15 నుంచి ‘తిరుమల మహా పాదయాత్ర’
తెనాలి: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీవాసవీ పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామి) ఈ నెల 15వ తేదీ నుంచి ‘తిరుమల మహా పాదయాత్ర’ చేపట్టనున్నారు. రైతు క్షేమార్థం, ధర్మసంస్థాపనార్థం చేపట్టనున్న తిరుమల మహాపాదయాత్రను భక్తజన సమూహంగా ఆరంభించనున్నారు. దీనికి ముందుగా తెనాలిలో ‘గురు పాదధూళి’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఆరు గంటలకు స్థానిక గంగానమ్మపేటలోని శ్రీవిద్యాపీఠం శ్రీసాలిగ్రామ పీఠం నుంచి బయలుదేరి బుర్రిపాలెం రోడ్డులోని గోశాల వరకు పాదయాత్ర చేశారు. తిరుమల మహా పాదయాత్ర రోజు వరకు రోజూ గురు పాదధూళి పాదయాత్ర ఉంటుందని, భక్తులు పాల్గొనాలని కోరారు. శ్రీసాలిగ్రామ పీఠం కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి
Comments
Please login to add a commentAdd a comment