కలెక్టర్ నాగలక్ష్మి
గుంటూరు వెస్ట్: పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన భూములను గుర్తించాలన్నారు. మంగళగిరి మండలంలో గోల్డ్ స్మిత్, హ్యాండ్‌లూమ్ క్లస్టర్ల ఏర్పాటును వేగవంతం చేయాలని సూచించారు. పీఎం విశ్వకర్మ యోజన దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ సబ్సిడీ కోసం నిర్ణీత సమయంలో ధ్రువపత్రాలు అందజేయని ఎంఎస్‌ఎంఈ దరఖాస్తుదారులకు మరోసారి గుర్తు చేయాలన్నారు. జిల్లాలోని 49 ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీ, రీఎంబర్స్‌మెంట్ ఆఫ్ ఇంట్రస్ట్ సబ్సిడీ, కాస్ట్ సబ్సిడీకి సంబంధించి రూ.2,12,79,045 మంజూరు చేస్తూ కమిటీ ఆమోదించిందని కలెక్టర్ వివరించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, జిల్లా ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి, కమర్షియల్ టాక్స్ డీసీబీహెచ్ మనోరమ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment