పకడ్బందీగా అమలు చేయాలి
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కృష్ణ, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలికి సంబంధించి ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను ప్రకటించినందున ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చిందని, దీనిని పకడ్బందీగా అమలు చేయాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరంలో వెబ్ ఎక్స్ ద్వారా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల అధికారులతో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి జేసీ భార్గవ్‌తేజతో కలిసి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 29వ తేదీ నుంచే కోడ్ అమల్లోకి వచ్చిందని వివరించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు.
ఓటరు నమోదుకు నేడు తుది గడువు
గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదుకు జనవరి 31 వ తేది వరకు అవకాశం ఉందని కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. ఫిబ్రవరి 10 వ తేది లోపు వాటిని పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులూ ఉండేలా చూడాలన్నారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహించి జనవరి 31 శుక్రవారం సాయంత్రంలోపల వివరాలు పంపాలని ఆదేశించారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగనున్న దృష్ట్యా బ్యాలెట్ బాక్సుల లభ్యత గురించి నివేదిక పంపాలని సూచించారు.
కలెక్టర్ నాగలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment