
గుంటూరు
ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025
నేడే ఆంజనేయస్వామి తిరునాళ్ల
రొంపిచర్ల: మండలంలోని గోగులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సువర్చలా సమేత అభయాంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు
చేశారు.
రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు
పెదపులివర్రు(భట్టిప్రోలు): పెదపులివర్రు గ్రామంలో కొలువైన శ్రీ భూనీళా సమేత వరదరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.
ప్రసన్నాంజనేయస్వామి జయంతి
రాజుపాలెం: మండలంలోని ఆకుల గణపవరంలో ప్రసన్నాంజనేయస్వామి జయంతి మహోత్సవం సందర్భంగా శనివారం లక్ష తమలపాకుల పూజ చేశారు.
ఇఫ్తార్ సహర్
(ఆది) (సోమ)
గుంటూరు 6.22 5.04
నరసరావుపేట 6.24 5.06
బాపట్ల 6.22 5.04
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు అందడం లేదు. ఫలితంగా రబీ సాగుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో 1,59,275 ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న సాగు జరుగుతోంది. పలుచోట్ల కూరగాయలు, అరటి కూడా సాగు చేస్తున్నారు. పది రోజులుగా నీటి విడుదల పూర్తిగా తగ్గిపోవడంతో పంటలు ఎండుతున్నాయి. మరోవైపు ఎన్నడూ లేనివిధంగా ఫిబ్రవరి చివరి నుంచే ఎండలు మండిపోతుండటంతో నీటి అవసరం పెరిగింది. అయితే అదే సమయంలో ప్రకాశం బ్యారేజి నుంచి నీటి విడుదల తగ్గింది. పశ్చిమ డెల్టాకు వెయ్యి క్యూసెక్కులు, గుంటూరు చానల్‌కు 200 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు. నీటి విడుదల తగ్గిపోవడంతో రైతులు ఆయిల్ ఇంజిన్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఇంకో తడికి నీరు అందించాలని లేకపోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు.
అధికారుల ప్రణాళిక లోపం!
ఖరీఫ్‌లో తుఫాన్లు, భారీ వర్షాలకు పంట దెబ్బతింది. మరోవైపు రంగుమారిన, తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం, గిట్టుబాట ధర లేకపోవడంతో ఇప్పటికే డెల్టా రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంది. ఈ సమయంలో రబీకి కూడా నీటి కష్టాలు ఎదురవుతుండటం వారిని కలవరపరుస్తోంది. అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురైంది. డెల్టా పరిధిలో తాగు, సాగునీటి అవసరాలకు ఇప్పటి వరకూ 67,92 క్యూసెక్కుల నీటిని వినియోగించారు. వచ్చే నెలాఖరు వరకూ డెల్టాకు 2.29 టీఎంసీ, గుంటూరు ఛానల్‌కు 0.21 టీఎంసీ మాత్రమే వాడుకునే అవకాశం ఉందని జలవనరుల శాఖ ఇంజనీర్లు చెబుతున్నారు. పులిచింతలలో ఉన్న నీటిని ఇప్పుడు వాడేస్తే భవిష్యత్‌లో తాగు, సాగునీటి సమస్యలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఎండిపోతున్న పంటల సంగతేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
7
న్యూస్‌రీల్
పలు మండలాల్లో తీవ్రంగా..
పశ్చిమ డెల్టాకు నీటి కష్టాలు
ఎండుతున్న పంటలు
పట్టించుకోని అధికారులు
కాల్వలకు చేరని సాగునీరు
ఆయిల్ ఇంజిన్లతో
తోడుకుంటున్న రైతులు
ఎకరానికి రూ.నాలుగైదు వేల
అదనపు ఖర్చు
నీటి విడుదల పెంచాలని
రైతుల డిమాండ్
దుగ్గిరాల, పొన్నూరు, వేమూరు, అమర్తలూరు, రేపల్లె మండలాల్లోని పలు గ్రామాల్లో సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నీటివిడుదల తగ్గిపోవడంతో పంట కాల్వల్లో నీటి మట్టాలు బాగా పడిపోయాయి. దీంతో పొలాల్లోకి నీరు రావాలంటే ఆయిల్ ఇంజన్లు పెట్టి తోడుకోవాల్సి వస్తోంది. దీనివల్ల ఎకరానికి రూ.నాలుగు వేల నుంచి రూ.ఐదు వేల రూపాయలు అదనంగా ఖర్చు అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో నంబర్ బ్రాంచ్ కెనాల్‌కు నాలుగు నెలల నుంచి నీరు ఇవ్వడం లేదని ఈమని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ కాలువ పరిధిలో ఈమని, చింతలపూడి, కుంచారం, అత్తొట గ్రామాల్లో వెయ్యి ఎకరాలకుపైగా సాగు ఉంది.

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment