బాటలపై బూటకం | - | Sakshi
Sakshi News home page

బాటలపై బూటకం

Published Fri, Jan 31 2025 2:15 AM | Last Updated on Fri, Jan 31 2025 2:15 AM

బాటలప

బాటలపై బూటకం

● సంక్రాంతి వచ్చింది.. వెళ్లింది.. ● అమలుకు నోచని సీఎం ఆదేశాలు ● బాగుపడని ప్రధాన రహదారులు ● ప్రమాదాలు యథాతథం.. ● ప్రాణాలతో చెలగాటం

తెనాలి: తెనాలి–గుంటూరు వయా నారాకోడూరు రోడ్డు ... ఈ రహదారిలో రూరల్‌ మండల గ్రామాలైన అంగలకుదురు–సంగంజాగర్లమూడి మధ్యలో రోడ్డు దెబ్బతిని చాలాకాలమైంది. గత సీజనులో కురిసిన వర్షాలకు మరింత దారుణంగా తయారైంది. దీంతో ఆ రెండు గ్రామాల మధ్య దాదాపు రెండున్నర కిలోమీటర్ల ప్రయాణం దుర్భరంగా ఉందని వాహనచోదకులు వాపోతున్నారు. ద్విచక్ర వాహనాలు స్లిప్పయి పడిపోయిన ఘటనలున్నాయి. సోమవారం రాత్రి గుంటూరు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువతులను తెనాలి వైపు నుంచి వెళుతున్న మరో వాహనం ఇదే రోడ్డులో ఢీకొంది. కిందపడి పోయిన ఇద్దరు యువతుల్లో ఒకరికి తీవ్ర గాయాలుకాగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.అయితే రోడ్డుపై గతుకుల్లో వాహనం నడుపుతూ గోతిని తప్పించే యత్నంలో తన వాహనం ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిందని ఆ యువకుడు చెప్పినట్టు సమాచారం. రోడ్డు మరమ్మతులు జరిగి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదనేది సుస్పష్టం. కొల్లిపర మండలం హనుమాన్‌పాలెం–గుంటూరు వయా నందివెలుగు రోడ్డు మరో ఉదాహరణ. ఆ రోడ్డులో కొల్లిపర మండల గ్రామం దావులూరు అడ్డరోడ్డు నుంచి చివలూరు వరకు రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. రోజువారీ ట్రాఫిక్‌ రద్దీతోపాటు కృష్ణాతీరం నుంచి ఇసుకతో వచ్చే భారీ వాహనాల రాకపోకలు ఇక్కడ రోడ్డు ఉసురును రోజురోజుకీ తీసేస్తున్నాయి. దావులూరు నుంచి శివలూరు వరకు రోడ్డు దారుణంగా దెబ్బతింది. భారీ వాహనాలు ఆ గోతుల్లోనూ ఊయల లూగుతూ వెళుతుంటే, ద్విచక్ర వాహనదారులు గతుకుల మధ్యలోనో, సైడులోనే రిబ్బనులా ఉండే తారురోడ్డులో అతి కష్టంమీద ప్రయాణిస్తున్నారు. ఏమాత్రం బ్యాలెన్స్‌ తప్పినా ప్రమాదం అనివార్యమని తెలిసిందే ఈ రోడ్డును కూడా ఇప్పటివరకు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. సాక్షాత్తూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే దుర్భరంగా తయారైన ఎంతో ప్రధానమైన రోడ్డు మరమ్మతులను పట్టించుకోకపోవటం విమర్శలకు గురవుతోంది.

దావులూరు– శివలూరు మధ్య రోడ్డులో ప్రమాదకర గుంత

కొల్లిపర మండల గ్రామం దావులూరు అడ్డరోడ్డు వద్ద ఇలా..

‘నగరాల్లో ఉంటున్నవారు...ఎన్నారైలు సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వచ్చే నాటికి రోడ్లన్నీ కళకళలాడాలి.. మన ఊరి రోడ్లు బాగుపడ్డాయని అందరూ సంతోషించాలి.. ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందేశం.. సంక్రాంతి వచ్చింది.. అంతా సొంతూళ్లకు వచ్చారు.. వెళ్లారు..! రోడ్లు మాత్రం కనీస మరమ్మతులకు నోచుకోలేదు. కనీసం ప్రధాన రహదారుల బాగుసేతపైనా సంబంధిత శాఖలు దృష్టి పెట్టనేలేదు. ఫలితంగా ఆ రోడ్లలో ప్రయాణం వాహనచోదకులకు నిత్యం నరకాన్ని తలపిస్తోంది. ప్రమాదాలు జరుగుతూ ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
బాటలపై బూటకం 1
1/3

బాటలపై బూటకం

బాటలపై బూటకం 2
2/3

బాటలపై బూటకం

బాటలపై బూటకం 3
3/3

బాటలపై బూటకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement