క్రీడా ‘చంద్రిక’
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా కుమిలిపోలేదు ఆమె. తాతమ్మ దగ్గర ఉంటూనే పవర్ లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుని సత్తాచాటుతున్నారు. ఆదర్శంగా నిలుస్తున్నారు. మంగళగిరికి చెందిన ఆమె పేరు బొల్లినేని చంద్రిక. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బంగారు, రజిత, కాంస్య పతకాలను ఆమె సాధించారు. కామన్వెల్త్‌లో నాలుగు బంగారు పతకాలు, ఏషియన్ చాంపియన్ షిప్‌లో మూడు బ్రాంజ్ మెడల్స్, ఏషియన్ పసిఫిక్‌లో నాలుగు గోల్డ్ మెడల్స్, సుబ్రత ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్‌లో నాలుగు గోల్డ్ మెడల్స్, స్ట్రాంగెస్ట్ విమెన్ ఇన్ సౌత్ ఇండియా సీనియర్ కేటగిరిలో పతకం సాఽధించారు. ఫెడరేషన్ పవర్‌లిఫ్టింగ్ గేమ్స్ స్టేట్ చాంపియన్‌గా 15 ఏళ్లుగా నిలుస్తున్నారు.
అంతర్జాతీయ
పవర్ లిఫ్టర్ చంద్రిక
క్రీడా ‘చంద్రిక’
Comments
Please login to add a commentAdd a comment