విద్యా బోధన.. సాగు ఒకటే !
ఏఎన్‌యూ: విద్యా బోధన, సాగు ఒకటేనని, అధ్యాపకులు నిత్య విద్యార్థులుగా ఉండాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కె. గంగాధర రావు అన్నారు. బోధనలో అధునాతన పద్ధతులను అందిపుచ్చుకుని విద్యార్థులు మెరుగైన జ్ఞానాన్ని అందించాలని ఆయన సూచించారు. విశ్వవిద్యాలయంలోని విద్యా విభాగంలో రెండు రోజులపాటు జరుగుతున్న జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెక్టార్ ఆచార్య కె. రత్న షీలామణి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. వీసీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలోని విద్యావేత్తలను ఆచార్య పి. బ్రహ్మాజీరావు ఉపన్యాసకులుగా ఆహ్వానించడంపై హర్షం వ్యక్తం చేశారు. సదస్సుకు ఆర్ట్స్, కామర్స్ లా కళాశాల ఆచార్యులు ఎం. సురేష్ కుమార్ అధ్యక్షత వహించారు. రెక్టార్ ఆచార్య కె. రత్నషీలామణి మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా బోధన విధానాలను రూపొందించుకోవాలని, వృత్తిపరమైన కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. విద్యా విభాగ పీఠాధిపతి ఆచార్య ఎం. వనజ విద్యా విధానంలో వివిధ దశలను గురించి వివరించారు. అమర్ కంటక్‌కు చెందిన ఆచార్య ఎం.టి.వి నాగరాజు, ఒరిస్సాలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు ఈ.అశోక్ కుమార్, జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఆచార్య వంగూరి రవి, కేరళ లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చెందిన ఆచార్య ఇస్మాయిల్ తమ్మరేసరి, మధ్యప్రదేశ్ లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య పుచ్చ చిట్టిబాబు, ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ఆచార్య టి. షరోన్ రాజు, బిహార్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య పి. ఆడమ్ పాల్, ఇగ్నో డెప్యూటీ డైరెక్టర్ ఆచార్య కె. సుమలత,సెంట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ చైర్మన్ డాక్టర్ సూరజ్ మోహన్, ఆర్‌వీఆర్‌ఆర్ కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ సీనియర్ ఆచార్యులు గద్దె మంగయ్య ఉపన్యసించారు. విద్యా విభాగంపై డాక్టర్ టి. సందీప్ రచించిన పుస్తకావిష్కరణ చేశారు. ఈ సదస్సుకు డాక్టర్ ఎం. వసంతరావు, డాక్టర్ ఆర్. శివరామిరెడ్డి, కన్వీనర్లుగా వ్యవహరించారు.
వీసీ ఆచార్య కె.గంగాధరరావు అధ్యాపకులు నిత్య విద్యార్థులుగా ఉండాలి
Comments
Please login to add a commentAdd a comment