం ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులు రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను విద్యాశాఖాధికారులు గతేడాది నవంబర్ 2నే జెడ్పీ పాలకవర్గానికి అందజేసినా జనవరి నెలాఖరుకూ అది పంపిణీకి నోచుకోలేదు.
ఎస్సీఈఆర్టీ మోడల్ పేపర్లే దిక్కు
మార్చి 17 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనుండటం, జెడ్పీ నుంచి స్టడీ మెటీరియల్ అందకపోవడంతో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) సిద్ధం చేసిన మోడల్ పేపర్లే దిక్కయ్యాయి. దీంతోపాటు విద్యాశాఖ ఇచ్చిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కూడా సరిగా అమలు కావడం లేదు. ఫలితంగా నూరు శాతం ఉత్తీర్ణత సాధన దిశగా విద్యార్థులను సన్నద్ధం చేయడం పెను సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ మోడల్ పేపర్లను పలువురు హెచ్‌ఎంలు పుస్తక రూపంలో ముద్రించారు. వీటితోపాటు అవే పేపర్లను జిరాక్స్‌లు తీయించి పాఠశాలల్లో విద్యార్థులతో చదివిస్తున్నారు. జెడ్పీ నుంచి స్టడీ మెటీరియల్‌కే దిక్కు లేని పరిస్థితుల్లో అల్పాహారం అందించడం మిథ్యగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా సొంత ఖర్చు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో విద్యార్థులకు అల్పాహారాన్ని అందిస్తున్నారు.
మోకాలడ్డుతున్న ముఖ్య అధికారి!
టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేతకు జెడ్పీ పాలకవర్గం మూడు నెలల ముందే అమోదించినా.. జెడ్పీలోని ఓ ముఖ్య అధికారి నిర్లక్ష్యం వల్లే స్టడీ మెటీరియల్ ముద్రణ, పంపిణీకి నోచుకోలేదని పాలకవర్గం చెబుతోంది. రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన డీఆర్సీ సమావేశంలోనూ ప్రజాప్రతినిధులు స్టడీ మెటీరియల్, అల్పాహారంపై ప్రశ్నలు సంధించినా జెడ్పీ ఉన్నతాధికారిలో చలనం లేకుండా పోయింది. తమ ఆధిపత్యం కోసం 35 వేల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
7
న్యూస్‌రీల్
నూరుశాతం ఉత్తీర్ణత సాధ్యమేనా!
స్టడీ మెటీరియల్ ఏదీ?
అల్పాహారం ఎక్కడ?
ప్రభుత్వ హైస్కూళ్లలో టెన్త్ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరం
వైఎస్సార్ సీపీ పాలనలో రెండేళ్లపాటు డిసెంబర్ కల్లా స్టడీమెటీరియల్
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వరుసగా రెండేళ్లు ‘‘జగనన్న విద్యాజ్యోతి’’ పేరుతో స్టడీ మెటీరియల్ రూపొందించి సకాలంలో పంపిణీ చేసిన జెడ్పీ పాలకవర్గం ప్రస్తుతం చతికిలబడింది. 2022 నవంబరులో రూ.61.80 లక్షల జెడ్పీ నిధులతో రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా 36,155 మంది విద్యార్థులకు విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. తరువాత 2023లో రూ.70 లక్షల వ్యయంతో 39వేల మంది విద్యార్థులకు అందజేశారు. తాజాగా ప్రస్తుతం మూడు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి పరీక్షలకు సన్నద్ధమవుతున్న 35 వేల మంది విద్యార్థులకు రూ.70 లక్షల ఖర్చుతో స్టడీ మెటీరియల్ పంపిణీకి గత జెడ్పీ సర్వసభ్య సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నా.. ఆచరణలోకి రాలేదు.
గత ప్రభుత్వంలో
రెండేళ్లపాటు నిరాటంకంగా..
Comments
Please login to add a commentAdd a comment