రాములోరికి ‘గోటి తలంబ్రాలు’ | - | Sakshi
Sakshi News home page

రాములోరికి ‘గోటి తలంబ్రాలు’

Published Fri, Mar 7 2025 8:56 AM | Last Updated on Fri, Mar 7 2025 8:57 AM

రాముల

రాములోరికి ‘గోటి తలంబ్రాలు’

హన్మకొండ కల్చరల్‌ : రాములోరి కల్యాణం.. కమనీయం.. రమణీయం..చూసిన కనులదే భాగ్యం.. భద్రాద్రిలో జరిగే వేడుకను తిలకించి..తరించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. వీరిలో ఓరుగల్లు మహిళలు పరిణయ వేడుకకు తలంబ్రాలను సిద్ధం చేయడానికి వరిగింజలను గోటితో ఒలిచి తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు.

గోటి తలంబ్రాలు..

శ్రీరామ నవమి రోజు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలకు ప్రత్యేకత ఉంది. వడ్ల గింజలను రోలులో దంచడంగాని లేక మిల్లులో మరపట్టించినవి కావు.. మహిళలు చేతిగోళ్లతో ఒక్కొక్క ధాన్యపు గింజను వలచిన బియ్యం. వీటినే గోటి తలంబ్రాలు అంటారు.

ఎంతో పవిత్రంగా..

శ్రీరామనామ స్మరణతో ఎంతో పవిత్రంగా గోటితో తలంబ్రాలు ఒలుస్తారు. ఈ తలంబ్రాల కోసం విత్తనాల వడ్లను ప్రత్యేకంగా సాగు చేస్తారు. శ్రీరాముడి కల్యాణ తంతు జరుగుతున్నప్పుడు తలంబ్రాలతో పాటు సాగుచేయడానికి కావలసిన వడ్లను కూడా స్వామివారి పాదాల వద్ద పెడతారు. ఆ వడ్లనే తిరిగి సాగుచేయడానికి వాడుతారు. వీటిని కొందరు భక్తిభావంతో తమ పొలంలో కొంత భూమిని కేటాయించి సాగు చేస్తుంటారు. ప్రత్యేక ముడుపులుగా చేసి మందులు, ఎరుపులు వేయకుండా, కాళ్లతో తొక్కకుండా, పవిత్రంగా పండిస్తున్నారు. పంటపొలాల్లో కంకులను కూడా కత్తులతో కాకుండా శ్రీరామనామం జపిస్తూ చేతిలో వలుస్తారు.

కొరియర్‌ ద్వారా..

వరి ధాన్యాన్ని తలంబ్రాలుగా ఒలిచేందుకు భద్రాచలం నుంచి శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ప్రతినిధులు కొరియర్‌ ద్వారా పంపగా వరంగల్‌ బ్యాంక్‌కాలనీలోని ఏలిషాల సుజాత అందుకున్నారు. ఈ ధాన్యాన్ని కాలనీ మహిళలు నిత్యం నిష్టతో ఉండి భక్తిశ్రద్ధలతో శ్రీరామ కీర్తనలు ఆలపిస్తూ, శ్రీరామ స్మరణ చేస్తూ గోటితో ఒలిచి.. తలంబ్రాలుగా తయారు చేస్తున్నారు. ఈ నెల 8న శనివారం ఒలిచిన తలంబ్రాలను కొరియర్‌ ద్వారా భద్రాచలం రాములవారికి పంపిస్తారు. సీతారాముల కల్యాణానికి తలంబ్రాలు సిద్ధం చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తున్నామని మహిళలు చెబుతున్నారు.

చేతిగోళ్లతో ఒక్కో వరి గింజను ఒలిచి..

నవమి నాటికి అక్షింతల బియ్యం సిద్ధం

మా ఇంట్లోనే తలంబ్రాలు చేస్తాం..

ఫిబ్రవరి 15న భద్రాచలం నుంచి 2 కిలోల వడ్లను అందుకుని వలిచే కార్యక్రమాన్ని మా ఇంట్లో ప్రారంభించాము. ఈ నెల 8న శనివారం ఒలిచిన బియ్యాన్ని భద్రాచలానికి పంపిస్తాం. శ్రీసీతారాముల వారి విగ్రహాలను ప్రతిష్ఠించుకుని నియమ నిష్టలతో కాలనీ మహిళలతో కలిసి ఒలిచే కార్యక్రమం మా ఇంట్లో తలంబ్రాలుగా తయారు చేయడం సంతోషంగా ఉంది.

– ఏలిషాల సుజాత, బ్యాంక్‌కాలనీ, వరంగల్‌

ఆనందంగా ఉంది

శ్రీరామ నామాన్ని స్మరిస్తూ భక్తిభావంతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. భగవంతుని సేవ చేయడం వల్ల మాకు మంచి జరుగుతుందనే భావన. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తోటి మహిళలతో స్నేహబంధాలు పెరుగుతాయి.

– లావణ్య, బ్యాంక్‌కాలనీ, వరంగల్‌

ధన్యులమయ్యాం..

రాముల వారి కల్యాణంలో ముఖ్యమైన ఘట్టం తలంబ్రాలు.. ఈ అక్షింతలను కోటి తలంబ్రాలుగా చెబుతారు. గోటీ తలంబ్రాల కార్యక్రమంలో భాగస్తులైనందుకు ధన్యులమయ్యాం.

No comments yet. Be the first to comment!
Add a comment
రాములోరికి ‘గోటి తలంబ్రాలు’ 1
1/3

రాములోరికి ‘గోటి తలంబ్రాలు’

రాములోరికి ‘గోటి తలంబ్రాలు’ 2
2/3

రాములోరికి ‘గోటి తలంబ్రాలు’

రాములోరికి ‘గోటి తలంబ్రాలు’ 3
3/3

రాములోరికి ‘గోటి తలంబ్రాలు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement