హన్మకొండ కల్చరల్: ఈనెల 22న పేరిణి నృత్య విశారద పరీక్షలు 2024–25 నిర్వహించనున్నట్లు నటరాజ కళాకృష్ణ నృత్య జ్యోతి అకాడమీ నిర్వాహకులు ప్రముఖ పేరిణి నాట్య ఆచార్యులు గజ్జెల రంజిత్ కుమార్ తెలిపారు. ఈమేరకు గురువారం నృత్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్‌ను నాగార్జున స్కూల్ అధినేత ఆడెపు వెంకటేశ్వర్లుతో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా రంజిత్ మాట్లాడుతూ.. వరంగల్ పేరిణి నృత్యాలయంలో 22న శనివారం థియరీ, 23న ఆదివారం ప్రాయోగికం పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా అకాడమీలో 2023–24 సంవత్సరం పేరిణి నాట్యంలో ప్రత్యేక శిక్షణ పొందిన తొమ్మిది మంది యువ నాట్య ఆచార్యులను ప్రోత్సహించేందుకు రూ.1.50 లక్షలను చెక్కుల రూపంలో అందజేశారు. కార్యక్రమంలో సీహెచ్ నర్సంగరావు, సీహెచ్ లత, చాతరాజు నవ్యజ, పల్పాటి శ్రీజ, బండారు వైష్ణవి, తేజస్విని, మర్కాల లోహిత్, గురుదేవ్, సంతోశ్, రేగుల చందు, సాయికపిల్, తేజ పాల్గొన్నారు.
తక్కువ ధరకే
వ్యాక్సిన్లు తయారు చేయాలి
కేయూ క్యాంపస్: వాక్సిన్ల తయారీలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ ఎదిగిందని.. తక్కువ ధరకే వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా కృషి చేయాలని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో జువాలజీ విభాగంలో గత రెండ్రోజులుగా ‘యూసెస్ రీకాంబినెంట్ డీఎన్‌ఏ టెక్నాలజీస్ ఇన్‌హెల్త్ కేర్’ అంశంపై నిర్వహిస్తున్న సదస్సు గురువారం సాయంత్రం ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment