భూమానార్య శతక పుస్తకావిష్కరణ
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగంలో మదగాని విజయలక్ష్మి రచించిన తెలంగాణ మాండలిక భాషలో భూమనార్యశతకం పుస్తకాన్ని వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి గురువారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మాండలికం ప్రధానంగా పల్లెలో వాడుక భాష సహజమైన వ్యవహారిక భాష ఈ భూమనార్యశతకం అని కొనియాడారు. తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి కేయూ తెలుగు విభాగం విశ్రాంత ఆచార్యులు అనుమాండ్ల భూమయ్య మాట్లాడుతూ..భూమనార్య మాట బుద్ది మాట మకుటంతో మదగాని విజయలక్ష్మి రాసిన భూనార్యశతకం ఒక విశేషమైనదన్నారు. ఈ సమావేశంలో తెలుగు విభాగం అధిపతి డాక్టర్ మామిడి లింగయ్య, డాక్టర్ చిర్రరాజు, గిరిజామనోహర్, సంగాల కోమల, స్వామి నాయక్, బేరి దేవేందర్, అభిరామ్, వేణు, ఎర్ర రాజు, ప్రసాద్, నిత్యానందం, విద్యార్థులు పాల్గొన్నారు.
పాలక మండలి సమావేశం వాయిదా!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సమావేశం ఈనెల 7న హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా.. వాయిదా పడినట్లు సమాచారం. పాలక మండలి సమావేశంలో చర్చించాల్సిన అంశాలు ఎజెండాను కూడా కాకతీయ యూనివర్సిటీ అధికారులు రూపొందించారు. ఈమేరకు పాలకమండలి సభ్యులకు ఆ సమాచారం కూడా అందించారు. అయితే గురువారం రాత్రి పాలకమండలి సమవేశం వాయిదా వేశామని, మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత సమాచారం అందిస్తామని వర్సిటీ అధికారులు పాలక మండలి సభ్యులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment