ఇంటర్ పరీక్షల్లో 480 మంది గైర్హాజరు
విద్యారణ్యపురి: ఇంటర్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. హనుమకొండ జిల్లాలో 55 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల రాకతో సందడిగా మారాయి. సెకండియర్ జనరల్ విభాగంలో 18,100 మంది విద్యార్థులకుగాను 17,659 మంది విద్యార్థులు హాజరుకాగా.. అందులో 441 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 869 మందికి గాను 830 మంది హాజరు కాగా.. వారిలో 39 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. మొత్తం 480 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కాగా.. హనుమకొండలోని వడ్డేపల్లి ప్రభుత్వ పింగిళి బాలికల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని, ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని, రెజోనెన్స్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి తనిఖీ చేశారు.
వరంగల్ జిల్లాలో..
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురువారం 26 కేంద్రాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. మొదటి రోజు 4,838 మంది జనరల్ విద్యార్థులకు 4,718 మంది హాజరు కాగా.. 120 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 668 మంది ఒకేషనల్ విద్యార్థులకు 635 మంది హాజరుకాగా.. 33 మంది గైర్హాజరయ్యారని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment